Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             నంద్యాలకు దొంగల ముఠా నాయకుడు వస్తున్నాడు..ప్రజలారా బాబు మోసపూరిత మాటలు నమ్మవద్దుః బొత్స                               వైయస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన నంద్యాల మాజీ ఎమ్మెల్యే సంజీవరెడ్డి                               దేవరపల్లి ఘటనపై కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్, ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కఠారియాకు ఫిర్యాదు చేసిన ఎంపీ వైవీ                               బాబు తన రాజకీయ స్వార్థం కోసం దళితులపై దాడులు చేయిస్తున్నాడుః బత్తుల                               చంద్రబాబు తన పాలనలో కులవివక్షను పెంచిపోషిస్తున్నాడుః బత్తుల                               రాష్ట్రపతి ఎన్నికల్లో రామ్ నాథ్ కోవింద్ ఘన విజయం..వైయస్ జగన్ హర్షం                               జగనన్న వస్తే టీడీపీకి పుట్టగతులుండవని బాబు భయపడుతున్నాడుః భూమన                               వైయస్‌ఆర్‌ దానకర్ణుడు... చంద్రబాబు కుంభకర్ణుడుః భూమన                               వైయస్సార్సీపీ నుంచి గెలిచి బాబు సంకలో దూరి మంత్రులుగా కొనసాగడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేః అంబటి                 
    Show Latest News
శిల్పా గెలుపు తథ్యం

Published on : 14-Jul-2017 | 18:23
 

నంద్యాలః కర్నూలు జిల్లా నంద్యాలలో అన్ని వర్గాల ప్రజలు వైయస్సార్సీపీని ఆదరిస్తున్నారని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే అంజాద్ బాష తెలిపారు.  మహానేత వైయస్ఆర్ చేసిన మేలును రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మైనారిటీలు మర్చిపోలేదన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లయినా ఏ నాయకుడు చేయని మేలు  మైనారిటీలకు 4శాతం రిజర్వేషన్లు ఇచ్చి వైయస్ఆర్ చేశారని గుర్తు చేశారు. తద్వారా ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలొచ్చాయన్నారు.  రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఫీజు రీయింబర్స్ మెంట్ తో ఉన్నత చదువులు చదువుకుంటున్నారు. వైయస్ఆర్ సంక్షేమ పథకాల వల్లనే మా కుటుంబాలు బాగుపడ్డాయని మైనారిటీలు వైయస్సార్సీపీ నాయకులను ఆహ్వానిస్తున్నారని చెప్పారు. 
2014 ఎన్నికల్లో  బాబు ఒకే మైనారిటీకి టికెట్ ఇచ్చాడని, అది కూడ కిరణ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో ఇచ్చి ఇద్దరూ మ్యాచ్ ఫిక్స్ చేసుకొన్నారన్నారు.  కానీ, తమ అధినేత వైయస్ జగన్ మైనారిటీలకు  4సీట్లు ఇచ్చారని, ఇచ్చిన అన్ని చోట్ల ముస్లిం మైనారిటీలు అఖండ మెజారిటీతో గెలిపించారన్నారు. బాబు మూడేళ్ల పాలనలో  మైనారిటీలకు ఎక్కడ కూడ న్యాయం జరగలేదన్నారు. నంద్యాలలో ఉపఎన్నిక రాగానే అకస్మాత్తుగా మైనారిటీల మీద ప్రేమ చూపిస్తున్నాడని,  ముస్లిం నాయకులకు పదవులు ఎర వేస్తున్నాడని అన్నారు. 

అదీ చేస్తాం, ఇదీ చేస్తామని మైనారిటీలను చంద్రబాబు మభ్యపెడుతున్నాడన్నారు. నంద్యాల పట్టణానికి  చెందిన టీడీపీ నేత ఫరూక్ కు అపాయింట్ మెంట్ కూడ ఇవ్వని సీఎం నంద్యాలలో ఉపఎన్నిక రాగానే ఎమ్మెల్సీ పదవిని ఆశ చూపుతున్నాడన్నారు.  కడప స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు కూడ కోడూరుకు చెందిన చెంగల్రాయుడుకు పదవి ఇస్తానని మాట ఇచ్చి ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. బాబుది ఎన్నికల స్టంట్ మాత్రమేనన్నారు. ఎన్నికలయ్యాక బాబుకు  ఫరూక్ గుర్తుండడన్నారు. హిందూపురం లో బాలకృష్ణ కోసం సీటును త్యాగం చేసిన అబ్దుల్ గనీని, గుంటూరులో లాల్ జాన్ బాష లకు బాబు తీరని అన్యాయం చేశాడన్నారు. నంద్యాల మైనారిటీల ఓట్లను సంపాదించాలన్న ఆలోచనతోనే బాబు అమిత ప్రేమ కురిపిస్తున్నాడన్నారు.  ముస్లిం నాయకులకు పదవులు ఎరచూపుతూ భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. టీడీపీ మంత్రులంతా నంద్యాలలో మకాం వేసి డబ్బులు, లొంగకపోతే పదవులు, తలొగ్గకపోతే కేసులు పెడతామని బెదిరిస్తూ పార్టీలోకి తీసుకుే పరిస్థితి దుర్మార్గమన్నారు.  వైయస్సార్సీపీకి నంద్యాలలో ఎనలేని ప్రజాధారణ ఉందని, మైనారిటీలంతా వైయస్సార్సీపీ వైపే ఉన్నారని తెలిపారు. శిల్పా మోహన్ రెడ్డి గెలవడం తథ్యమని అన్నారు.  

సంబంధిత వార్తలు

Emperor of Corruption YS Rajashekar Reddy YS Rajashekar Reddy Central Assistance to AP
Prajalachentha Epaper Youtube
Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com