ఘనంగా సీఎం వైయస్ జగన్ జన్మదిన వేడుక
21 Dec, 2021 12:29 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలు సీఎం నివాసంలో ఘనంగా జరిగాయి. పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి వేదపండితులు సీఎంను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం మంత్రులు, సీఎంఓ అధికారుల సమక్షంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ కేక్ కట్ చేశారు. మంత్రులు, అధికారులు సీఎంకు బర్త్ డే విషెస్ తెలుపుతూ కేక్ తినిపించారు. ఈ వేడుకలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఆదిమూలపు సురేష్, నారాయణస్వామి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ తదితరులు పాల్గొన్నారు.