Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ఉక్కు ప‌రిశ్ర‌మ సాధ‌న‌కు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి రెండో రోజు నిరాహార దీక్ష‌కు అనూహ్య మద్దతు                                రాజోలు నియోజ‌క‌వ‌ర్గంలో వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం                               వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 194వ రోజు నాగుల్లంక శివారు నుంచి ప్రారంభం                               30న అనంత‌పురంలో న‌య వంచ‌న దీక్ష: వైయ‌స్ఆర్‌సీపీ నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ‌                               ప్రతిదేవాలయ బోర్డులోనూ ఒక నాయీ బ్రహ్మణుడిని సభ్యుడిగా నియమిస్తాం: వైయ‌స్ జ‌గ‌న్ హామీ                               నాయీబ్రహ్మణుల పట్ల సచివాలయం సాక్షిగా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవర్తించిన తీరును చూసి విస్తుపోయాను: వైయ‌స్ జ‌గ‌న్‌                               వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరిన వంద మంది అగ్ని కుల క్ష‌త్రియులు                               తనపై నిరాధార ఆరోపణలు చేసిన యరపతినేని , రవీంద్రకుమార్‌లపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి                                ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు స్వర బ్రహ్మ నేరెళ్ల వేణు మాధవ్ మృతి ప‌ట్ల వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి సంతాపం                 
    Show Latest News
బాబుకు దిమ్మ తిరిగి బొమ్మకనపడాలి

Published on : 21-Aug-2017 | 15:50
 

  • చంద్రబాబు మైనార్టీ, దళిత ద్రోహి
  • శ్మశానానికి ముగ్గుండదు.. చంద్రబాబుకు సిగ్గుండదు
  • భూమాను ఫ్యాక్షనిస్టు అన్న చంద్రబాబు నేడు దేవుడంటున్నాడు
  • ఓటర్లకు వైయస్‌ జగన్‌ అండగా ఉంటూ టీడీపీ తాట తీస్తాడు
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా
నంద్యాల: రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన చంద్రబాబుకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించేలా నంద్యాల నియోజకవర్గ ప్రజలు తీర్పు ఇవ్వాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ధ్వజమెత్తారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా యాళ్లూరు గ్రామంలో ఆమె మాట్లాడుతూ.. నంద్యాల గడ్డ.. వైయస్‌ఆర్‌ అడ్డా అన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ముగ్గురు మైనార్టీలకు మంత్రి పదవులు ఇచ్చారన్నారు. అదే విధంగా వైయస్‌ఆర్‌ సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నలుగురు మైనార్టీలను గెలిపించుకున్నాడన్నారు. కానీ చంద్రబాబు ఓడిపోయే చోట ముస్లిం అభ్యర్థిని నిలబెట్టాడని ఆమె చెప్పారు. తన కేబినెట్‌లో ఒక్క మైనార్టీకి కూడా మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. అంతే కాకుండా మూడున్నర సంవత్సరాలుగా అర్హత లేని వారికి, బుర్రలేని లోకేష్‌కు ఎమ్మెల్సీ ఇచ్చారు కానీ పార్టీ పట్ల విధేయతతో ఉన్న ఫరూక్‌కు ఎమ్మెల్సీ ఇవ్వలేదన్నారు. నంద్యాలలో ఉప ఎన్నికలు రాగానే ఫరూక్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారన్నారు. ముస్లింలంతా మైనార్టీ ద్రోహి చంద్రబాబుకు బుద్ధి చెప్పాలన్నారు. చదువురాని దద్దమ్మ ఆదినారాయణరెడ్డి దళితులకు చదువురాదంటూ కించపరిచేలా మాట్లాడుతున్నాడని రోజా మండిపడ్డారు. 

స్మశానానికి ముగ్గు ఉండదు.. చంద్రబాబుకు సిగ్గు ఉండదని ఎమ్మెల్యే రోజా విమర్శించారు. శిల్పా మోహన్‌రెడ్డి టీడీపీలో ఉన్నంత వరకు మంచివాడన్న చంద్రబాబు పార్టీ వీడగానే చెడ్డవాడని మాట్లాడడం హాస్యాస్పదం అన్నారు. రాయలసీమ పౌరుషం ఉన్న వ్యక్తి కాబట్టే శిల్పా చక్రపాణిరెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైయస్‌ఆర్‌ సీపీలో చేరారన్నారు. అదే మీ పార్టీలో చేరిన 21 మందికి పౌరుషం ఉందా అని ప్రశ్నించారు. రాయలసీమ గడ్డపై పుట్టివుంటే వైయస్‌ఆర్‌ సీపీ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ప్రజల ముందుకు రావాలన్నారు. అసెంబ్లీ సాక్షిగా భూమా నాగిరెడ్డిని విష వృక్షం నాటానని మాట్లాడిన చంద్రబాబు నేడు భూమా దేవుడు అంటూ ఓట్లు అడుగుతున్నాడన్నారు. మంత్రి పదవి ఇస్తానని వెన్నుపోటు పొడిస్తే గుండెపోటు వచ్చి భూమా చనిపోయారన్నారు. 

అసెంబ్లీ టైగర్‌.. ఆంధ్రా వ్యూచర్‌ వైయస్‌ జగన్‌ నాయకత్వాన్ని బలపర్చాలంటే ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని రోజా అన్నారు. అఖిలప్రియ, అభ్యర్థి బ్రహ్మానందరెడ్డిలు నాన్‌లోకల్‌ అని, శిల్పా మోహన్‌రెడ్డి పక్కా లోకల్‌ అన్నారు. అందుబాటులో ఉండే వ్యక్తికి ఓటు వేసి గెలిపించుకుంటేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. ఎవరైనా రేషన్‌ ఇవ్వం, ఇల్లు ఇవ్వం అని బెదిరిస్తే మీ అండగా వైయస్‌ జగన్‌ ఉండి తెలుగుదేశం తాటతీయడానికి కూడా రెడీగా ఉన్నాడన్నారు. నంద్యాలలో వైయస్‌ఆర్‌ సీపీ ఓడిపోతే రోజా గుండు కొట్టుకుంటుందా అని బోండా అనడం విడ్డూరంగా ఉందన్నారు. వైయస్‌ఆర్‌ సీపీపై గెలిచి టీడీపీ చేరిన 21 మందితో రాజీనామా చేయించి ప్రజల ముందుకు వస్తే ఎవరు గుండు కొట్టుకుంటారో అర్థం అవుతుందన్నారు. రాష్ట్రంలోని 5 కోట్ల మంది తలరాత మారే విధంగా టీడీపీని తరిమికొట్టేందుకు ప్రజలంతా వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థి శిల్పా  మోహన్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com