Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             రాష్ట్ర విభజన జరుగకూడదని చంద్రబాబు ఎప్పుడైనా అన్నారా? - బొత్స సత్యనారాయణ                               చ‌ంద్ర‌బాబు జీవితం అంతా వెన్నుపోటు రాజకీయమే- తమ్మినేని సీతాారాం                               ప్రజా సంకల్ప యాత్ర నుంచి దృష్టి మళ్లించడానికి అధికార పార్టీ కుయుక్తులు- వాసిరెడ్డి పద్మ                               సంక్షేమ హాస్టళ్లను మూసి వేస్తున్నారు-వైయస్ జగన్                               బాబును సీఎం కుర్చీ నుంచి దించితేనే మంచి రోజులు-వైయస్ జగన్                               తూ.గో డీసీసీ మాజీ అధ్యక్షుడు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               ప్రజల సమస్యలన్నింటినీ అధికారంలోకి వచ్చాక పరిష్కరిస్తాం..మీడియా తో వైయస్ జగన్ మోహన్ రెడ్డి                               హోదా కోసం నిస్వార్థంగా పోరాడుతున్నాం-ఎంపి వైవీ సుబ్బారెడ్డి                               ఎవరు ఏ సమస్య చెప్పినా..వినడానికి నేను సిద్ధం..వైయస్ జగన్                 
    Show Latest News
వైయ‌స్ జ‌గ‌న్‌కు విద్యార్ధుల కృత‌జ్ఞ‌త‌లు

Published on : 13-Jul-2017 | 15:37
 

హైదరాబాద్‌ : ప్లీన‌రీ వేదిక‌గా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్ జ‌గ‌న్ ప్రక‌టించిన తొమ్మిది వాగ్ధానాలకు రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను విశేష ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. విద్యార్థుల కోసం ప్ర‌క‌టించిన హామీలకు విద్యార్థి సంఘాల నాయ‌కులు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వ‌ర్యంలో విద్యార్ధులు గురువారం క‌లిశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. వైయ‌స్‌ జగన్‌ హామీలతో విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు. కాగా ప్లీనరీ సమావేశాల్లో వైయ‌స్‌ జగన్‌ తొమ్మిది పథకాలు ప్రకటించిన విషయం తెలిసిందే. విద్యార్థుల చదువుల కోసం అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు పిల్లలకు ఒక్కొక్కరికీ నెలకు రూ. 500 చొప్పున కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలకు రూ. వెయ్యి ఇస్తామని వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఒక్కొక్కరికీ నెలకు రూ. 750 చొప్పున ఇద్దరు పిల్లలకు రూ. 1500 ఇస్తామన్నారు. ఇంటర్ విద్యార్థులకు ఒక్కొక్కరికి నెలకు రూ. వెయ్యి చొప్పున ఇద్దరికి రూ. 2వేలను నేరుగా తల్లులకే ఇస్తామని వైయ‌స్ జ‌గ‌న్ తెలిపారు.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com