Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             శివకోడు నుంచి 195వరోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               ఉక్కు ప‌రిశ్ర‌మ సాధ‌న‌కు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి రెండో రోజు నిరాహార దీక్ష‌కు అనూహ్య మద్దతు                                రాజోలు నియోజ‌క‌వ‌ర్గంలో వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం                               వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 194వ రోజు నాగుల్లంక శివారు నుంచి ప్రారంభం                               30న అనంత‌పురంలో న‌య వంచ‌న దీక్ష: వైయ‌స్ఆర్‌సీపీ నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ‌                               ప్రతిదేవాలయ బోర్డులోనూ ఒక నాయీ బ్రహ్మణుడిని సభ్యుడిగా నియమిస్తాం: వైయ‌స్ జ‌గ‌న్ హామీ                               నాయీబ్రహ్మణుల పట్ల సచివాలయం సాక్షిగా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవర్తించిన తీరును చూసి విస్తుపోయాను: వైయ‌స్ జ‌గ‌న్‌                               వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరిన వంద మంది అగ్ని కుల క్ష‌త్రియులు                               తనపై నిరాధార ఆరోపణలు చేసిన యరపతినేని , రవీంద్రకుమార్‌లపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి                  
    Show Latest News
చుట్టపుచూపుగా రావడం తప్ప చేసిందేమీ లేదు

Published on : 14-Jul-2017 | 12:28
 

  • లోకేష్ కాలుపెట్ట‌గానే క‌డ‌ప అభివృద్ధి కుంటుప‌డింది
  • జిల్లాకు చుట్ట‌పుచూపుగా రావడం తప్ప సీఎం, లోకేష్‌  చేసిందేమీ లేదు
  • రుణ‌మాఫీపై ప్ర‌శ్నిస్తే కేసులు పెడ‌తామ‌ంటూ లోకేష్ బెదిరింపులు
  • పోలీసులు లేకుండా టీడీపీ నేత‌లు జ‌నంలో తిర‌గ‌గ‌ల‌రా..?
  • వైయ‌స్ఆర్ సీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు
వైయస్సార్ కడప : సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌బాబు చుట్టపుచూపుగా జిల్లాకు వచ్చిపోతున్నారే కానీ ఏనాడూ ప్రజాసమస్యలు పట్టించుకోలేదని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైయ‌స్ అవినాష్‌రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. వైయ‌స్ఆర్ జిల్లా పార్టీ కార్యాల‌యంలో ఎమ్మెల్యేలు ర‌ఘురామిరెడ్డి, ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి, అంజ‌ద్ బాషాతో క‌లిసి ఎంపీ వైయ‌స్ అవినాష్‌రెడ్డి విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ... లోకేష్ క‌డ‌ప‌లో కాలుపెట్టగానే మున్సిపల్‌ కార్మికులు సమ్మెలోకి వెళ్లారని, రైతులు, మహిళలు డ్వాక్రా రుణమాఫీపై నిలదీసినా మంత్రి స్పందించలేదన్నారు. ఉక్కు పరిశ్రమపై పోరాటం చేస్తున్నా నోరు మెదప లేదన్నారు. ఏమ‌డిగినా రూ.16వేల కోట్ల లోటు బడ్జెట్‌ అనే పదం తప్ప మరేమీ రావ‌డం లేద‌న్నారు. సీఎం చంద్ర‌బాబు ప్ర‌త్యేక విమానాల్లో తిరుగుతూ ప్ర‌జాధ‌నాన్ని వృథా చేస్తున్నాడ‌ని మండిప‌డ్డారు. రాష్ట్రంలో పేద ప్ర‌జ‌ల‌కు ఒక్క ఇళ్లు క‌ట్టించ‌లేని చంద్ర‌బాబు హైద‌రాబాద్‌లో వంద‌ల కోట్లు పెట్టి ఇంద్ర‌భ‌వ‌నాన్ని నిర్మించుకున్నార‌న్నారు. విజయవాడలోని ఇంటి అద్దెలకు, ఇంటీరియర్‌ డెకరేషన్లకు రూ.కోట్లు ఖర్చుచేసిన చంద్ర‌బాబు హామీల వద్దకు వచ్చేసరికి లోటు బడ్జెట్ అంటూ చెప్ప‌డమేంట‌ని ప్ర‌శ్నించారు. 

నీరిచ్చిన పాపాన పోలేదు..
జిల్లాలో కేసీ కెనాల్, తెలుగుగంగ, దాని ఉప కాలువలు పూర్తికాక, నీరు రాక రైతులు అల్లాడుతుంటే దాన్ని గురించి సీఎం పట్టించుకున్న పాపాన పోలేదని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. దివంగత మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి రాజోలి వద్ద ఆనకట్ట ఎత్తు పెంచి తెలుగుగంగను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించి బ్రహ్మంసాగర్‌కు నీరు తెప్పించారని గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక మూడేళ్లుగా బ్రహ్మంసాగర్‌లో నీరు నింపలేకపోయారన్నారు. వైయ‌స్ఆర్ మంజూరు చేసిన నాటి కస్తూర్బా పాఠశాలకు ఇప్పుడు మంత్రి లోకేష్‌ వచ్చి మైదుకూరులో శంకుస్థాపన చేశారన్నారు. కేంద్ర నిధులు తప్ప రాష్ట్ర నిధులు ఖర్చు చేసిన పాపాన పోలేదన్నారు. రుణమాఫీల‌ విషయమై ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరించడం ఎంతవరకు సమంజసమన్నారు. ఒక సర్పంచ్‌ నిధుల విషయమై ప్రశ్నిస్తే చెక్‌పవర్‌ రద్దుచేస్తామని లోకేష్ బెదిరిస్తున్నాడ‌న్నారు. జనాభిమానం ఉందని చెప్పుకుంటున్న టీడీపీ పోలీసులు లేకుండా ప్రజల్లోకి వెళ్లగలరా అని స‌వాలు విసిరారు.  

పూర్తి చేసిన ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు..
పూర్తి చేసిన ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు చేయ‌డం మంత్రి లోకేష్‌కే చెల్లింద‌ని క‌మ‌లాపురం ఎమ్మెల్యే ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి అన్నారు.  టీడీపీ ప్ర‌భుత్వం మూడేళ్లుగా స‌ర్వ‌రాయ సాగ‌ర్‌కు నీరు ఇస్తామ‌ని చెబుతున్నా.. చుక్క‌నీరు ఇచ్చిన పాపాన‌పోలేద‌న్నారు. నీరు-చెట్టు ప‌నులు త‌ప్ప‌.. సాగునీటి స‌మ‌స్య‌, రోడ్ల ప‌నులు చేప‌ట్టిన దాఖాలు లేవ‌న్నారు. ఎమ్మెల్యే అంజాద్‌ బాషా మాట్లాడుతూ.. మంత్రి లోకేష్‌ చేత టీడీపీ నాయకులు శంకుస్థాపన చేయించడం దుర్మార్గమ‌ని ధ్వ‌జ‌మెత్తారు. టీడీపీ ఒక్క రూపాయి కూడా అభివృద్ధికి నిధులు ఇవ్వలేదన్నారు. కార్య‌క్ర‌మంలో పార్టీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు పులి సునీల్‌కుమార్‌ తదితర నాయకులు పాల్గొన్నారు.
Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com