పునీత్ రాజ్‌కుమార్ మృతికి సీఎం వైయస్ జగన్ సంతాపం
29 Oct, 2021 16:36 IST
తాడేపల్లి: కన్నడ సినీ దిగ్గజం రాజ్‌కుమార్ కుమారుడు, ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పునీత్ రాజ్‌కుమార్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.