Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             వ‌ర‌ల్డ్ టూర్ ఫైన‌ల్స్ టైటిల్ గెలిచిన భార‌తీయ ఫ్లేయ‌ర్‌గా చ‌రిత్ర సృష్టించిన పీవీ సింధుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అభినంద‌న‌లు                                జ‌మ్ము జంక్ష‌న్ నుంచి వైయ‌స్ జ‌గ‌న్‌ 323వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                                అమరజీవికి జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌ ఘ‌న‌ నివాళి                               టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో అన్ని అంశాల్లో రాజీపడింది చంద్రబాబే: బొత్స సత్యనారాయణ                               రాష్ట్రాన్ని చంద్రబాబు ఎంత భ్రష్టుపట్టించారో, కేసీఆర్ అంత నష్టపరిచారు: బొత్స స‌త్య‌నారాయ‌ణ‌                               ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ పార్లమెంట్ వద్ద వైయ‌స్ఆర్‌ సీపీ ఎంపీలు ధర్నా                               ప్రజలకు ఎన్ని అబద్దాల చెప్పినా వింటారనే నాయకులకు తెలంగాణ ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారు : వైయ‌స్ జ‌గ‌న్‌                               లగడపాటి రాజకీయ విశ్లేషకుడు ఎప్పుడు అయ్యాడా? అని ఆశ్చర్యం వేసింది: వైయ‌స్ జ‌గ‌న్‌                               కాంగ్రెస్‌, టీడీపీ జిమ్మిక్కులను ప్రజలను తిప్పికొట్టారు: వైయ‌స్ జ‌గ‌న్‌                 
    Show Latest News
నేడు పార్వతీపురంలో వైయ‌స్ జగన్‌ బహిరంగ సభ
- బహిరంగ సభకోసం భారీ ఎత్తున ఏర్పాట్లు

Published on : 17-Nov-2018 | 11:51
  విజయనగరం: ఒకటి కాదు.. వంద కాదు.. వేల సంఖ్యలో అడుగులన్నీ ఏకమవుతున్నాయి. పల్లెలు కదలివస్తుండగా.. చిన్న చిన్న పట్టణాలు తరలివస్తున్నా యి. తమ అభిమాన నాయకుడు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అండగా నిలుస్తున్నాయి. జననేత రాకతో  పాద‌యాత్ర దారుల‌న్నీ జన ప్రవాహంతో నిండిపోతున్నాయి.  చిన్నా.. పెద్దా... ముసలీ.. ముతకాతో పాటు  రహదారిపై ప్రయాణిస్తున్న  వారు సైతం జననేత చేయి చేయి కలిపి ప్రజా సంకల్పయాత్రలో భాగస్వాములవుతున్నారు. తమ సమస్యలను వినేందుకు వచ్చిన రాజన్న బిడ్డకు నీరాజనం పలుకుతున్నారు. వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు బస్సులు, కార్లు, ఇతర వాహనాల్లో ప్రయాణిస్తున్న వారు సైతం  రహదారిపై జననేత కోసం అతృతగా ఎదురు చూశారు. ఆయనతో కరచాలనం చేసేందుకు పో టీ పడుతున్నారు. అధిక సంఖ్యలో యువకులు, మహిళలు ఆయనతో అడుగేస్తుండటం విశేషం. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా శ‌నివారం  ఉదయం 7.30 గంటలకు పార్వతీపురం నియోజకవర్గంలోని సీతానగరం మండలం సూరంపేట నుంచి పాద‌యాత్ర ప్రారంభ‌మైంది.  అక్క‌డి నుంచి నర్సిపురం, వసుంధరనగర్, యర్రా కృష్ణమూర్తి కాలనీవరకూ సాగుతుందని తెలిపారు. తిరిగి మధ్యాహ్న భోజనానంతరం పార్వతీపురం పాతబస్టాండ్‌ జంక్షన్‌ వరకు చేరుకుని అక్కడే బహిరంగ సభలో అశేష జ‌న‌వాహినిని ఉద్దేశించి వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగిస్తారు.  హత్యాయత్నం నుంచి బయటపడి... మృత్యుంజయుడై వచ్చిన ఆయన ప్రజాసంకల్ప యాత్రలో నాలుగు రోజులుగా పాల్గొంటున్నా... ఎక్కడా ఎలాంటి వ్యాఖ్య లూ చేయలేదు. ఇక మిగిలింది పార్వతీపురంలో బహిరంగ సభ. అక్కడ ఏం మాట్లాడతారో... ఏం ప్రకటన చేయబోతున్నారో...ఆయన నిర్ణయం ఏమై ఉంటుందోనన్న ఆత్రం ప్రతి ఒక్కరిలోనూ ఉంది.  ఇన్నాళ్లూ తనపై జరిగిన హత్యాయత్నంగురించి ఎక్కడా మాట్లాడింది లేదు. ఇప్పుడు బహిరంగ సభలో ఏం మాట్లాడుతారోనని అంతా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.
  

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com