Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             సంక్షేమ రాజ్యం రావాలంటే వైఎస్‌ జగన్‌ సీఎం కావాలి.. కావాల్సిందే: బొత్స సత్యానారాయణ                                ఇంటికో రేటు.. పెన్షన్‌కో రేటు వసూలు: వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నాయ‌కులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌                               కాగ్‌ నివేదికలో పోలవరం అవినీతి బట్టబయలు అయింది: ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి                                వైయ‌స్‌ జగన్‌ పాదయాత్రలో ఊళ్లకు ఊళ్లు కదిలివస్తున్నాయి.. దేశంలోనే వైయ‌స్‌ జగన్‌ వంటి ప్రజాదరణ కలిగిన నేత మరొకరు లేరు: తలశిల రఘురాం                               వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర ఈ నెల 24వ తేదీన విజయనగరం జిల్లా కొత్తవలస దగ్గరలోని దేశపాత్రునిపాలెం వద్ద 3000కిలోమీటర్ల మైలురాయిని చేరనుంది: పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం                               వర్షం కారణంగా నేటి 267వ రోజు వైయ‌స్ జ‌గ‌న్ ప్రజాసంకల్పయాత్రకు విరామం                               వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో వంగవీటి కుటుంబానికి అన్యాయం జరగదు, తగిన గౌరవం, గుర్తింపు ఉంటాయి: పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు                               రాష్ట్ర‌వ్యాప్తంగా అట్ట‌హాసంగా ప్రారంభ‌మైన‌ ‘రావాలి జగన్‌... కావాలి జగన్‌’                               రాష్ట్రంలో ఎంతోమంది మేధావులు, ఇంజనీర్లు ఉండగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని పనులు సింగపూర్‌ కంపెనీలకు అప్పగిస్తున్నారు: వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డి                  
    Show Latest News
సీడ్ పార్క్ అంటే శిలాఫలకమేనా?

Published on : 19-Jun-2018 | 17:40
 

పరీక్షా సమయం మించి పోతున్నప్పుడు సమాధానాలు గుర్తొచ్చిన విద్యార్థిలా బెంబేలెత్తుతున్నాడు చంద్రబాబు. ఎన్నికల గంట గుండెల్లో మోగేస్తోంది. మరో పక్క చేసిన వాగ్దానాలు ఒక్కటీ పూర్తి కాలేదు. దాని ప్రభావం ఎన్నికల పరీక్షల్లో డిస్టింక్షన్ లో ఫెయిల్ అవ్వడమే అని బాబుకు బాగా తెలుసు. అందుకే ప్రశ్నకో లైను చొప్పున సమాధానం రాసేసి మమ అనిపించుకునే తంతులాంటిది మొదలెట్టాడు. అడిగితే అన్ని ప్రశ్నలకూ జవాబులు రాసానని చెప్పుకోవచ్చు. అరకొర మార్కులతోనైనా గట్టెక్కిపోవచ్చనే గుడ్డినమ్మకం లాంటిది బాబులోనూ కనిపిస్తోంది. ఇచ్చిన హామీలకు సంబంధించి ఓ ప్రెస్ మీటో, ఓ ఇనాగిరేషనో చేసి పడేస్తే హామీలు నెరవేర్చేస్తున్నామోచ్ అనే బిల్డప్ తో ఎన్నికల పరీక్షలను ఎదుర్కోవచ్చన్నది బాబు వ్యూహం. బాబు సింగిల్ లైన్ ఆన్సర్ లాంటి మరో ఫీటే కర్నూల్ మెగా సీడ్ పార్క్.  

ప్రకటనలు ఘనం పనులు శూన్యం

కర్నూలు జిలా తంగెడంచ లో మెగా సీడ్ పార్క్ మౌలిక వసతుల అభివృద్ధి కోసం ఈ ఏడాదిలో ప్రాణాళిక రూపొందించామని చెప్పారు. 670 కోట్ల విలువైన ప్రాజెక్టు అన్నారు. బడ్జెట్ లో 190 కోట్లు కేటాయింపులు ఇస్తున్నట్టు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు చెప్పాడని వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి ప్రకటన కూడా చేసారు. ఈ ప్రాజెక్టుకోసం 600 ఎకరాల భూమిని కూడా కేటాయించామన్నారు. ఏడాదికిందట శంకుస్థాపన అయ్యిన ఈ మెగా సీడ్ పార్కు శిలాఫలకాన్ని తప్ప మరేమీ నోచుకోలేదు. ఇప్పుడు కొత్తగా ఏదో జరిగిపోతోందనే భ్రమ కప్పించేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నమే విజయవాడలో ఈ నెల 20, 21న జరగబోతున్న మెగాసీడ్ వర్క్ షాప్. బాబు చేసే సమ్మిట్లు, వర్కుషాపుల వల్ల ఆ కార్యక్రమాలు జరుగుతున్న హోటళ్లు బాగు పడుతున్నాయి తప్ప ప్రాజెక్టులేవీ ముందుకు కదలడం లేదు.

