Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన‌ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 300వ రోజు పార్వతీపురం నియోజకర్గంలోని కోటవానివలస నుంచి ప్రారంభం                               ‘నాపై జరిగిన హత్యాయత్నంలో చంద్రబాబుకు ఎలాంటి ప్రమేయం లేకపోతే.. స్వతంత్ర దర్యాప్తు సంస్థతో కేసు విచారణ చేయించొచ్చు కదా’ : వైయ‌స్ జ‌గ‌న్‌                                చంద్రబాబు రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు: ఆనం రామనారాయణ రెడ్డి                               ఏ విచారణకైనా సిద్ధమని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా ?: అంబటి రాంబాబు సవాల్‌                                పచ్చచొక్కాల కోసమే ప్రభుత్వ పథకాలు: వైవీ సుబ్బారెడ్డి                               బిడ్డ పుట్టి ఓటు హక్కు వచ్చిన తర్వాత తనకే ఓటు వేస్తారని చంద్రబాబు పేర్కొనడం హాస్యాస్పదం: పేర్నినాని                               వైయ‌స్ జ‌గ‌న్ బాలల దినోత్సవ శుభాకాంక్షలు                                మాజీ మంత్రి సి.రామ‌చంద్ర‌య్య వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               నాలుగేళ్లుగా దళితుల సమస్యలపై చంద్రబాబు స్పందించలేదని, ఎన్నికలకు 6 నెలల ముందు ఎస్టీలకు మంత్రి పదవి ఇచ్చారు: టీజేఆర్ సుధాక‌ర్‌బాబు                 
    Show Latest News
నాడు మూడో కన్ను నేడు ఛీబీఐగా మారిందా..?
- వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ

Published on : 23-Oct-2018 | 15:20
 

- అవసరాలకు వాడుకుంటూ సీబీఐని చంద్రబాబు భ్రష్టుపట్టించాడు
- పచ్చమీడియాకు నచ్చితే నంది.. నచ్చకపోతే పంది
- వైయస్‌ జగన్‌పై కేసుల సమయంలో పచ్చపత్రికల అత్యుత్సాహం
- బాబు బినామీ సీఎం రమేష్‌పై దాడి జరగగానే ఛీబీఐ
- పెంపుడు కుక్క స్థాయి కూడా దాటి పిచ్చికుక్కలా మారుతున్న స్థితి
- తుపాన్‌ బాధిత ప్రాంతాల్లో ప్రభుత్వ సేవలు భేష్ అని జేడీ కితాబు సిగ్గుచేటు
- మాజీ జేడీ లక్ష్మీనారాయణ, చంద్రబాబు మధ్య సంబంధాలు బయటపడుతున్నాయి
- ఈడీ, సీబీఐలను జేబు సంస్థలుగా మార్చుకున్న వారికి బుద్ధి చెప్పే సమయమొచ్చింది
హైదరాబాద్‌: సీబీఐని అవసరాలకు వాడుకుంటూ భ్రష్టుపట్టించారని, చివరకు సీబీఐలో పనిచేసే వారినే ఆ సంస్థ అరెస్టు చేసే దుస్థితికి రాజకీయ నాయకులు తీసుకువచ్చారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ కేసుల్లో పచ్చమీడియాకు మూడో కన్నుగా కనబడిన సీబీఐ ఇప్పుడు వారికి ఛీబీఐగా చిత్రీకరించుకుంటున్నారని మండిపడ్డారు. ఈ మేరకు హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అక్రమాలు చేసే వారిపై దాడులు చేయాల్సిన సీబీఐ చివరకు తన కార్యాలయంలోనే సోదాలు చేసుకునే పరిస్థితికి వచ్చిందన్నారు. సీబీఐలో కొంతమంది వ్యక్తులు, అధికారంలో ఉన్నవారు.. లేకపోతే అధికారంలో ఉన్నవారికి దగ్గరివారు లాబీయింగ్‌లు చేసి ఉన్నత దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసి భ్రష్టుపట్టించారని ఆరోపించారు.  

నచ్చితే నంది.. నచ్చకపోతే పందిలా తెలుగుదేశం పార్టీ పత్రికల తీరు ఉందని వాసిరెడ్డి పద్మ అన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి మరణం తరువాత కాంగ్రెస్‌ను వైయస్‌ జగన్‌ దిక్కరించారన్న కారణంతో కాంగ్రెస్‌తో టీడీపీ చేతులు కలిపి అక్రమ కేసులు బనాయించిందన్నారు. అప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతికి మూడో కన్నుగా కనిపించిన సీబీఐ.. చంద్రబాబు బినామీ సీఎం రమేష్‌పై దాడులు జరపగానే ఛీబీఐగా మారిందా అని ప్రశ్నించారు. సీబీఐ సంస్థను దుర్వినియోగం చేస్తున్నారని, రాజకీయ దురుద్దేశంతో సీబీఐని ఉసిగొల్పుతున్నారని వైయస్‌ఆర్‌ సీపీ చెప్పినప్పుడు వినపడలేదా అని నిలదీశారు. సీఎం రమేష్‌కు వ్యతిరేకంగా కుట్రపన్నారని, అధికారులు తప్పుడు వాంగ్మూలాన్ని ఇచ్చారని, సీఎం రమేష్‌ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని కథనాలు రాశారన్నారు. సీఎం రమేష్‌ నిర్ధోషి అని తేల్చేందుకు మీకే హక్కుందని ప్రశ్నించారు. 

