Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన‌ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 300వ రోజు పార్వతీపురం నియోజకర్గంలోని కోటవానివలస నుంచి ప్రారంభం                               ‘నాపై జరిగిన హత్యాయత్నంలో చంద్రబాబుకు ఎలాంటి ప్రమేయం లేకపోతే.. స్వతంత్ర దర్యాప్తు సంస్థతో కేసు విచారణ చేయించొచ్చు కదా’ : వైయ‌స్ జ‌గ‌న్‌                                చంద్రబాబు రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు: ఆనం రామనారాయణ రెడ్డి                               ఏ విచారణకైనా సిద్ధమని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా ?: అంబటి రాంబాబు సవాల్‌                                పచ్చచొక్కాల కోసమే ప్రభుత్వ పథకాలు: వైవీ సుబ్బారెడ్డి                               బిడ్డ పుట్టి ఓటు హక్కు వచ్చిన తర్వాత తనకే ఓటు వేస్తారని చంద్రబాబు పేర్కొనడం హాస్యాస్పదం: పేర్నినాని                               వైయ‌స్ జ‌గ‌న్ బాలల దినోత్సవ శుభాకాంక్షలు                                మాజీ మంత్రి సి.రామ‌చంద్ర‌య్య వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               నాలుగేళ్లుగా దళితుల సమస్యలపై చంద్రబాబు స్పందించలేదని, ఎన్నికలకు 6 నెలల ముందు ఎస్టీలకు మంత్రి పదవి ఇచ్చారు: టీజేఆర్ సుధాక‌ర్‌బాబు                 
    Show Latest News
ఏప్రిల్‌ 6న ఎంపీల రాజీనామా
వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంచలన నిర్ణయం

Published on : 13-Feb-2018 | 17:24
 


– ఏపీకి ప్రత్యేక హోదా ఒక్కటే సంజీవని
– హోదా కసం మార్చి 1న జిల్లా కేంద్రాల్లో ధర్నా
– మార్చి 5న ఢిల్లీలో జంతర్‌ మంతర్‌వద్ద ధర్నా
– ప్రత్యేక హోదా కోసం ఊపిరి ఉన్నంత వరకు పోరాటం
– చంద్రబాబు తన స్వార్థం కోసం హోదాను అమ్మేశారు
– టీడీపీ నేతల డ్రామాలు గమనించాలి

నెల్లూరు:  ప్రత్యేక హోదా సాధన కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. ఏప్రిల్‌ 6వ తేదీ వరకు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామా చేస్తారని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీకి ప్రత్యేక హోదానే సంజీవని అని, దాని కోసం ఊపిరి ఉన్నంత వరకు పోరాటం చేస్తామని వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రత్యేక హోదాపై నోరు మెదపడం లేదని, బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందని టీడీపీ నేతలు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 86వ రోజు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అశేష జనవాహిణిని ఉద్దేశించి వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే..వైయస్‌ జగన్‌ మాటల్లోనే..

ఎండలు తీక్షణంగానే ఉన్నాయి. ఎండాకాలం మొదలైంది. అయినా కూడా ఏమాత్రం కూడా ఎవరూ లెక్క చేయడం లేదు. పొద్దునుంచి వేలాది మంది తనతో అడుగులో అడుగులు వేశారు. అన్నా..మేమంతా నీతోనే అంటూ వేలాది మంది నాతో పాటు అడుగులో అడుగులు వేశారు. ఈ నడిరోడ్డుపై ఎండలో నిలవాల్సిన అవసరం ఏ ఒక్కరికి లేదు. చిక్కటి చిరునవ్వులతో ఆప్యాయతలు పంచుతున్నారు. మీ అందరి ఆప్యాయతలు, ప్రేమానురాగాలకు, అత్మీయతలకు ప్రతి ఒక్కరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

