ప్రజాదరణ చూసి ఓర్వలేక చంద్రబాబు కుట్రలు
వైయస్ఆర్ జిల్లా: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కడప నగరంలో వైయస్ఆర్ సీపీ శ్రేణులు 2వ రోజు జనాగ్రహ దీక్ష చేపట్టారు. దీక్షలో డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రజల్లో సీఎం వైయస్ జగన్కు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం వైయస్ జగన్కు చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దీక్షలో వైయస్ఆర్ సీపీ నేతలు మాసీమ బాబు , అఫ్జల్ ఖాన్ , సోషల్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్ పులి సునీల్ కుమార్, షఫీ, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.