Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ప్రజలకు ఎన్ని అబద్దాల చెప్పినా వింటారనే నాయకులకు తెలంగాణ ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారు : వైయ‌స్ జ‌గ‌న్‌                               లగడపాటి రాజకీయ విశ్లేషకుడు ఎప్పుడు అయ్యాడా? అని ఆశ్చర్యం వేసింది: వైయ‌స్ జ‌గ‌న్‌                               కాంగ్రెస్‌, టీడీపీ జిమ్మిక్కులను ప్రజలను తిప్పికొట్టారు: వైయ‌స్ జ‌గ‌న్‌                               చంద్రబాబు, కాంగ్రెస్ అనైతిక పొత్తుకు ప్రజలు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు: వైయ‌స్ జ‌గ‌న్                                భస్మాసురుడు చేయి పెట్టినా.. చంద్రబాబు కాలు పెట్టినా అంతా బుడిదే: వైయ‌స్ జ‌గ‌న్‌                               నందగిరి పేట నుంచి వైయ‌స్ జ‌గ‌న్‌ 319వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               హిందూపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ గని వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               ప‌వ‌న్‌కు చిత్త‌శుద్ది ఉంటే చంద్ర‌బాబు అవినీతిపై నిల‌దీయాలి: ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్‌                               డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు వైయ‌స్ జగన్ నివాళులు                 
    Show Latest News
జ‌న హృద‌య నేత‌

Published on : 25-May-2018 | 11:17
 

- కొల్లేరువాసుల క‌న్నీరు తుడుస్తున్న వైయ‌స్ జ‌గ‌న్‌
- ఆక్వా రైతుల‌కు అండ‌గా ఉంటాన‌ని హామీ
- కొండ దేవ‌ర క‌ష్టాలు తీరుస్తాన‌న్న‌ రాజ‌న్న బిడ్డ 
- సాయంత్రం ఆకివీడులో బ‌హిరంగ స‌భ‌
తూర్పుగోదావ‌రి: ప‌్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు పాద‌యాత్ర‌గా బ‌య‌లుదేరిన  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ప్ర‌జ‌ల క‌ష్టాలు చూసి చ‌లించిపోతున్నారు. అండ‌గా ఉంటాన‌ని హామీ ఇస్తూ..వారి కన్నీళ్లు తుడుస్తున్నారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. శుక్ర‌వారం పెద్ద కాప‌వ‌రం నుంచి వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రారంభ‌మైంది. ఈ సంద‌ర్భంగా ప‌లువురు జ‌న‌నేత‌ను క‌లిసి త‌మ సమస్యలు చెప్పుకుని కడగండ్లు తీర్చాలని విన్నవించారు. అనారోగ్య బాధలు, సొంతింటి కోసం వినతులు.. సేద్యానికి సాయం లేక అన్నదాతలు, ఆక్వా రైతుల ఆవేదనలు.. పల్లెల్లో దాహార్తి కేకలు.. కుల ధ్రువీకరణ పత్రాల జారీలో ఇబ్బందులతో జగనన్న వద్దకు తరలివస్తున్నారు. వారందరి కష్టాలను జననేత ఓర్పుగా విని.. నేనున్నానని భరోసా ఇస్తున్నారు. కన్నీళ్లు తుడుస్తూ.. ధైర్యం చెబుతూ.. ముందుకు సాగుతున్నారు. జన సంక్షేమమే తన అజెండా అని నిరూపిస్తున్నారు.  గుక్కెడు మంచినీళ్లు దొరక్క అల్లాడుతున్నాం.. మంచినీటి చెర్వుల్లోని నీళ్లు పసర్లు పట్టి దుర్వాసన కొడుతున్నాయి. అనారోగ్యం పాలవుతున్నాం. పలుసార్లు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ కొల్లేరు వాసులు, మహిళలు వైయ‌స్ జ‌గ‌న్‌ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.  కొండ దొర మ‌హిళ‌లు జ‌న‌నేత‌కు క‌లిసి త‌మ‌కు ఎస్టీ స‌ర్టిఫికెట్లు ఇవ్వ‌డం లేద‌ని, ప‌క్కా ఇల్లు లేవ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వారంద‌రికీ వైయ‌స్ జ‌గ‌న్ హామీ ఇస్తూముందుకు సాగుతున్నారు. ఇవాళ సాయంత్రం ఉండి నియోజ‌క‌వ‌ర్గంలోని ఆకివీడులో ఏర్పాటు చేసి బ‌హిరంగ స‌భ‌లో వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగించ‌నున్నారు. 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com