– నాలుగేళ్ల చంద్రబాబు పాలన మనమంతా చూశాం. మరో ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయని చంద్రబాబు చెబుతున్న నేపథ్యంలో ఇవాళ మీరంతా మీ గుండెలపై చేతులు వేసుకొని ఒక్కసారి ఆలోచన చేస్తూ ఈ నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో మనలో ఏ ఒక్కరైనా సంతోషంగా ఉన్నామా అనిప్రశ్నించుకోండి. ఏ ఒక్కరూ కూడా సంతోషంగా లేని పరిస్థితి. మీ అందరికి బైక్‌లు ఉన్నాయా అన్నా.. ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు పెట్రోల్‌ బంకుల వద్దకు వెళ్తే అక్కడ లీటర్‌ పెట్రోల్‌ పక్కన తమిళనాడు బార్డర్‌లో పోయించుకుంటే లీటర్‌పై రూ.7 తక్కువకు పోస్తారు. కర్నాటకలో రూ.6 తక్కువకు పోస్తారు. దేశంలో ఎక్కడ లేని రేట్లు మన రాష్ట్రంలో ఉన్నాయని చెప్పడానికి ఇదే నిదర్శనం కాదా?
– బియ్యం తెచ్చుకోవడానికి మీరంతా వెళ్లేదే రేషన్‌షాపులకదే అన్నా..నాలుగేళ్ల క్రితం రేషన్‌షాపుల్లో బియ్యంతో పాటు చక్కెర, కందిపప్పు, పామాయిల్, గోధుమ పిండి, గోదమలు, కారం, పసుపు, ఉప్పు, చింతపండు, కిరసనాయిల్‌ కూడా ఇచ్చేవారు. కేవలం రూ.180లకే ప్యాక్‌ చేసి ఇచ్చేవారు. ఇవాళ చంద్రబాబు పాలనలో రేషన్‌షాపుల్లో బియ్యం తప్ప మరేమి ఇవ్వడం లేదు. ఆ బియ్యం కూడా వేలిముద్రలు పడటం లేదని కత్తరించే ప్రయత్నం చేస్తున్నారు.

కరెంటు బిల్లులు షాక్‌ కొడుతున్నాయి..
– నాలుగేళ్ల కిందట మనకు కరెంటు బిల్లులు ఎంత వచ్చేవి. ఆ రోజు చంద్రబాబు ఏమన్నారు. కరెంటు బిల్లులు షాక్‌ కొడుతున్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే కరెంటు బిల్లులు తగ్గిస్తానని మాట ఇచ్చారు. ఆ రోజు కరెంటు బిల్లు రూ.50, 100 వచ్చేది. ఇవాళ అదే కరెంటు బిల్లు రూ.500, రూ.600, రూ.1000 చొప్పున వస్తున్నాయి. ఇది కరెంటు బిల్లుల పరిస్థితి. చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు షాక్‌కొడుతున్నాయి.
– ఇవాళ ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే ప్రజలు భయపడుతున్నారు. చంద్రబాబు పాలనలో మూడు సార్లు ఆర్టీసీ చార్జీలు పెంచారు. 
– నాలుగేళ్ల క్రితం చంద్రబాబు ఏమన్నారు. పిల్లలు తాగి చెడిపోతున్నారు. అధికారంలోకి వచ్చాక మాద్యాన్ని తగ్గిస్తాను..బెల్టు షాపులు లేకుండా చేస్తానని చెప్పారు. చంద్రబాబు పాలనలో మద్యం తగ్గించడం దేవుడేరుగు. ప్రతి గ్రామంలో మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ ఉంటుందో లేదో కానీ.. బెల్టు షాపు కనిపిస్తోంది. ఇవాళ మద్యం కావాలంటే ఫోన్‌ కొడితే చాలు ఇంటికి తెచ్చి ఇస్తున్నారు.

బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు..
– ఇదే పెద్ద మనిషి బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. వ్యవసాయ రుణాలన్నీ పూర్తిగా, బేషరత్తుగా మాఫీ కావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. నాలుగేళ్ల తరువాత అడుగుతున్నాను. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి వచ్చిందా అని అడుగుతున్నాను. బ్యాంకుల నుంచి బంగారం ఇంటికి రాలేదు కానీ..వేలం నోటీసులు ఇంటికి వస్తున్నాయి. ఇవాళ ఆయన చేసిన రుణమాఫీ చివరకు రైతులకు వడ్డీలకు కూడా సరిపోవడం లేదు.
– రైతుల మోసం చేయడం ఒక ఎత్తు అయితే..ఆయన చేసిన అన్యాయం ఏంటో తెలుసా..? గతంలో రైతులకు, పొదుపు సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందేవి. అప్పటి ప్రభుత్వం బ్యాంకులకు వడ్డీ సొమ్ములు కట్టేవి. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం నుంచి రైతుల రుణాలకు సంబంధించిన వడ్డీ సొమ్ము కట్టకపోవడంతో వడ్డీ మీద వడ్డీలు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. 

