ఘనంగా ప్రారంభమైన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్
3 Mar, 2023 10:41 IST
విశాఖ: విశాఖపట్నం వేదికగా ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది. సమ్మిట్‌కు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు దేశ, విదేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. జ్యోతిప్రజ్వలన చేసి ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023ను ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. సీఎం వైయస్ జగన్ వెంట రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, కరణ్ అదానీ, సంజీవ్ బజాజ్, జీఎం రావు, నవీన్ జిందాల్, 45కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. మరికాసేపట్లో పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి సీఎం వైయస్ జగన్ ప్రసంగించనున్నారు.