నేడు శ్రీకాళహస్తికి సీఎం వైయస్ జగన్
28 Dec, 2020 10:18 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో పర్యటించనున్నారు. ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఊరందూరులో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేయనున్నారు. అంతేకాకుండా తొలి విడత ఇళ్ల నిర్మాణ పనులను సీఎం ప్రారంభించనున్నారు. కాసేపట్లో తాడేపల్లిలోని తన నివాసం నుంచి శ్రీకాళహస్తికి సీఎం వైయస్ జగన్ బయల్దేరనున్నారు. ఉదయం 11.20 గంటలకు ఊరందూరు చేరుకొని పైలాన్ ఆవిష్కరించి, పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేస్తారు. అనంతరం వైయస్‌ఆర్ జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.