ఆరంభశూరత్వం

అడుగు ముందుకు కదలదు. కానీ ఆకాశ విహారం అయిపోయిందంటాడు చంద్రబాబు. కర్నూలు లో మెగా సీడ్ పార్కు కోసం అమెరికాలోని ఐయోవా యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దాని తర్వాత నిరుడు చంద్రబాబు వచ్చి శంకుస్థాపన చేసాడు. ఆ సందర్భంగా మెగా సీడ్ పార్కు గురించి ఓ పెద్ద ప్రెజెంటేషన్ ఇచ్చి ప్రసంగం చేసాడు. భారీ బిల్డింగులతో, విశాలమైన ఆవరణలో ప్లాంటేషన్ తో కనిపించిన ఆ ప్రజెంటేషన్ వీడియో చూసిన వాళ్లు అచ్చం ఇలాంటి గొప్ప విత్తన భాండాగారం మన జిల్లాకు రాబోతోందని సంబరపడ్డారు. గిట్టుబాటు ధర, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డు స్టోరేజీలు, మెగా ఫుడ్ పార్కులు, మీడియం ఫుడ్ పార్కులు అంటూ తన ప్రసంగంతోనే చంద్రబాబు చంద్రలోకాన్ని చూపించాడు. తీరా చూస్తే ఇన్నాళ్లు గడిచినా శంకుస్థాపన జరిగిన చోట పునాదిరాయైనా పడలేదు. పిచ్చి మొక్కలు తప్ప విత్తనాభివృద్ధి మచ్చుకైనా కనిపించలేదు. నాలుగేళ్లలో 28 సార్లు కర్నూలు వచ్చిన చంద్రబాబు సీడ్ పార్కు, టెక్స్ టైల్ పార్కు, ఫుడ్ పార్కు అంటూ రకరకాల పేర్లతో శిలాఫలకాలు వేసి వెళ్లిపోయాడు. అవన్నీ మట్టికొట్టుకుపోవడం తప్ప ముందుకు సాగుతున్న దాఖలాలు లేవు. ఇక సీడ్ పార్కు విషయంలో విజయవాడలో ఓ ఆఫీసును మాత్రం ఏర్పాటు చేసారు. అది కూడా ఈమధ్యే ప్రారంభం అయ్యింది. ఇప్పుడు భాగస్వామ్య ఐయోవా యూనివర్సిటీ ప్రతినిధులతో వర్క్ షాప్ అంటూ హడావిడి సృష్టిస్తున్నాడు చంద్రబాబు.

వివాదాల భాగస్వామ్యం

మెగా సీడ్ పార్క్ అభివృద్ధి కోసం ఒప్పందం కుదుర్చుకున్న అమెరికాలోని ఐయోవా యూనివర్సిటీ అందించే సహాయం సాంకేతిక సహకారంతో పాటు సమాచార మార్పిడి. అయితే విత్తన శాస్త్రానికి సంబంధించి ఈ యూనివర్సిటీకంటే మెరుగ్గా ఉన్న వాటిని పక్కన పెట్టారనే విమర్శలున్నాయి. అంతేకాదు ఈ యూనివర్సిటీ నుంచి సీడ్ పార్క్ భాగస్వామిగా తీసుకున్న దిలీప్ కుమార్ పై కూడా పలు ఆరోపణలున్నాయి. హైదరాబాద్ లో ఇక్రిశాట్ లో పని చేసే సమయంలో తోటి మహిళా శాస్త్రవేత్తను వేధించి, ఆమె ఆత్మహత్యకు కారణమయ్యాడని కేసులున్నాయి. అంతేకాదు ఇక్రిశాట్ లో ఆర్థిక నేరాలకు పాల్పడ్డందుకు డైరెక్టర్ నుంచి నోటీసులందుకుని, విధిలేని పరిస్థితుల్లో ఆ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి అమెరికాలోని ఐయోవా యూనివర్సిటీలో చేరాడు. ఇలాంటి నేర చరిత్ర ఉన్న వ్యక్తిని ఓ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు బాధ్యతలివ్వడంపై అధికారులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబకు వీటన్నిటి గురించీ ఏమాత్రం పట్టింపు లేదు. ఎమ్.ఓ.యు అయ్యింది కనుక పునాది రాసి వేయడం ద్వారా ఓ బహుళార్థ సాధక ప్రాజెక్టును ప్రారంభించామని ప్రచారం చేసుకోవాలని ఉవ్విళ్లూరడమే సరిపోతోంది. 

సంబంధిత వార్తలు


ప్రతి ఇంటికీ నవరత్నాలు
YSRCP Navaratna YS Rajashekar Reddy YS Rajashekar Reddy Emperor of Corruption YS Rajashekar Reddy Central Assistance to AP Prajalachentha
Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com