సమరయోధులకు సీఎం వైయస్ జగన్ నివాళి
15 Dec, 2020 13:36 IST
తాడేపల్లి: అమరజీవి పొట్టి శ్రీరాములు, భారత తొలి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయి పటేల్ వర్ధంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఇరువురి చిత్రపటాలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఏపీ అగ్రి మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీయస్ నాగిరెడ్డి, ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.