Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             వ‌ర‌ద‌ విపత్తుతో తల్లడిల్లుతున్న కేరళ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం పునరావాస సహాయం కల్పించాలి: వైయ‌స్ జ‌గ‌న్                                ఈ కష్టకాలంలో నా ఆలోచనలు, ప్రార్థనలు కేరళ ప్రజలతో ఉన్నాయి: వైయ‌స్ జ‌గ‌న్‌                               కేర‌ళ వ‌ర‌ద‌లు హృద‌యాన్ని క‌ల‌చివేస్తున్నాయి: వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్వీట్‌                               సీఐడీ టీడీపీ తోక సంస్థ‌: కాసు మ‌హేష్‌రెడ్డి                               న‌ర్సీప‌ట్నం మెట్ట‌పాలెం క్రాస్ నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 239వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 238వ రోజు గురువారం ఉదయం విశాఖపట్నం జిల్లా నాతవరం మండలం డి. ఎర్రవరం నుంచి ప్రారంభం                               రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు 72వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి                               వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌లు                               విశాఖ జిల్లా ఎర్రవరంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఏపీ ప్రతిపక్షనేత, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి                  
    Show Latest News
పీకే నాయకుడు నాలుగేళ్లుగా చేసిందేంటీ?
వైయస్‌ఆర్‌ సీపీ మాజీ ఎంపీ వరప్రసాద్‌

Published on : 09-Aug-2018 | 14:46
 

ఉద్యోగాలు, రేషన్, పెన్షన్‌ పీకడం తప్ప
అవినీతి రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత చంద్రబాబుదే
వైయస్‌ జగన్‌ సీఎం అయితేనే రాష్ట్రం బాగుపడుతుంది
గుంటూరు: చంద్రబాబునాయుడు పీకే నాయుడుగా తయారయ్యాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ వరప్రసాద్‌ అన్నారు. గతంలో తొమ్మిదేళ్లు, ఇప్పుడు నాలుగేళ్లు పరిపాలన చేస్తున్న చంద్రబాబు ఏం పీకారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. పది లక్షల ఉద్యోగాలను పీకేశారు.. గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలను మేసివేశారు, పది లక్షల రేషన్‌ కార్డులు తీసేశారు. రెండు లక్షల కాంట్రాక్ట్‌ ఉద్యోగులను పీకేసి పీకేనాయుడుగా పేరుసాధించాడని ఎద్దేవా చేశారు. గుంటూరులో జరుగుతున్న వంచనపై గర్జన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. అబద్ధాలు, అవినీతిలో తప్ప చంద్రబాబు దేనిలో సీనియరో చెప్పాలన్నారు. ఏ మాత్రం విభజన చట్టంలోని దుగరాజుపట్నం పోర్టు, కడప స్టీల్‌ ప్లాంట్‌ గుర్తుకు రాలేదా అని నిలదీశారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు ఏవేవో మాట్లాడుతూ.. ప్రజలను మరోసారి వంచిస్తున్నాడని ధ్వజమెత్తారు. ఏ ఒక్కసారి ధైర్యంగా పోట్లాడి గెలిచిన దాఖాళాలు లేవన్నారు. ఎన్టీఆర్‌ పుణ్యమా అని గెలిచి ఆయనకు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి కుర్చీ లాక్కున్నాడని, రెండోసారి వాజ్‌పయి పుణ్యమా అని గెలిచాడాని, ముచ్చటగా మూడోసారి మోడీతో చేతులు కలిసి అధికారంలోకి వచ్చి ప్రజలను ముంచేశాడని ధ్వజమెత్తారు. నాలుగు సంవత్సరాలుగా బీజేపీతో కలిసి అధికారాన్ని అనుభవించి.. మళ్లీ కాంగ్రెస్‌ వైపు చూస్తున్నాడన్నారు. భారతదేశంలోనే అత్యంత అవినీతి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దిన ఘనత చంద్రబాబుదన్నారు. రెండు ఎకరాలతో మొదలైన చంద్రబాబు రెండు లక్షల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఒక్కసారి కూడా సింగిల్‌గా పోటీ చేసిన దాఖాళాలు లేవన్నారు. 

ప్రత్యేక హోదా వైయస్‌ జగన్‌తోనే సాధ్యమని, ఆయన ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుపడుతుందని వరప్రసాద్‌ అన్నారు. ఒక్కసారి ప్రజలు వైయస్‌ జగన్‌ పాలన చేస్తూ ఎప్పటికీ ఆయన్ను విడిచిపెట్టరన్నారు. చంద్రబాబు దుష్టపాలనను అంతమొందించాలంటే ప్రజలంతా వైయస్‌ఆర్‌ సీపీని ఆదరించాలని కోరారు. రాజన్న రాజ్యం వైయస్‌ జగన్‌తోనే సాధ్యమన్నారు. కార్యకర్తలు, నాయకులు ఉత్సాహంతో పనిచేసి పార్టీని గెలిపించేందుకు కృషి చేయాలని సూచించారు. 
 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com