ఆడబిడ్డలు కన్నీరు పెడితే ఇంటికి అరిష్టం
– పొదుపు సంఘాల అక్కా చెల్లెమ్మలపై విఫరీతమైన ప్రేమ ఉన్నట్లు చంద్రబాబు చెప్పుకుంటున్నారు. ఆడబిడ్డలు కన్నీరు పెడితే ఇంటికి అరిష్టం అంటారు. ఇదే చంద్రబాబు పాలనలో అక్కచెల్లెమ్మలు కన్నీరు పెట్టే పరిస్థితిలోకి తీసుకెళ్లారు. పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా మాఫీ కావాలంటే బాబు సీఎం కావాలన్నారు. మీ రుణాలు మాఫీ అయ్యాయా? ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. ఇవాళ పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల ఇళ్లకు బ్యాంకు అధికారులు తాళం వేస్తున్నారు. 
– నాలుగేళ్ల క్రితం చంద్రబాబు ఏమన్నారు. జాబు రావాలంటే బాబు రావాలన్నారు. ప్రతి ఇంటికి మనిషిని పంపించాడు. ప్రతి ఇంటికి తన కార్యకర్త ఓ కరపత్రం తెచ్చారు. మీ పిల్లలు ఏం చదవకపోయినా ప్రతి ఇంటికి ఓ ఉద్యోగం, లేదంటే నిరుద్యోగ భృతి రూ.2 వేలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ప్రతి ఇంటికి రూ.90 వేలు బాకీ పడ్డాడు. రేపొద్దున చంద్రబాబు కనిపిస్తే రూ.90 వేల కథేంటి అని అడగండి.

ఒక పద్ధతి ప్రకారం మోసం చేశారు
– ఇదే పెద్ద మనిషి మాదిగ సొదరులను వదల్లేదు. ఆ రోజు చంద్రబాబు చెప్పులు కుట్టారు. దండోర వేశారు. ఆయన ఎన్నికల ప్రణాళికలో ప్రతి కులానికి ఒక పేజీ కేటాయించారు. ప్రతి కులాన్ని కూడా తాను ఎలా మోసం చేయాలో ఒక పద్ధతి ప్రకారం మోసం చేశారు. తొమ్మిదేళ్ల పాటు గతంలో సీఎంగా చేసిన అనుభవం ఉండి కూడా ప్రతి కులాన్ని మోసం చేశారు. ఎస్సీ వర్గీకరణ చేసేస్తామని చంద్రబాబు చెప్పారు. ఇవాళ ఇదే చంద్రబాబు మాట మార్చారు. వర్గీకరణ కేంద్రం పరిధిలో ఉంటుందని తప్పించుకుంటున్నారు. కాపులు, బోయలను, ఎస్టీలను వదలిపెట్టకుండా అందర్నీ మోసం చేశాడు. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే ఆ నాయకుడు  ఇంటికి పోవాలి. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ బాగు పడాలంటే ఒక్క వైయస్‌ జగన్‌ వల్ల సాధ్యం కాదు. నాకు మీ అందరి తోడు కావాలి. అప్పుడే ఈ వ్యవస్థలోకి విశ్వసనీయత, నిజాయితీ అనే పదాలకు అర్థం వస్తుంది.

వద్దు అనకండి..
– రేపొద్దున ఈ చిన్న చిన్న మోసాలను నమ్మరని చంద్రబాబుకు తెలుసు. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానని చంద్రబాబు హామీ ఇస్తారు. అయినా కూడా నమ్మరని దానికి బోనస్‌గా బెంజీ కారు కొనిస్తానని అంటాడు. నమ్మరు కాబట్టి రేపొద్దున ప్రతి ఇంటికి తన మనుషులు వస్తారు. ఓటుకు రూ.3 వేలు అని చేతులో పెడుతారు. వద్దు అనకండి..రూ.5 వేలు కావాలని గుంజండి. ఆ డబ్బంతా మనదే. మన వద్ద నుంచి దోచిన డబ్బే. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మీ మనసాక్షి ప్రకారం చెడిపోయిన రాజకీయ వ్యవస్థ మార్పు కోసం వేయండి.

