ఇస్రో శాస్తవేత్తలకు వైయస్ జగన్ అభినందనలు
19 Dec, 2018 17:10 IST
అమరావతి: సమాచార వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా చేపట్టిన జీశాట్-7ఏ ఉపగ్రహం నిర్ణీత కక్ష్యలోకి చేరుకోవడం పట్ల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇస్రో శాస్తవేత్తలకు అభినందనలు తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి బుధవారం సాయంత్రం 4.10 గంటలకు జియో సింక్రోనస్ లాంచింగ్ వెహికల్ (జీఎస్‌ఎల్‌వీ–ఎఫ్11) ప్రయోగించారు.
ఎలాంటి అవాంతరాలు లేకుండా జీఎస్‌ఎల్‌వీ వెహికల్ నింగిలోకి దూసుకెళ్లింది. 2,250 కిలోలు బరువు కలిగిన జీశాట్–7ఎ ఉపగ్రహాన్ని మోసుకుని జీఎస్‌ఎల్‌వీ రాకెట్ నింగి వైపునకు దూసుకెళ్లింది. దీంతో ఈ ఉపగ్రహం 8 ఏళ్ల పాటు విమానయాన వ్యవస్థకు సేవలు అందించనుంది. కొద్ది రోజుల నుంచి వాతావరణం అనుకూలించకపోయినా సిబ్బంది, శాస్త్రవేత్తలు అంకితభావంతో పనిచేసి విజయవంతం చేయడం గొప్ప విషయమన్నారు. భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని వైయస్ జగన్ ఆకాంక్షించారు.