సీబీఐకి సంబంధించిన మాటలన్నీ ప్రజలకు గుర్తుకు వస్తున్నాయి. సీబీఐని, ఈడీ లాంటి సంస్థల్లో మనుషులను పెట్టుకొని వైయస్‌ జగన్‌తో ఎలా ఆడుకున్నారో ప్రజలు మర్చిపోలేదన్నారు. సీబీఐని కీర్తించిన ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇవాళ తప్పు జరుగుతుందని గుర్తుకువచ్చిందా..? ఇవేం ప్రతికలని ప్రజలు అడుతున్నారన్నారు. వైయస్‌ జగన్‌పై ఐటీ దాడులు జరుగుతున్న సమయంలో సీబీ‘ఐ’అని ఉత్సాహంతో రాసిన పత్రికలు ప్రస్తుతం జరుగుతున్న దాడుల గురించి కుట్రపూరితంగా జరుగుతున్నట్లుగా ప్రచారాలు చేయిస్తున్నాయని ధ్వజమెత్తారు. దర్యాప్తు సంస్థలు, చట్టాన్ని, న్యాయాన్ని తన పని తాను చేసుకోనివ్వడం లేదు. రాష్ట్రంలో చంద్రబాబు ఎన్ని వ్యవస్థలను ప్రభావితం చేశారో నిగ్గు తేల్చాసిన సమయం వచ్చిందన్నారు. చంద్రబాబు ఈడీలో తన మనుషులను పెట్టుకొని వైయస్‌ జగన్‌ భార్యపై కూడా కేసులు పెట్టే దుస్థితికి దిగజారారన్నారు. ఈరోజున ఆయన ఈడీ, సీబీఐ గురించి బాధపడడం.. పత్రికలు వంతపాడడం సిగ్గుచేటన్నారు. 

సీబీఐని ఎలా భ్రష్టుపట్టించారనడానికి ఉదాహరణ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ చంద్రబాబు అక్రమాలపై కోర్టులో పిటిషన్‌ వేస్తే సీబీఐ దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశిస్తే చంద్రబాబు హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునే దాకా సీబీఐ ఒక్క అడుగు కూడా కదల్లేదన్నారు. ఇదే సీబీఐ కాంగ్రెస్‌ పార్టీ, శంకర్‌రావు, ఎ్రరన్నాయుడు, గజపతిరాజు కలిసి కోర్టులో పిటిషన్‌ వేస్తే ఆదేశించిన గంటల వ్యవధిలో వందల మంది టీమ్‌లను సీబీఐ వైయస్‌ జగన్‌ మీదకు పంపిందన్నారు. అంతేకాకుండా ఆస్తానా అధికారులు ఎవరో బయటకు రావాల్సిన అవసరం ఉందన్నారు. సీబీఐని ఎందుకు పతనం చేశారు.. ఎవరిపాత్ర ఎంత అనేది తేలాలన్నారు. 

గతంలో వైయస్‌ జగన్‌ కేసుపై ఎలా అత్యుత్సాహం ప్రదర్శించి మీడియాకు ఎలా అడ్డమైన చెత్త అందించిన జేడీ లక్ష్మీనారాయణ శ్రీకాకుళం తుపాన్‌ సహాయ చర్యలు భేష్‌ అని సర్టిఫికేట్‌ ఇవ్వడం సిగ్గుచేటన్నారు. మాకు తిండి, మంచినీరు దొరకడం లేదని బాధితులు రోదిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రికి కితాబు ఇవ్వడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.ఈ బంధం ఏనాటిది. పోలీస్‌ అమరవీరుల సంస్మరణ సభలో కూడా ఏ అధికారి పాల్గొనలేదని, జేడీ ఒక్కరే పాల్గొన్నారని, దీని వెనుక ఉన్న ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఏంటీ జేడీ ఈ కేడీ పనులు.. చంద్రబాబు, జేడీ బంధం ముసుగులు లేకుండా బయటపడుతుందన్నారు. ఐపీఎస్‌ చదువుకుంది ఇది చేయడానికేనా అని ప్రశ్నించారు. 

వైయస్‌ జగన్‌ కేసులో తీర్పు ఇచ్చిన హైకోర్టు జడ్జి కక్రూ రిటైర్డ్‌ అయిన వెంటనే చంద్రబాబు ఆయన్ను ఏపీ మానవహక్కుల చైర్మన్‌గా నియమించారన్నారు. సహజంగా తెలుగువారినే ఆ పదవిలో నియమిస్తారని, కానీ కాశ్మీర్‌కు చెందిన కక్రూను నియమించారంటే ఏ విధంగా లాబీయింగ్‌ జరిగిందో అర్తం అవుతుందన్నారు. ప్రజాస్వామ్యంగా చట్టం చట్టంలా ఉండాలి.. మీడియా మీడియాగా ఉండాలి. ఇవి మరిచిపోయి పెంపుడు కుక్కలా మారితే ప్రజలు చీదరించుకుంటారని, పెంపుడుకుక్క స్థాయిని కూడా దాటి పిచ్చి కుక్కల్లా మారితే ప్రజలు ఏం చేస్తారో వారికే తెలియాలన్నారు. సీబీఐలో జరుగుతున్న లుకలుకలను ఈ సందర్భంగానైనా ప్రక్షాళన చేయాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు రాజకీయంగా ఎదుర్కోలేక గతంలో కాంగ్రెస్‌తో.. 2014 నుంచి నాలుగేళ్లు బీజేపీతో సంబంధాలు పెట్టుకొని వైయస్‌ జగన్‌ను వేధించాలని కుట్రలు చేశారన్నారు. చివరకు ఈడీలాంటి చోట కూడా తన మనుషులను పెట్టుకొని కొత్తగా సమన్లు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. ఇలాంటి వారికి తగిన గుణపాఠం కావాలని, సీబీఐ, ఈడీ లాంటి సంస్థలను జేబు సంస్థలుగా మార్చుకున్న చంద్రబాబుకు గుణపాఠం చెప్పే అవకాశం తెలుగు ప్రజలకు వచ్చింద

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com