Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             తుమ్మికాపాలెం నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 270వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               ప్రజా సంకల్ప యాత్రలో చారిత్రాత్మక ఘట్టం. 3000 కిలోమీటర్ల మైలురాయి చేరుకున్న వైయస్‌ జగన్‌                                వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం లోకి ప్రవేశం                               దేశపాత్రునిపాలెం వద్ద 3వేల కిలోమీటర్ల పైలాన్‌ ఆవిష్కరణ                               ఏపీలో వ్యవసాయ రంగం కుదేలు కావడానికి చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలే కారణం: వైయ‌స్ఆర్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి                                సంక్షేమ రాజ్యం రావాలంటే వైఎస్‌ జగన్‌ సీఎం కావాలి.. కావాల్సిందే: బొత్స సత్యానారాయణ                                ఇంటికో రేటు.. పెన్షన్‌కో రేటు వసూలు: వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నాయ‌కులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌                               కాగ్‌ నివేదికలో పోలవరం అవినీతి బట్టబయలు అయింది: ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి                                వైయ‌స్‌ జగన్‌ పాదయాత్రలో ఊళ్లకు ఊళ్లు కదిలివస్తున్నాయి.. దేశంలోనే వైయ‌స్‌ జగన్‌ వంటి ప్రజాదరణ కలిగిన నేత మరొకరు లేరు: తలశిల రఘురాం                 
న్యూస్
లండన్‌లో 12న యుకె వైయస్ఆర్‌సిపి ధర్నా
భారత హైకమిషన్‌ కార్యాలయం ముందు ఆందోళన

Published on : Wed, 09th October, 2013
Share

లండన్, 9 అక్టోబర్ 2013: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించేందుకు కాంగ్రె‌స్ ప్రభుత్వం‌ నిరంకుశంగా, ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ యు.కె. విభాగం ఈ నెల 12న నిరసన కార్యక్రమం నిర్వహించనున్నది. ఆ రోజు (శనివారం) మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ లండన్‌లోని భారతీయ హై కమిషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించేందుకు నగర మెట్రోపాలిటన్ పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నామని శ్రీకాంత్ లింగాల, వైఎల్ఎ‌న్ రెడ్డి, రాజుల ‌ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున యుకె, యూరప్‌లోని సమైక్యవాదులందరూ పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా 70 రోజులకు పైగా సీమాంధ్ర ప్రజలు చేస్తున్న ఆందోళన, నిరసన కార్యక్రమాలను పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ‌ దూకుడుగా ముందుకు వెళ్లడంపై ప్రవాసాంధ్రుల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతోందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ యుకె విభాగం నాయకులు తమ ప్రకటనలో తెలిపారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రజ‌లంతా సమైక్యంగా కష్టపడి కృషి చేసి రాష్ట్రా‌నికి, హైదరాబాద్ నగరానికి ప్రపంచ పటంలో గుర్తింపు లభించేలా చేశారని వారు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆదాయంలో ‌50 శాతానికి పైగా హైదరాబాద్‌ నుంచే వస్తున్న సంగతిని వారు ప్రస్తావించారు. వాస్తవ పరిస్థితులను బేరిజు వేసుకోకుండా తన కుమారుడు రాహుల్ గాంధీని ప్రధాని పీఠం ఎక్కించడానికి సోనియా‌ గాంధీ, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడానికి సిద్ధపడటంతో సీమాంధ్ర‌ మొత్తంగా జరుగుతున్న ఆందోళనలు, సమ్మె జరుగుతున్నాయన్నారు. దీనితో పలు రంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయని ప్రవాసాంధ్రులు వ్యక్తం చేశారు.

మరింత సమాచారం కోసం 07540 222344, 07885971115, 07429 300528 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చని‌ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ యుకె విభాగం నాయకులు తెలిపారు.

మరిన్ని

A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: type

Filename: nri/view_news.php

Line Number: 248

A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: array

Filename: nri/view_news.php

Line Number: 248


ప్రతి ఇంటికీ నవరత్నాలు
YSRCP Navaratna YS Rajashekar Reddy YS Rajashekar Reddy Emperor of Corruption YS Rajashekar Reddy Central Assistance to AP Prajalachentha
Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com