సభలో పద్ధతిగా ప్రవర్తించాలి
1 Dec, 2020 15:47 IST
అమరావతి: సభలో సభ్యులు పద్ధతిగా ప్రవర్తించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. స్పీకర్ తమ్మినేని సీతారాంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు పేపర్లు విసిరివేయడం, వేలు పెట్టి బెదిరించడాన్ని సీఎం వైయస్ జగన్ తప్పుపట్టారు. ఇక్కడ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఒక్క విషయం గమనించాలి.ఈ రోజు టాఫిక్ ఇళ్ల నిర్మాణాలు, టిడ్కోపై చర్చ జరుగుతోంది. దీనిపై హౌసింగ్, పురపాలక మంత్రులు మాట్లాడారు. వారు సరిగ్గా మాట్లాడకముందే..స్పీకర్ పై చంద్రబాబు పేపర్లు విసిరేసి, వేలు పెట్టి బెదిరించడం సరికాదు. ఒక ప్రోసిజర్ ఉంటుందని సీఎం వైయస్ జగన్ హితవు పలికారు.