కావ్...కావ్..కావ్..!

9 Jun, 2015 23:34 IST

లోకంలో...ప్రత్యేకించితెలుగురాష్ట్రాల్లోఅన్యాయంబాగాపెరిగిపోతోందనిఆషాఢభూతితెగఆందోళనపడుతున్నారు. ఆషాఢభూతికిపొలిటికల్నాలెడ్జ్బాగాఎక్కువ. తెలుగుదేశంఅంటేవల్లమాలినఅభిమానం. చంద్రబాబునాయుడంటేఇహచెప్పాల్సినఅవసరమేలేదు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడానికి నిజాయితీగా కొందరు ఎమ్మెల్యేలను కొనాలనుకున్న చంద్రబాబునాయుడిపైనా... చంద్రబాబు ఆదేశాలతో ఎమ్మెల్యేస్టీఫెన్సన్ ఇంటికి సూట్కేసుతో వెళ్లి చక్కగా బేరమాడివచ్చిన రేవంత్రెడ్డిపైనా ఏసీబీ పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆషాఢభూతి మండిపడుతున్నాడు.

ఉమ్మడిరాజధానిలో  తనమానానతానుఎమ్మెల్యేలనుబేరమాడుకుంటోన్నచంద్రభూబాబునాయుడి  మాటలటేపులనుబహిర్గతంచేయడంసభ్యతకాదని..సంస్కారంకాదని..అదిక్షుద్రమైన...నీచమైన...రాజకీయకుట్రేనని ఆషాఢభూతితిట్టిపోస్తున్నాడు.

అసలు రేవంత్రెడ్డి స్టీఫెన్సన్ ఇంటికో మరోఎమ్మెల్యే ఇంటికోవెళ్తేతప్పేంటని..బాస్చంద్రబాబు కోసం ఒకరిద్దరుఎమ్మెల్యేల ఓట్లనుడబ్బులిచ్చికొనుక్కోవడంలో తప్పేంటో అసలు అర్ధంకావడంలేదని ఆషాఢభూతి జుట్టుపీక్కుంటున్నాడు.

అప్పుడెప్పుడో వైస్రాయ్హోటల్లో వందమందికిపైగా ఎమ్మెల్యేలను బేరమాడినపుడు ఈఅధికారులు.. వారివిధినిర్వహణలూ ఏమయ్యాయని ఆషాఢబూతి నిప్పులుచెరుగుతున్నాడు.వైస్రాయ్ఎపిసోడ్తర్వాతచంద్రబాబుసిఎంఅయితే....ఇపుడుసిఎంచంద్రబాబుపై  ఓఎపిసోడ్షూట్చేయడంపరమకిరాతకమని..దుర్మార్గమని...కక్షపూరితమని...ఆషాఢభూతివ్యాఖ్యానిస్తున్నాడు.

పెపంచకంలోఇంతటిఘోరాన్నితానెప్పుడూచూడలేదన్నఆషాఢభూతి...రెండురాష్ట్రాల్లోనిఅవకాశవాదులు...ఆషాఢభూతి వారసులు...రాజకీయబేహారులూఅందరూకూడాచంద్రబాబువెన్నంటేఉంటారని..ప్రతిజ్ఞచేశాడు. నీతి ..నిజాయితీ...విలువలు..న్యాయం గురించి మాట్లాడే వాళ్లంతాతెలుగుదేశానికి ...చంద్రబాబునాయుడి కీశత్రువులేనని  ఆషాఢభూతితీర్మానించేశాడు.

మరంచేత చంద్రబాబునాయుడిఅభిమానులు...గుండెలపై చెయ్యేసుకునిఉండొచ్చని భరోసాకూడాఇస్తున్నాడు.

----------------------

-కవికాకి