Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును పశ్చిమ గోదావరి జిల్లాకు పెడతామని వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడంపై సర్వత్రా హర్షం                                వైయ‌స్‌ జగన్‌ పాదయాత్రతో దిగొచ్చిన ఏపీ సర్కార్‌, ఆక్వా రైతుల స‌మ‌స్య‌ల‌పై సీఎం స‌మీక్ష‌                               వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని క‌లిసిన ప్రముఖ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి                                ఆకివీడు నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 172వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు అల్లూరి సీతారామారాజు పేరు: వైయ‌స్ జ‌గ‌న్‌                               ఆక్వా రైతులకు విద్యుత్తు చార్జీలు 4.75 పైసలు నుండి 1.50 పైసలు వరకు తగ్గిస్తాం: వైయ‌స్ జ‌గ‌న్ హామీ                               టీటీడీ వివాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి: ఎంపీ వ‌ర‌ప్ర‌సాద్‌                               చంద్ర‌బాబుకు సింగిల్ పోటీ చేసే ధైర్యం లేదు: అంబ‌టి రాంబాబు                               పెదకాపవరం గ్రామ శివారులో రొయ్యల చెరువు క్షేత్రాన్ని సందర్శించిన వైయ‌స్ జ‌గ‌న్‌                 
    Show Latest News
అధైర్యపడొద్దు.. అండగా ఉంటా
వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి భ‌రోసా

Published on : 13-Feb-2018 | 11:51
 - ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు విశేష స్పంద‌న‌
- అడుగడుగునా బ్ర‌హ్మ‌ర‌థం
- దారిపొడువునా సమస్యల వెల్లువ
- సాయంత్రం కలిగిరిలో బహిరంగసభ
 నెల్లూరు:  నాలుగేళ్ల చంద్ర‌బాబు పాల‌న‌లో మోస‌పోయిన ప్ర‌తి ఒక్క‌రూ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లిసి త‌మ బాధ‌లు చెప్పుకుంటున్నారు. బాబు వస్తేనే జాబు వస్తాదనే మాటలు నమ్మిమోసపోయిన యువత..రుణాల మాఫీ హామీలు విశ్వసించిదగాపడ్డ అన్నదాతలు, అక్కచెల్లెమ్మలు.ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందకఉన్నత చదువులకు దూరమైన విద్యార్థులు..పింఛను అందక కన్నీటి పర్యంతమవుతున్నఅవ్వాతాతలు.. దివ్యాంగులు.. వితంతువులు..ఆపదలో మెరుగైన వైద్యం కరువైన అభాగ్యులు....వంచనకు గురైన అన్ని వర్గాల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది.తమ కష్టాలు తెలుసుకునేందుకు వస్తున్న జననేతకుప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. జ‌న‌నేత  అడుగులో అడుగేస్తున్నారు..బాధాతప్త హృదయాల కన్నీళ్లు తుడుస్తూ..నేనున్నానని భరోసా ఇస్తూ..ప్రజాసంకల్ప యాత్రలో వైయ‌స్ జగన్‌ ముందుకు సాగుతున్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గ‌తేడాది న‌వంబ‌ర్ 6వ తేదీన మొద‌లుపెట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర దిగ్విజ‌యంగా సాగుతోంది. ప్ర‌స్తుతం నెల్లూరు జిల్లా ఉద‌య‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర కొన‌సాగుతోంది. మంగ‌ళ‌వారం ఉద‌యం  కలిగిరి మండలం పెద్ద కొండూరు శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. పెద్దపాడు, వీరారెడ్డి పాలెం,  పోలంపాడు మీదుగా కలిగిరి వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. జననేతకు ప్రజలు పెద్ద ఎత్తునా స్వాగతం పలుకుతున్నారు.

స‌మ‌స్య‌ల చ‌ట్రంలో..
నాలుగేళ్లుగా అభివృద్ధి జాడే లేదు. ఎటుచూసినా సమస్యల సుడిగుండాలే. గిట్టుబాటు ధరలేక అన్నదాత.. చేసిన కష్టానికి సరైన ఫలం అందలేదని కూలీలు.. ఏడుపదుల వయస్సు దాటినా పింఛను అందడం లేదని వృద్ధులు.. ఇలా అందరూ సమస్యల చట్రంలో కొట్టుమిట్టాడుతూ జననేత ఎదుట గోడు వెళ్లబోసుకుంటున్నారు. అందరి కష్టాలను వింటూ.. వారి కన్నీళ్లను తుడుస్తూ.. అధైర్యపడొద్దు.. అండగా ఉంటానని భరోసా ఇస్తూ వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర కొనసాగిస్తున్నారు. పల్లె ప్రజల నీరాజనాల నడుమ ప్రజాసంకల్పయాత్ర కొన‌సాగుతోంది. ఇవాళ సాయంత్రం  కలి గిరిలో బహిరంగసభలో ప్రజలనుద్దేశించి వైయ‌స్ జ‌గ‌న్  ప్రసంగించనున్నారు. 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com