నైతిక విలువ‌లు లేని వ్య‌క్తి చంద్ర‌బాబు

19 Feb, 2024 17:17 IST

శ్రీ‌కాకుళం: నైతిక విలువలు లేని వ్యక్తి చంద్రబాబు అంటూ డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు విమ‌ర్శించారు. చంద్ర‌బాబు అధికారంలో ఉన్న‌ప్పుడు ప్ర‌జ‌ల‌కు ఏమీ చేయ‌లేక‌పోయాడ‌ని, అందుకే ఎన్నిక‌లు వ‌చ్చేస‌రికి ఆయ‌న‌కు భయం పట్టుకుంద‌న్నారు. ఒంట‌రిగా గెలువ‌లేమ‌ని భ‌యంతో చంద్ర‌బాబు పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.. పందులు గుంపుగా వస్తే.. సింహం (సీఎం వైయ‌స్‌ జగన్‌) సింగిల్‌గా వస్తాడు అని వ్యాఖ్యానించారు.. సింహంలా వైయ‌స్ జగన్ జూలువిదిల్చితే.. ఇతర పార్టీలు అన్నీ బంగాళాఖాతంలో కలిసిపోతాయని  ఏపీ డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు హెచ్చరించారు. 

సోమ‌వారం శ్రీకాకుళంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, లోకేష్ సభలకు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సభలకు ఉన్న ప్రజా స్పందన గమనించండి అని సూచించారు. మాట ఇచ్చిన తరువాత వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకే చెల్లిందని దుయ్యబట్టిన ఆయన.. గత ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో దోచేసే పరిస్థితి ఉండేది.. కానీ, ప్రస్తుతం రాష్ట్రంలో అలంటి పరిస్థితి లేదన్నారు. సీఎం వైయ‌స్‌ జగన్‌ నాయకత్వంలో సంక్షేమ – అభివృద్ధి పాలన అందిస్తున్నాం అని వెల్లడించారు. 

గతంలో పాఠశాలలు పెచ్చులు ఊడిపోయేవి, నేడు గ్రానైట్ పలకలతో గదులు సిద్ధం చేశామని  ముత్యాల నాయుడు తెలిపారు.  టీడీపీ వ్యతిరేకించినా విద్యార్థులకు ఇంగ్లీషు మీడియం నేర్పిస్తున్నాం అన్నారు. కానీ, సొంత కూతురుని ఇస్తే.. మామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. అసలు, చంద్రబాబు అంత బలంగా ఉంటే ఎందుకు జనసేన పార్టీలో, భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో పొత్తు కోసం వెంపర్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. గ‌తంలో చంద్రబాబు సీఎం కుర్చీలో కూర్చోవడానికి బాలయ్య, ఆయన కటుంబ సభ్యులు ఏవిధంగా సహకరించారో అందరికీ తెలుసని దుయ్యబట్టారు.