విజయమ్మను జిల్లాకు ఆహ్వానించాలి
10 Oct, 2012 06:58 IST
మహబూబ్‌నగర్: జిల్లాను పసిడి పాలమూరుగా చేస్తానన్న సంకల్పంతో దివంగత మహానేత ప్రారంభించిన జలయజ్ఞం ప్రాజెక్టులను పూర్తిచేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ప్రాజెక్టుల దీక్షను చేపట్టడానికి పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను జిల్లాకు ఆహ్వానించాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీర్మానించారు. వైయస్ జగన్‌మోహన్‌రె డ్డి సోదరి షర్మిల చేపట్టనున్న పాదయాత్రను పాలమూరు జిల్లా నుంచే ప్రారంభించేలా అధిష్టానాన్ని ఒప్పించాలని కూడా ఏకగ్రీవంగా తీర్మానించారు. ముందుగా దివంగత మహానేత వైయస్‌కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జిల్లాలో పార్టీ పటిష్టత కోసం సంస్థాగత మార్పులు చేయాలని సూచించారు. కార్యకర్తల మనోభావాలను, సమావేశంలో చేసిన నిర్ణయాలను పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తదితర కేంద్ర కమిటీ నాయకులకు నివేదించాలని పార్టీ సీజీసీ సభ్యురాలు వి. బాలమణెమ్మకు బాధ్యతలు అప్పగించారు.