Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             బిడ్డ పుట్టి ఓటు హక్కు వచ్చిన తర్వాత తనకే ఓటు వేస్తారని చంద్రబాబు పేర్కొనడం హాస్యాస్పదం: పేర్నినాని                               తామరఖండి నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 297వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               వైయ‌స్ జ‌గ‌న్ బాలల దినోత్సవ శుభాకాంక్షలు                                మాజీ మంత్రి సి.రామ‌చంద్ర‌య్య వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               నాలుగేళ్లుగా దళితుల సమస్యలపై చంద్రబాబు స్పందించలేదని, ఎన్నికలకు 6 నెలల ముందు ఎస్టీలకు మంత్రి పదవి ఇచ్చారు: టీజేఆర్ సుధాక‌ర్‌బాబు                               వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో రాజ‌మండ్రికి చెందిన బీసీ సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు మార్గాని నాగేశ్వ‌ర‌రావు, భ‌ర‌త్ వైయ‌స్ఆర్ సీపీలో చేరిక‌                               కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ మృతికి వైయ‌స్ జ‌గ‌న్ సంతాపం                               వైయ‌స్ జగన్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ పున:ప్రారంభం                               చంద్రబాబు ముందు రాష్ట్రం సంగతి చూడు.. తర్వాత దక్షిణాది రాష్ట్రాల పర్యటన చేద్దువు: ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున                  
    Show Latest News
విజయవంతమైన వంచన పై గర్జన నిరసనలు

Published on : 16-May-2018 | 17:02
 

 చంద్రబాబు చేస్తున్న మోసం, అన్యాయాలను నిరసిస్తూ వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అన్ని కలెక్టరేట్ల ముందు వంచన పై గర్జన నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. నల్లబ్యాడ్జీలు, నల్ల దుస్తులు, నల్లజెండాలు ధరించి కలెక్టరేట్ల ముందు భైటాయించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాయి. ర్యాలీలు , ప్రదర్శనలుగా కలెక్టరేట్ లకు తరలి వెళ్లి చంద్రబాబు చేస్తున్న వంచనను నిరసించారు. విజయవాడలో పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ జరగ్గా, అన్ని జిల్లాలోనూ పార్టీ ముఖ్య  నాయకులు పాల్గొని నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

విజయవాడలో నిర్వహించిన  ధర్నాలో పార్టీ నేతలు పార్ధసారధి, ఎమ్మెల్యే రక్షణ నిధి, వెల్లంపల్లి శ్రీనివాస్‌, వంగవీటి రాధా, మల్లాది విష్ణు, నాగిరెడ్డితో పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పార్టీ ఇన్‌చార్జ్‌లు పాల్గొన్నారు.

విశాఖలోని సౌత్‌జైల్‌ రోడ్‌ ప్రభుత్వ మహిళ కళాశాల ఎదుట వంచనపై గర్జన సభలో పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలు పాల్గొన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే బూడిమూత్యాల నాయుడు, కంభా రవిబాబు, గుడివాడి అమర్‌ తదితరులు పాల్గొన్నారు.

 చిత్తూరులో జరిగిన వంచనపై గర్జన ధర్నాలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి, డాక్టర్‌ సునీల్‌ కుమార్‌, చింతల రామచంద్రారెడ్డి, ఇన్‌ఛార్జ్‌లు జంగాలపల్లి శ్రీనివాసులు, చంద్రమౌళి, ఆడిములం, రాకేష్‌ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, పాకాల ఆశోక్‌ కుమార్‌, పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, భూమా కరుణాకర్‌ రెడ్డి, పార్టీ మహిళా కన్వీనర్‌ గాయత్రి, శైలాజారెడ్డి, రైతు నాయకులు ఆదికేశవరెడ్డి, కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు చేపట్టిన వంచనపై గర్జన ధర్నాలో జిల్లా పార్టీ అధ్యక్షుడు తమ్మినేని సీతారాం, రాష్ట్ర కార్యదర్శులు ధర్మాన ప్రసాదరావు, రెడ్డి శాంతి, మాజీ ఎమ్మెల్యేలు ధర్మాన  కృష్ణదాస్‌, పిరియా సాయిరాజ్‌, నియోజవర్గాల సమన్వయకర్తలు గొర్లె కిరణ్‌ కుమార్‌, నర్తు రామారావు తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ కడప కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నాలో కడప పార్లమెంట్‌ సభ్యుడు వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, కడప, రాజంపేట పార్లమెంట్‌ అధ్యక్షులు సురేష్‌ బాబు, అమర్నాధ్‌ రెడ్డి, ఎమ్మెల్యే అంజద్‌ బాషా, రవీంద్రనాథ్‌ రెడ్డి, శ్రీకాంత్‌ రెడ్డి, రఘురామిరెడ్డి, పార్టీ సమన్వయకర్తలు, ఇన్‌చార్జ్‌లు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నెల్లూరులోని గాంధీ బొమ్మ సెంటర్‌ నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, వరప్రసాద్‌రావు, వమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌, రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, మేకపాటి గౌతమ్‌ రెడ్డి, జెడ్‌.పి. చైర్మన​ బొమ్మిరెడ్డి రాఘవవేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి లో కాకినాడ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షులు కురసాల కన్నబాబు, గ్రేటర్‌ రాజమండ్రి అధ్యక్షులు కందుల దుర్గేష్‌, కో ఆర్డినేటర్లు ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి, తోట సుబ్బారావు నాయుడు, జ్యోతుల చంటిబాబు, జక్కంపూడి రాజా, తదితరులు పాల్గొన్నారు.

కర్నూల్‌ లో నిర్వహించిన  ర్యాలీలో వైఎస్సార్‌సీపీ  ఎమ్మెల్యేలు గౌరు చరిత, ఐజయ్య, సాయి ప్రసాద్‌రెడ్డి, బాలనాగా రెడ్డి, పార్లమెంట్‌ అధ్యక్షులు శిల్పా చక్రపాణి రెడ్డి, బి.వై రామయ్య, గంగుల, తదితరులు పాల్గొన్నారు.

గుంటూరు లో అంబటి రాంబాబు, లావు శ్రీ కృష్ణదేవరాయలు, కిలారి రోశయ్య, ఎమ్మెల్యేలు, ఆర్కే, పిన్నెళి, గోపిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

అనంతపురం  కలెక్టరేట్‌ కార్యాలయం ఎదురుగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో వంచనపై గర్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందుపురం పార్లమెంట్‌ అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి, శంకర్‌ నారాయణ, పార్లమెంట్‌ సమస్వయకర్తలు పీడీ రంగయ్య, ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి, నేతలు.. నవీన్‌ నిశ్చల్‌, డాక్టర్‌ సిద్ధారెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తరదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com