వైయస్‌ఆర్‌ తపన పడితే ..
– మీ నియోజకవర్గంలో ఎంతటి దారుణంగా పాలన సాగుతుందో చూడండి. ఈ నియోజకవర్గం మెట్టప్రాంతానికి చెందిన భూమి. ఈ ప్రాంతం బాగుపడటానికి దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి విశేష కృషి చేశారని గర్వంగా చెబుతున్నాను. సోమశిల కెనాల్‌కు హైలెవల్‌ తీసుకురావడానికి ఐదు రిజర్వాయర్లు కట్టి రెండు నియోజకవర్గాలను సస్యశ్యామలం చేసేందుకు పనులు ప్రారంబించారు. ఈ ఐదు రిజర్వాయర్లు పూర్తిఅయ్యి ఉంటే 55 గ్రామాలకు సాగునీరు, తాగునీరు అందేవి. నాన్నగారు చనిపోయిన తరువాత ఆ పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. సోమశిల ఉత్తర కాల్వ చూస్తే బాధనిపిస్తోంది. ఈ కాల్వలో నీరు పోతున్నా..ఇక్కడి రైతులకు నీరు అందడం లేదు. ఈ ప్రాంతానికి నీరు ఇచ్చేందుకు వైయస్‌ఆర్‌ తపన పడితే ఇవాల్టికి కూడా 50 శాతం పనులు కూడా పూర్తి కాని పాలన సాగుతోంది. పక్కనే ఉన్న వెలుగోండ ప్రాజెక్టు 43.58 టీఎంసీల నీటిని ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఇచ్చి సస్యశ్యామలం చేయాలని వైయస్‌ఆర్‌ ఆరాటపడ్డారు. 70 వేల ఎకరాలు సాగులోకి వచ్చేవి. శ్రీశైలం నీరు ఇక్కడికి తీసుకొస్తారని ఎవరూ ఊహించలేదు. వైయస్‌ఆర్‌ హయాంలో 13 సొరంగం పనులు పూర్తి చేశారు. 9.4 కిలోమీటర్ల పనులు పూర్తి చేశారు. ఆ తరువాత ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. 2 కిలోమీటర్లు కూడా తవ్వలేని పాలన కనిపిస్తోంది. ఇవన్నీ కూడా ఆలోచించండి. ఇదే నియోజకవర్గంలో పొగాకు రైతులు ఎక్కువ. ప్రతి సంవత్సరం రేటు లేదని రైతులు అల్లాడుతున్నారు. ప్రతి ఏటా ౖÐð యస్‌ జగన్‌ కొనుగోలు కేంద్రాల వద్ద ధర్నాలు చేస్తున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతన్నలను నేనే వెళ్లే పరామర్శించాను. ప్రతి బ్యారెన్‌కు రూ.10 లక్షలు ఇచ్చి కొనుగోలు చేయాలి, లేదా కనీస మద్దతు ధర ఇచ్చి పొగాకు కొనుగోలు చేయాలి. ఇవాళ ఇలాంటి పనులు జరగడం లేదు. కొండాపురం, వరికుంటపాడు, దత్తలూరులో ప్లోరైడ్‌ బాధితులు ఎక్కువగా ఉన్నారు. కిడ్నీ పేషేంట్లు కనిపిస్తున్నారు. ప్లోరైట్‌ కంటెంట్‌ 2.55 పీపీఎం ఉంది. ఈ పరిస్థితి పోవాలంటే కెనాల్‌ నుంచి సమృద్ధిగా నీరు తీసుకురావాలి. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ఇంతవరకు ఏ దిశగా కూడా నీరు తెచ్చి తాగునీరు, సాగునీరు ఇవ్వాలని ఆలోచించడం లేదు.

