Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, చంద్రబాబు మధ్య బంధం తేలతెల్లమవుతోంది: వాసిరెడ్డి పద్మ                                నచ్చితే నంది.. నచ్చకపోతే పందిలా తెలుగుదేశం పార్టీ పత్రికల తీరు: వాసిరెడ్డి పద్మ                               ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ ప‌థ‌కాన్ని నిర్వీర్యం చేస్తూ పేద‌ల‌కు ఉన్న‌త చ‌దువులు దూరం చేస్తున్న వైఖ‌రికి నిర‌స‌న‌గా వైయ‌స్‌ఆర్ విద్యార్ధి విభాగం ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల‌లో అక్టోబ‌ర్ 25వ తేదీన ఫీజుపోరు : విజ‌య‌సాయిరెడ్డి                               జననేత వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 292వ రోజు సాలూరు శివారు నుంచి ప్రారంభం                               చంద్రబాబు రాజకీయ జీవితమంతా రక్త చరిత్రే: భూమన కరుణాకర్‌రెడ్డి                                వైయస్‌ జగన్‌ను కలిసిన సాక్షార భారత్‌ గ్రామ కో–ఆర్డినేటర్లు                               తుని రైలు దహనం ఘటన వెనుక చంద్రబాబు హస్తం లేదా: భూమన కరుణాకర్‌రెడ్డి                                గుంటూరు జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు మల్లాది శివన్నారాయణ, చిలకలూరిపేట టీడీపీ మాజీ అధ్యక్షుడు శివయ్య, జి.వెంకట్రావు, కె.కాంతారావులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               దేశంలో, రాష్ట్రంలో ఇలాంటి అబద్ధపు ముఖ్యమంత్రి ఎక్కడా లేరని, గల్ఫ్‌ దేశాల్లో ఇలాంటి అబద్ధాల ముఖ్యమంత్రిని ఎప్పుడో ఉరి తీసేవారు: ఎమ్మెల్యే ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి                 
    Show Latest News
అందుకే చంద్రబాబు ప్యాకేజీ ఒప్పుకున్నాడు
దోచుకోవడం అయిన తరువాత హోదా అంటూ వంచన

Published on : 15-Apr-2018 | 15:05
 

అవకాశాన్ని బట్టి మాట మార్చే వ్యక్తి ఏపీ సీఎం
హోదా కోసం పోరాడేవారంతా రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతారు
విశాఖలో రిలే నిరాహార దీక్షలకు ఎంపీ విజయసాయిరెడ్డి సంఘీభావం

విశాఖపట్నం: సొమ్ములు కూడబెట్టుకొని విదేశాల్లో దాచుకునేందుకే చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీని ఒప్పుకున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శించారు. అప్పుడు ప్యాకేజీ మేలని దోచుకోవడం ముగిసిన తరువాత.. ఇప్పుడు హోదా అంటూ ప్రజలను వంచించే కార్యక్రమం చేస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు అవకాశాన్ని బట్టి మాట మార్చే వ్యక్తి అని దుయ్యబట్టారు. విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రత్యేక హోదా సాధన కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు చేపట్టిన రిలే నిరాహార దీక్షల్లో ఆయన పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్యాకేజీ  హోదాకు ప్రత్యామ్నాయం కాదని తెలిసినా ఎందుకు ఒప్పుకున్నారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రంలో ఏ విధంగా అభిబవృద్ధి చెందాయో మీకు తెలియదా అని నిలదీశారు. విభజన అంశాలు, ప్రత్యేక హోదా పై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని, ఎంత సేపు రాష్ట్ర సంపదను ఎలా దోచుకోవాలనే ఆలోచన చేస్తున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వ మోసాలను ప్రజలంతా గమనిస్తున్నారని, తగిన సమయంలో మంచి గుణపాఠం చెబుతున్నారన్నారు.

ప్రత్యేక హోదా సాధన కోసం పోరాటం పోరాడుతున్న నాయకులు ఆంధ్రరాష్ట్ర చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతారని విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే హోదా సాధించడంలో విఫలమయ్యారన్నారు. యూటర్న్‌ తీసుకొని హోదా అంటూనే ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నాడని ఆరోపించారు. ఈ నెల 16వ తేదీన వైయస్‌ఆర్‌ సీపీ, వామపక్షాలు, ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన బంద్‌ వల్ల ప్రయోజనం లేదని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా.. ఎన్నిసార్లు బంద్‌లకు పిలునిచ్చిందో గుర్తు చేసుకో చంద్రబాబూ అని సూచించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడే పార్టీలకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. టీడీపీ ఎంపీలు కేవలం కేంద్ర మంత్రి పదవులకే రాజీనామా చేశారని, హోదాపై నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఎంపీ సభ్యత్వాలకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com