Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ప్రతిదేవాలయ బోర్డులోనూ ఒక నాయీ బ్రహ్మణుడిని సభ్యుడిగా నియమిస్తాం: వైయ‌స్ జ‌గ‌న్ హామీ                               నాయీబ్రహ్మణుల పట్ల సచివాలయం సాక్షిగా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవర్తించిన తీరును చూసి విస్తుపోయాను: వైయ‌స్ జ‌గ‌న్‌                               వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరిన వంద మంది అగ్ని కుల క్ష‌త్రియులు                               తనపై నిరాధార ఆరోపణలు చేసిన యరపతినేని , రవీంద్రకుమార్‌లపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి                                ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు స్వర బ్రహ్మ నేరెళ్ల వేణు మాధవ్ మృతి ప‌ట్ల వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి సంతాపం                               పి.గ‌న్న‌వ‌రం నుంచి 193వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               నాయి బ్రాహ్మణులు కనీస వేతనాల కోసం అడిగితే సీఎం వీధి రౌడీలా దిగజారి మాట్లాడారన్నారు: జోగి ర‌మేష్‌                               లాలూచీ రాజకీయాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య : వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి                               ఆత్రేయపురం నుంచి 190వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                 
    Show Latest News
లాలూనాయక్‌ కుటుంబాన్ని పరామర్శించిన వైయస్‌ జగన్‌

Published on : 16-May-2017 | 18:00
 

గుంటూరు: పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న మిర్చీ రైతు లాలూనాయక్‌ కుటుంబాన్ని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ పరామర్శించారు. గుంటూరు మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం దావులపల్లి గ్రామానికి చెందిన రైతు లాలూనాయక్‌ 6 ఎకరాల్లో మిర్చి పంట సాగు చేసి నష్టపోయాడు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు.  ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ లాలూనాయక్‌ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పెద్ద దిక్కు కోల్పోయిన ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు.

రాష్ట్రంలో ప్రభుత్వం పాటిస్తున్న అస్తవ్యస్త విధానాల వల్ల రైతులు బతికే పరిస్థితి లేకుండా పోయిందని, అందుకే వాళ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. లాలూనాయక్  రెండెకరాల్లో పత్తి సాగు చేస్తే 70 వేల ఖర్చు వచ్చిందని, మొత్తం పది క్వింటాళ్ల పత్తి పండగా.. క్వింటాలుకు రూ. 4వేల చొప్పున మొత్తం రూ. 40 వేలు రాగా 30 వేల రూపాయల నష్టం మిగిలిందని ఆయన చెప్పారు. ఇటీవలే అతడి భార్య తన బంగారం అమ్మి కూతురి పెళ్లి చేసిందని, ఆ సందర్భంలో కూతురికి పెట్టిన బంగారాన్ని మళ్లీ అల్లుడికి నచ్చజెప్పి తెచ్చుకుని దాన్ని బ్యాంకులో కుదువపెట్టి రూ. 40వేలు అప్పు తెచ్చారని జగన్ తెలిపారు. దాన్ని కూడా విడిపించే పరిస్థితి లేదని, పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయారని అన్నారు. ఇక్కడ పక్కనే నాగార్జున సాగర్ ఉన్నా.. వెయ్యి అడుగుల లోతుకు వెళ్తే తప్ప బోర్లలో నీళ్లు పడవని చెప్పారు. ఇంత దారుణమైన పరిస్థితిలో ప్రజలున్నారని, అయినా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. ముఖ్యమంత్రికి ఏమాత్రం బుద్ధి, జ్ఞానం ఉన్నా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com