Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             పారాది నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 290వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               గుంటూరు జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు మల్లాది శివన్నారాయణ, చిలకలూరిపేట టీడీపీ మాజీ అధ్యక్షుడు శివయ్య, జి.వెంకట్రావు, కె.కాంతారావులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               దేశంలో, రాష్ట్రంలో ఇలాంటి అబద్ధపు ముఖ్యమంత్రి ఎక్కడా లేరని, గల్ఫ్‌ దేశాల్లో ఇలాంటి అబద్ధాల ముఖ్యమంత్రిని ఎప్పుడో ఉరి తీసేవారు: ఎమ్మెల్యే ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి                               చంద్రబాబు..నీకిదే ముఖ్యమంత్రిగా చివరి అవకాశం...నిన్ను దగ్గరగా గమనించిన మనిషిగా చెబుతున్నా: త‌మ్మినేని సీతారాం                               శ్రీకాకుళం ఉద్యమాల పురిటిగడ్డ...ఎంతమందిపై కేసులు పెడతావ్. : త‌మ్మినేని సీతారాం                               నీళ్లో రామచంద్ర అని అడుగుతున్నవారికి వారి దాహార్తి తీరుస్తారే కాని వారిని సైతం బుల్డోజర్‌ తో తొక్కిస్తా అని అనగల ధైర్యం చంద్రబాబుకే ఉంది: భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి                               వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన మ‌ధువాడ అన్న‌దాత‌లు                               టీడీపీ తోక పత్రికలో 108 దుస్థితిపై వచ్చిన కథనాలను ఏమంటారు.. అది నిజం కాకపోతే ఆ వార్తలను ఎందుకు ఖండించలేదు: సుధాక‌ర్‌బాబు                               - విజ‌య‌న‌గ‌రం జిల్లా చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని ఆనంద‌పురం క్రాస్ వ‌ద్ద 3100 కిలోమీట‌ర్ల వ‌ద్ద వేప మొక్క‌ను నాటిన వైయ‌స్ జ‌గ‌న్‌                 
    Show Latest News
ఎవరి కాళ్లు పట్టుకోవడానికి బాబు ఢిల్లీ వెళ్లారు?
– వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు

Published on : 21-Jul-2018 | 18:40
 – అవిశ్వాసానికి ముందు బాబు ఢిల్లీ ఎందుకు వెళ్లలేదు
–  ఏం సర్దుబాటులు చేయడానికి బాబు ఢిల్లీ వెళ్లారు
– అవిశ్వాస తీర్మానం మొట్టమొదట పెట్టింది వైయస్‌ఆర్‌సీపీనే
– గతంలో అవిశ్వాసంతో ఏమొస్తుందని చంద్రబాబు అన్నారు
– బాబు అన్ని పార్టీల మద్దతు కూడగట్టినట్లు హడావుడి చేశారు
– వైయస్‌ఆర్‌సీపీ వల్లే హోదా నినాదం ఈ స్థాయికి చేరింది

విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు ఎవరి కాళ్లు పట్టుకోవడానికి ఇవాళ ఢిల్లీ వెళ్లారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. నిన్న పార్లమెంట్లో జరిగిన అవిశ్వాస తీర్మానం అంశంపై జరిగిన చర్చ, ఆ తరువాత చంద్రబాబు తీరును అంబటి రాంబాబు తీవ్రంగా తప్పుపట్టారు. ప్రత్యేక హోదా నినాదం ఈ స్థాయికి చేరిందంటే అది వైయస్‌ఆర్‌సీపీ పోరాట ఫలితమే అని ఆయన వెల్లడించారు. విజయవాడలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడారు. అవిశ్వాస తీర్మానం మీద స్పీకర్‌ చర్చకు అంగీకరించారన్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టాలని మొదట వైయస్‌ఆర్‌సీపీ భావించిందన్నారు. గత బడ్జెట్‌ సెషన్‌లో కొన్ని పరిణామాల తరువాత వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామాలు చేశారన్నారు. మేం అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు స్పీకర్‌ అంగీకరించలేదన్నారు. 13 సార్లు స్పీకర్‌కు నోటీసులు ఇస్తే ..చంద్రబాబు హేళనగా మాట్లాడారని గుర్తు చేశారు. సంఖ్యాబలం లేకుండా అవిశ్వాస తీర్మానం ఎలా పెడతారని ప్రశ్నించారని తెలిపారు. నిన్న జరిగిన చర్చ తరువాత చంద్రబాబు పెద్ద ఆర్భాటం చేశారన్నారు. దేశంలో ఉన్న రాజకీయ పక్షాలను ఏకం చేస్తున్నట్లు హడావుడి చేశారన్నారు. పరమానంద శిష్యులు ఓ సూదిని దూలానికి గుచ్చి తీసుకెళ్లినట్లు చంద్రబాబు హడావుడి ఉందన్నారు. చివరికి అవిశ్వాస తీర్మానం అంశం వీగిపోవడం బాధాకరమన్నారు. టీడీపీ ఎంపీలు తప్ప..ఏ రాజకీయ పార్టీలు కూడా ప్రత్యేక హోదా ఏపీకి ఇవ్వాలని కోరలేదు. దీనికి తోడు మోడీ కూడా ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని చెప్పారు. ఇది బాధాకరమన్నారు. ప్రత్యేక హోదా బతికి ఉన్నది అంటే అది వైయస్‌ఆర్‌సీపీ పోరాట ఫలితమే అన్నారు. బీజేపీ, టీడీపీ రెండూ కూడా ప్రత్యేక హోదా రాకుండా  అడ్డుకున్నారన్నది వాస్తవం అన్నారు. 14వ ఆర్థిక కమిషన్‌ వచ్చే వరకు చంద్రబాబుకు ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అన్నారని గుర్తు చేశారు. అది తెరచి ఉంచడానికి కష్టపడ్డామన్నారు. వైయస్‌ జగన్‌ ఎన్నో యువభేరీలు పెట్టారని, ప్రజలను చైతన్యవంతం చేశామని చెప్పారు. విద్యార్థులపై కేసులు పెట్టారని, ప్రోఫెసర్స్‌ను ఇబ్బందిపాలు చేశారన్నారు. నాడు చంద్రబాబు మోడీని భుజాలపై మోశారన్నారు. చంద్రబాబు ఇప్పుడు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. నిన్న టెలీ కాన్ఫరెన్స్‌లో మీ ఎంపీలను అలర్ట్‌ చేసే చంద్రబాబు ఢిల్లీకి ఎందుకు వెళ్లలేదని నిలదీశారు. ఇవాళ ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చిందని, ఎవరి కాళ్లు పట్టుకోవడానికి వెళ్లారని ప్రశ్నించారు. రాత్రి 12 గంటలకు చంద్రబాబు ప్రెస్‌మీట్లు పెట్టాల్సిన అవసరం ఏముందన్నారు. చంద్రబాబు చిత్తశుద్దితో ప్రత్యేక హోదా కోసం ప్రయత్నం చేయడం లేదన్నారు. వైయస్‌ జగన్‌ ఆ నాడే చెప్పారని తెలిపారు. మోడీ కూడా నిన్న సభలో చంద్రబాబు మీరు వైయస్‌ఆర్‌సీపీ ఉచ్చులో పడుతున్నారని అన్నట్లు గుర్తు చేశారు. వైయస్‌ జగన్‌ నేరస్తుడా? నేరారోపణ ఉంటే వారు నేరస్తులా అని ప్రశ్నించారు. నేరస్తుడిగా చిత్రీకరించి, మాపై బురద జల్లి ఎందుకు ఈ విధంగా హింసిస్తున్నారని మండిపడ్డారు. మీ పార్టీలో ఎంత మందిపై కేసులు మోపారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా డిమాండు చేయడం, బతికించడం ఉచ్చు అయితే..మళ్లీ మళ్లీ చేస్తానే ఉంటామని స్పష్టం చేశారు. 25 ఎంపీ స్థానాలు కలిగిన ఏపీని కూడా ఆశించే అవకాశం కావాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ప్రత్యేక హోదా గురించి చిత్తశుద్ధితో పనిచేస్తున్నది వైయస్‌ఆర్‌సీపీనే అని స్పష్టం చేశారు. 


 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com