కోటంరెడ్డి లాంటి నాయకులు పోతే పార్టీకి దరిద్రం పోతుంది
1 Feb, 2023 18:40 IST
విజయవాడ: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి లాంటి నాయకులు వెళ్లిపోతే వైయస్ఆర్ కాంగ్రెస్ పా ర్టీకి దరిద్రం పోతుందని మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. మంత్రి పదవి ఇవ్వలేదనే కోటంరెడ్డి డ్రామా ఆడుతున్నాడని మండిపడ్డారు. కోటంరెడ్డి పనికిమాలిన మాటలు మానుకోవాలన్నారు. పోయే వాళ్లు ఏదో ఒక సాకు చెబుతారు..కేబినెట్‌లో ఎవరూ ఉండాలి అనేది సీఎం వైయస్ జగన్ ఇష్టమన్నారు. వైయస్ జగన్‌ను వీడి బయటకు వెళ్లిన వారు గాలికి కొట్టుకుపోయారని మాజీ మంత్రి కొడాలి నాని చెప్పారు. కోటంరెడ్డిని సీఎం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చి ఉంటాడని ఎద్దేవా చేశారు.