చెన్నకేశవరెడ్డి మనవడి వివాహ వేడుకకు ముఖ్యమంత్రి హాజరు
15 Feb, 2024 12:12 IST
కర్నూలు: ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి మనువడు పవన్ కల్యాణ్‌రెడ్డి వివాహ వేడుకకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. కర్నూలులోని బళ్లారి చౌరస్తా సమీపంలో కింగ్ ప్యాలెస్ గ్రాండ్‌లో జరిగిన వివాహ వేడుకకు హాజరైన సీఎం వైయస్ జగన్.. నూతన వధూవరులకు పుష్పగుచ్ఛం అందజేసి ఆశీర్వదించారు. సీఎం వైయస్ జగన్ వెంట వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.