Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన‌ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 300వ రోజు పార్వతీపురం నియోజకర్గంలోని కోటవానివలస నుంచి ప్రారంభం                               ‘నాపై జరిగిన హత్యాయత్నంలో చంద్రబాబుకు ఎలాంటి ప్రమేయం లేకపోతే.. స్వతంత్ర దర్యాప్తు సంస్థతో కేసు విచారణ చేయించొచ్చు కదా’ : వైయ‌స్ జ‌గ‌న్‌                                చంద్రబాబు రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు: ఆనం రామనారాయణ రెడ్డి                               ఏ విచారణకైనా సిద్ధమని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా ?: అంబటి రాంబాబు సవాల్‌                                పచ్చచొక్కాల కోసమే ప్రభుత్వ పథకాలు: వైవీ సుబ్బారెడ్డి                               బిడ్డ పుట్టి ఓటు హక్కు వచ్చిన తర్వాత తనకే ఓటు వేస్తారని చంద్రబాబు పేర్కొనడం హాస్యాస్పదం: పేర్నినాని                               వైయ‌స్ జ‌గ‌న్ బాలల దినోత్సవ శుభాకాంక్షలు                                మాజీ మంత్రి సి.రామ‌చంద్ర‌య్య వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               నాలుగేళ్లుగా దళితుల సమస్యలపై చంద్రబాబు స్పందించలేదని, ఎన్నికలకు 6 నెలల ముందు ఎస్టీలకు మంత్రి పదవి ఇచ్చారు: టీజేఆర్ సుధాక‌ర్‌బాబు                 
    Show Latest News
రాజధాని పేరుతో టీడీపీ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం
– వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్‌ సుధాకర్‌బాబు

Published on : 25-Jun-2018 | 16:46
 – సామాన్యుల భూములు లాక్కుని..రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం
– సింగపూర్‌కు భూములు ధారాదత్తం చేశారు
– రాజధాని నిర్మాణంలో ఒక్క ఇటుక పడలేదు
– లింగమనేని ఎస్టేట్‌లో బాబు, లోకేష్‌ల వాటా ఎంతో తేల్చాలి
– రాజధాని భూములు, లింగమనేని ఎస్టేట్‌పై సీబీఐ విచారణ జరపాలి
– సీపీఐ రామకృష్ణ చంద్రబాబు తొత్తు
విజయవాడ: రాజధాని పేరుతో టీడీపీ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుందని వైయసార్‌సీపీ అధికార ప్రతినిధి, సంతనూతలపాడు సమన్వయకర్త టీజô ఆర్‌ సుధాకర్‌బాబు విమర్శించారు. రైతుల వెన్ను విరిచారు..రైతు కూలీల ఉపాధి పోగొట్టారని, సామాన్యుల భూములు లాక్కొని సింగపూర్‌కు ధారదత్తం చేశారని మండిపడ్డారు. లింగమనేని ఎస్టేట్‌ అక్రమ కట్టడమని, అందులో చంద్రబాబు నివాసం చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. లింగమనేని ఎస్టేట్, రాజధాని భూములపై సీబీఐ విచారణ చేపట్టాలని ఆయన డిమాండు చేశారు.  సోమవారం విజయవాడలో సుధాకర్‌బాబు మీడియాతో మాట్లాడారు.  రాజధాని పేరుతో సామాన్యుల భూములు లాక్కుని..వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజధాని పేరుతో రైతుల నుంచి తీసుకున్న భూములను సింగపూర్‌కు కారు చౌకగా ధారదత్తం చేశారన్నారు. అట్టహాసంగా రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసిన చంద్రబాబు నాలుగేళ్లలో ఏం చేయలేదన్నారు. లింగమనేని ఎస్టేట్‌ అక్రమ కట్టడమని, అలాంటి ఇంటిలో ముఖ్యమంత్రి నివాసం ఉండటం సరికాదన్నారు. 2014 కంటే లింగమనేని ఆస్తులు, ఆదాయం, ఆ తరువాత ఉన్న వాటిపై విచారణ చేపట్టాలన్నారు. మా వద్ద అన్ని అధారాలున్నాయని, సీబీఐ విచారణ ఏర్పాటు చేస్తే మేం సమర్పిస్తామన్నారు. టీడీపీ నేతలు దోపిడీ దొంగలని, పేదల భూములు లాక్కున్నారన్నారు. ఒక రేషన్‌కార్డుకు రూ.2500 పింఛన్‌ ఇచ్చి వారి జీవితాలను సర్వనాశనం చేశారన్నారు. సామాన్యుల భూములపై లింగమనేని రమేష్‌ కన్నుపడిందన్నారు. ఈ కుంభకోణంలో లోకేష్‌ వాటా ఎంతో చెప్పాలన్నారు.

–సీపీఐ రామకృష్ణ వైయస్‌ జగన్‌పై విమర్శలు చేయడం సరికాదన్నారు. సీపీఐ జాతీయ నాయకత్వంతో తమకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. రామకృష్ణ చంద్రబాబుకు తొత్తుగా మారారని విమర్శించారు. వైయస్‌ జగన్‌కు ముఖ్యమంత్రి కావాలని రామకృష్ణ విమర్శించడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రజలకు మేలు చేసేందుకు వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారని, అన్ని వర్గాల ప్రజలు వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని ఎదురుచూస్తున్నారన్నారు. వ్యాపార దృక్ఫథంతో రామకృష్ణ చంద్రబాబుకు తొత్తుగా మారారని ఆరోపించారు. వైయస్‌ జగన్‌ అడుగుపెట్టగానే కృష్ణా బ్యారేజ్, గోదావరి బ్రిడ్జీలు వణికాయన్నారు. అందుకే అందరికి భయం పట్టుకుందన్నారు.
– జనసేనతో కలిసి పోటీ చేస్తామని మేం ఎక్కడా చెప్పలేదని సుధాకర్‌బాబు తెలిపారు. రామకృష్ణ చంద్రబాబు మనిషి అని, ఆయన విషయంలో పవన్‌ కళ్యాణ్‌ జాగ్రత్తగా ఉండాలన్నారు. అగ్రిగోల్డు వ్యవహారంలో రామకృష్ణ మనిషి ముప్పాల నాగేశ్వరరావుకు సంబంధాలు ఉన్నాయన్నారు. మీ వద్దకు రామకృష్ణ వస్తే ఈ విషయంపై పవన్‌ ప్రశ్నించాలన్నారు. అగ్రిగోల్డు వ్యవహారంలో నాగేశ్వరరావుకు ఉన్న సంబంధాలు ఏంటో చెప్పాలన్నారు.  నేను చేసిన ఆరోపణల్లో పస లేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, ఆగ్రిగోల్డు వ్యవహారంలో రామకృష్ణకు ఎంత ముట్టాయో చెప్పాలని డిమాండు చేశారు. 
 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com