మనమే ఎక్కువ సాధించామంటా?
– గత 12 రోజులుగా జరుగుతున్న డ్రామాను మీరంతా చూశారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టగానే చంద్రబాబు డ్రామా మొదలుపెట్టారు. ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఈయనకు సంబంధించిన మంత్రులు కేంద్రంలో ఉన్నారు. వీళ్లు ఆమోదం తెలిపిన తరువాతే బడ్జెట్‌ కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెడుతుంది. చంద్రబాబు మాత్రం బడ్జెట్‌లో తమకు అన్యాయం జరిగిందని డ్రామా మొదలుపెట్టారు. ఇదే చంద్రబాబు జనవరిలో ఏమన్నారు. అన్ని రాష్ట్రాల కంటే మనమే ఎక్కువ సాధించామంటా? బడ్జెట్‌ ప్రవేశపెట్టకముందే చంద్రబాబు అన్న మాటలు ఇవి. ఏ రాష్ట్రానికైనా ఇంత వచ్చిందా అని చంద్రబాబు ప్రతిపక్షాలకు సవాల్‌ విసిరారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టకముందే చంద్రబాబు కేంద్రాన్ని పొగిడాడు. విభజన చట్టం ప్రకారం మనకు ప్రత్యేక హోదా రావాలి. చంద్రబాబు తన స్వార్థం కోసం, కేసుల నుంచి తప్పించుకునేందుకు ప్రత్యేక హోదాను అమ్మేశారు. ప్యాకేజీ కంటే హోదాతో జరిగే మేలు ఏంటో అని అడుగుతున్నాడు. దేశంలో సీనియర్‌ నేత అని చంద్రబాబు గొప్పగా చెప్పుకున్నారు. ప్రత్యేక హోదా మనకు హక్కుగా ఇవ్వాల్సి ఉంది. తన స్వార్థం కోసం ప్యాకేజీకి దాన్ని అమ్ముకున్నారు. చంద్రబాబు మంత్రి సుజనా చౌదరి ఏమన్నారో తెలుసా? హోదా కంటే ప్యాకేజీనే బాగుంటుందని చెప్పారు. ఇదే పెద్ద మనిషి ఇప్పుడు బడ్జెట్‌లో అన్యాయం జరిగిందని డ్రామా ఆడుతున్నారు. చంద్రబాబుకు బుద్ది రావాలని, టాఫిక్‌ను డైవర్ట్‌ చేసేందుకు ప్రత్యేక హోదాను విస్మరించారు. ఇవాళ చంద్రబాబు ఏం  అడుగుతున్నారో తెలుసా? మాకు అర్ధరూపాయి ఇస్తామన్నారు. పావలా ఇస్తారని, ప్యాకేజీ ఇవ్వాలని అడుగుతున్నారు. ప్రత్యేక హోదా మా హక్కు అని నినదిస్తూ మార్చి 1న ప్రతి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమం మన ఎమ్మెల్యేలు ధర్నా చేస్తారు. మార్చి3న మన పార్టీ ఎంపీలు నా వద్దకు వస్తారు. వారందరిని కూడా మార్చి5న ఢిల్లీలో ధర్నా చేసేందుకు పంపిస్తాం. మన ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ ఢిల్లీలో ధర్నా చేస్తారు. మార్చి 5 నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతాయి. నెలంతా కూడా ప్రత్యేక హోదా కోసం మన ఎంపీలు పోరాటం చేస్తారు. అప్పటికి ప్రత్యేక హోదా రాకపోతే ఏప్రిల్‌ 6న మన ఎంపీలు రాజీనామా చేసి రాష్ట్రానికి తిరిగి వస్తారు. ఈ పోరాటం ఆగదు. ఊపిరి ఉన్నంత వరకు ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగుతోంది. ఈ వ్యవస్థను మార్చేందుకు విశ్వసనీయత, నిజాయితీ తెచ్చేందుకు మీ ముద్దుబిడ్డ బయలు దేరాడు. మీ బిడ్డను ఆశీర్వదించమని కోరుతున్నాను. గతంలో ప్రకటించిన నవరత్నాల్లో ఏవైనా సలహాలు, సూచనలు ఉంటే మీరంతా వచ్చి నాకు చెప్పవచ్చు. నేను ఎక్కడ ఉంటానో మీ అందరికి తెలుసు. 
 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com