Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ప్రజలకు ఎన్ని అబద్దాల చెప్పినా వింటారనే నాయకులకు తెలంగాణ ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారు : వైయ‌స్ జ‌గ‌న్‌                               లగడపాటి రాజకీయ విశ్లేషకుడు ఎప్పుడు అయ్యాడా? అని ఆశ్చర్యం వేసింది: వైయ‌స్ జ‌గ‌న్‌                               కాంగ్రెస్‌, టీడీపీ జిమ్మిక్కులను ప్రజలను తిప్పికొట్టారు: వైయ‌స్ జ‌గ‌న్‌                               చంద్రబాబు, కాంగ్రెస్ అనైతిక పొత్తుకు ప్రజలు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు: వైయ‌స్ జ‌గ‌న్                                భస్మాసురుడు చేయి పెట్టినా.. చంద్రబాబు కాలు పెట్టినా అంతా బుడిదే: వైయ‌స్ జ‌గ‌న్‌                               నందగిరి పేట నుంచి వైయ‌స్ జ‌గ‌న్‌ 319వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               హిందూపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ గని వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               ప‌వ‌న్‌కు చిత్త‌శుద్ది ఉంటే చంద్ర‌బాబు అవినీతిపై నిల‌దీయాలి: ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్‌                               డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు వైయ‌స్ జగన్ నివాళులు                 
    Show Latest News
రాజీనామాలకు కట్టుబడి ఉన్నాం
– వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి

Published on : 26-May-2018 | 15:33
 

– స్పీకర్‌కు వివరించి ఆమోదించుకుంటాం
– రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే పార్టీ వైయస్‌ఆర్‌సీపీ మాత్రమే
– రాబోయే ఎన్నికల్లో 25 ఎంపీలను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి
– రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత లేని వ్యక్తి చంద్రబాబు
  
ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన ద్రోహాన్ని నిరసిస్తూ ఎంపీ పదవులకు రాజీనామా చేశాం. దానికే కట్టుబడి ఉంటామని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. వైయస్‌ఆర్‌సీపీ ఎంపీల రాజీనామా నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్‌  నుంచి పిలుపు వచ్చిన నేపథ్యంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ రాజీనామాలకు కట్టబడి ఉంటామన్నారు. స్పీకర్‌కు కూడా అదే వివరిస్తామని తెలిపారు. స్పీకర్‌కు మా రాజీనామాలు ఆమోదించక తప్పని పరిస్థితిని కల్పిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు తీరుపై ఆయన ధ్వజమెత్తారు. నాలుగేళ్లు అధికారంలో ఉండి.. బీజô పీతో అంటకాగి ఇప్పుడు యూటర్న్‌ తీసుకున్నంత మాత్రాన చంద్రబాబును జనం నమ్మే పరిస్థితి లేదన్నారు. వైయస్‌ఆర్‌సీపీ అవిశ్వాసం తీర్మాణాన్ని వ్యతిరేకించిన చంద్రబాబు.. వారూ మద్ధతిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. నాలుగేళ్లుగా మా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో వైయస్‌ఆర్‌సీపీ మాత్రమే ప్రత్యేక హోదాపై పోరాడుతున్నదని తెలిపారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై తెచ్చిన ఒత్తిడి కారణంగానే టీడీపీ మంత్రులు కేంద్రం నుంచి వైదొలిగారని పేర్కొన్నారు. టీడీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసే అవకాశమే లేదని అన్నారు. ఓటుకు నోటు కేసు, కాగ్‌ రిపోర్టు, ఇతర కేసులకు భయపడుతున్న చంద్రబాబు అలాంటి నిర్ణయమే తీసుకునే అవకాశం లేదని తాను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నట్లు మేకపాటి పేర్కొన్నారు. చంద్రబాబుకు కావాల్సిందంతా సొంత ప్రయోజనాలు తప్ప.. రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోరని ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడే చంద్రబాబు నాలుగేళ్లుగా రాష్ట్రంలో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. 23 మంది వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను అనైతికంగా పార్టీలో చేర్చుకున్న చంద్రబాబుకు విలువలు ఉన్నాయా అని ఎద్దేవా చేశారు. బాబు అవినీతి, అనైతిక చర్యలను ప్రజలు గమనించారని రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని చెప్పారు. ప్రత్యేక హోదా సహా అన్ని విభజన హామీలు నెరవేర్చే సత్తా వైయస్‌ఆర్‌సీపీకి మాత్రమే ఉందని ఆయన స్పష్టం చేశారు. 
 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com