Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు 72వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి                               వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌లు                               విశాఖ జిల్లా ఎర్రవరంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఏపీ ప్రతిపక్షనేత, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి                                నర్సీపట్నం నియోజకవర్గం గన్నవరం మెట్ట వద్ద విశాఖ జిల్లాలోకి అడుగుపెట్టిన జననేత వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌                               వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ 237వ రోజు కాకరపల్లి నుంచి ప్రారంభం                               వైయ‌స్ఆర్‌సీపీ నిజనిర్ధారణలో భాగంగా గుంటూరు జిల్లా గురజాల వెళ్తున్న మాజీ ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి అరెస్ట్                                వైయ‌స్ఆర్‌సీపీ నిజనిర్ధారణలో భాగంగా గుంటూరు జిల్లా గురజాల వెళ్తున్న పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణను కాజా టోల్‌గేట్‌ వద్ద అడ్డుకున్న పోలీసులు                                ఆగ‌స్టు 15వ తేదీ నుంచి ప్ర‌కాశం జిల్లాలో మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పాద‌యాత్ర‌                               రేపు గుర‌జాల‌లో వైయ‌స్ఆర్‌సీపీ నిజ‌నిర్ధార‌ణ క‌మిటీ ప‌ర్య‌ట‌న‌                 
అధ్యక్షుని సందేశం
ఆంధ్ర ప్రదేశ్ సమగ్రాభివృద్ధికి నాతో చేతులు కలపండి ప్రియమైన సోదర, సోదరీమణులారా! విదేశాల్లో ఉంటూ ఆంధ్ర ప్రదేశ్ సామాజిక, ఆర్థిక, రాజకీయ పురోభివృద్ధికి తపించే తెలుగువారి కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవాసాంధ్ర సంఘం ఏర్పాటైంది. స్పందించే గుణం తెలుగువారి సొంతం. ప్రపంచం నలుమూలల్లో నివసిస్తున్న వారిలో అది ఇంకో పాలు ఎక్కువే. మన రాష్ట్రంలో సంభవించే ఎటువంటి పరిణామాలపైనైనా తక్షణం తమ స్పందన తెలియజేస్తుంటారు. రాష్ట్రాభివృద్ధిలో మీ భాగస్వామ్యానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవాసాంధ్ర విభాగాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ విభాగంలో యూఎస్ఎ, యూకే& యూరప్, సింగపూర్, గల్ఫ్, మలేసియా, ఆస్ట్రేలియా దేశాల్లో ఉండే ఎన్ ఆర్ ఐ సోదరీ సోదరుల కోసం ప్రవాసాంధ్రుల సంఘాలు ఏర్పడ్డాయి. వీటి ద్వారా పార్టీ సేవల్ని విస్తరించటం జరిగింది. తెలుగు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది.
మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణం కారణంగా ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల బాధ్యతను పూర్తిచేసేందుకు పార్టీ కంకణం కట్టుకుంది. రాష్ట్ర ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉంది. ఈ మహోన్నత లక్ష్య సాధనలో మీరంతా క్రియాశీల భాగస్వాములు కావాలని కోరుతున్నాను.
విదేశాలలోని తెలుగు ప్రజల ఐకమత్యాన్ని మహానేత ప్రగాఢంగా ఆకాంక్షించిన విషయం అందరికీ తెలుసు. అదేవిధంగా మాతృదేశంలోని తెలుగువారి అభ్యున్నతికి ఇతోధికంగా కృషిచేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సమయంలో మీ నుంచి లభించిన మద్దతు, ప్రోత్సాహం ఎప్పటికీ మరువలేను. మీరు నివసిస్తున్న దేశాలలో మా తండ్రిగారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తుండడం ఆయన పట్ల మీకున్న ప్రేమాభిమానాలను చాటిచెబుతోంది. ఆయన మీ గుండెల్లో చెక్కుచెదరకుండా ఉన్న అంశాన్ని వెల్లడిస్తోంది.
మహానేత పాలనలో ప్రజలు అనుభవించిన సువర్ణ యుగాన్ని తిరిగి తేవడమే వైయస్ఆర్ సీపీ ఏకైక లక్ష్యం. వైయస్ఆర్ దార్శనికత పునరావిష్కరణకు నేను చేస్తున్న పోరాటానికి నాతో చేతులు కలపాల్సిందిగా కోరుతున్నాను. ఆయన హఠాన్మరణం కారణంగా మధ్యలో నిలిచిన సంక్షేమ కార్యక్రమాల పరిపూర్తికి సహకరించాల్సిందిగా విజ్ఙప్తి చేస్తున్నాను. ఖండాంతరాలలో ఉన్న మీరు నా పోరాటానికి శిలాసదృశమైన మద్దతు పలుకుతుండటం ఎంతో ఆనందాన్నిస్తోంది. వైయస్ఆర్ ఆశయాలకు కట్టుబడి ఉంటామనీ, మాతృభూమి రుణం తీర్చుకుంటామని మీరు ప్రతిజ్ఙ చేశారని తెలిసి, నా దీక్ష పదింతలయ్యింది. నా లక్ష్య సాధనకు మీరంతా నాతో చేతులు కలపాల్సిన సమయం ఆసన్నమయ్యింది.
మీ మనస్సులో చెరగని ముద్ర వేసిన మహానేత దార్శనికతకు అనుగుణంగా మీ దేశాల్లో ప్రత్యేకంగా రూపొందించిన కార్యక్రమాలను చేపట్టడానికి మీరంతా వైయస్ఆర్ సీపీ వెంట నడవాలని కోరుతున్నాను. వైయస్ఆర్ చూపిన బాటలో నడిచి, ఆ స్వర్ణయుగాన్ని పునర్నిర్మించడానికి మనమందరం చేతులు కలిపి నడుద్దాం.



వైయస్ జగన్మోహన్ రెడ్డి
Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com