పియూష్ పాండే మృతి ప‌ట్ల వైయ‌స్ జ‌గ‌న్ దిగ్భ్రాంతి

24 Oct, 2025 17:30 IST

తాడేప‌ల్లి: పద్మశ్రీ అవార్డు గ్రహీత పియూష్ పాండే మృతి పట్ల వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "ప్రకటనల ప్రపంచంలో ఆయనో అద్భుతం. ఆయన సృజనాత్మకత కథనాలకు కొత్త నిర్వచనం ఇచ్చింది అంటూ వైయ‌స్ జ‌గ‌న్ త‌న ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.  ఆయన కుటుంబ సభ్యుల‌కు త‌న ప్ర‌గాఢ‌ సానుభూతి తెలియజేశారు. సాక్షి, భారతి సిమెంట్స్ ప్రారంభించడానికి ఆయన చేసిన కృషిని ఈ సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ గుర్తు చేసుకున్నారు.