Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             చిన్న ఈర్ల‌పాడు వ‌ద్ద వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన విద్యార్థులు                               ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా కనిగిరి నియోజకవర్గంలోని చింతలపాలెం చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌కు గ్రామ‌స్తులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.                               వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 96వ రోజు ప్ర‌కాశం జిల్లా క‌నిగిరి మండ‌లం హాజీస్‌పురం నుంచి ప్రారంభ‌మైంది.                               చంద్ర‌బాబు ముస్లింల ద్రోహి: ఎమ్మెల్యే ముస్త‌ఫా                               బీజేపీ, టీడీపీలు ఏపీ ప్ర‌జ‌ల‌ను మోసం చేశాయి: మ‌ల్లాది విష్ణు                               కేంద్రంపై పోరాటం చేసే ద‌మ్ము, ధైర్యం చంద్ర‌బాబుకు ఉందా?: వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌                               వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు ఆరోపణలు చేస్తూ టీడీపీ నేత‌లు పైశాచిక ఆనందం పొందుతున్నారు: వాసిరెడ్డి పద్మ                               ప్ర‌త్యేక హోదా సాధ‌న‌కు ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసేందుకు సిద్ధమే: ఆదిమూల‌పు సురేష్‌                               బీజేపీ, టీడీపీల‌కు కాంగ్రెస్ గ‌తే ప‌డుతుంది: అంబ‌టి రాంబాబు                 
    Show Latest News
ప్రత్యేక హోదా అనేది వైయ‌స్‌ జగన్ లాంటిది
- వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా

Published on : 14-Feb-2018 | 16:59
 


- ప్రత్యేక ప్యాకేజ్ అంటే బాబు ఇంట్లో ఉండే ఎవరికీ పనికి రాని పప్పు లాంటిది
- కేంద్రంపై చంద్రబాబు ఎందుకు పోరాడరు?
అమ‌రావ‌తి: చ‌ంద్ర‌బాబు, నారా లోకేష్‌పై వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మ‌రోమారు మండిప‌డ్డారు. ప్ర‌త్యేక హోదా అన్న‌ది దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుమారుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి లాంటిద‌ని,ప్ర‌త్యేక ప్యాకేజీ అంటే చంద్ర‌బాబు నాయుడి ఇంట్లో ఎవ‌రికి ప‌నికి రాని ప‌ప్పులాంటిద‌ని రోజా అభివ‌ర్ణించారు. కేంద్ర బ‌డ్జెట్‌పై చంద్ర‌బాబుకు ఎందుకు మౌనంగా ఉన్నార‌ని ఆమె ప్ర‌శ్నించారు.  కేంద్రం తీరును నిరసిస్తూ ఇటీవల ఏపీలో నిర్వహించిన ఆందోళనలో విజయవాడ సెక్స్ రాకెట్ లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గుండు కొట్టించుకుని నిరసన తెలియజేశారని, ఇంకో బోడిగుండు ఆయన (గల్లా జయదేవ్) కేంద్రం మనకు ఏదో చేసేసిందని చెప్పి సన్మానాలు చేయించుకుని ఊరేగుతున్నారని విమర్శించారు.  ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో మీరు పెట్టుబడులు పెడతారా? అని గ‌ల్లా జ‌య‌దేవ్‌ను ప్ర‌శ్నించారు. ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదాను కేంద్రం వద్ద తాకట్టు పెట్టింది నిజం కాదా? అని నిల‌దీశారు. సమయానికి టాయిలెట్లు కట్టకపోతే కలెక్టర్లపై పోరాటం చేస్తానంటూ చంద్రబాబునాయుడు వారిని బెదిరిస్తున్నారు. మరి, ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేకహోదా ఇవ్వనప్పుడు కేంద్రంపై పోరాటం చేస్తానని చంద్రబాబు ఎందుకు మాట్లాడట్లేదని ఫైర్ అయ్యారు. ప్రత్యేక హోదా వచ్చినప్పుడే ప్రతి జిల్లా హైదరాబాద్ లా అవుతుందని నాలుగేళ్లుగా వైయ‌స్ జ‌గ‌న్ చెబుతూనే ఉన్నారు’ అని రోజా అన్నారు. ప్ర‌త్యేక హోదా సాధించేవ‌ర‌కు వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం చేస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌క‌పోతే వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు ఏప్రిల్ 6న రాజీనామాలు చేస్తార‌న్న వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌ట‌న‌ను రోజా స్వాగ‌తించారు.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com