Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             పోలీసుల లాఠీలతో ప్రభుత్వాన్ని నడపాలనుకుంటే గడాఫికి పట్టిన గతే బాబుకు పడుతుందిః అంబటి                               చంద్రబాబు దళిత వ్యతిరేక పాలనః వైవీ సుబ్బారెడ్డి                               మహిళలపై పోలీసుల అరాచకం..దళితులపై దాడి సిగ్గుచేటుః వైవీ సుబ్బారెడ్డి                               బాబు పాలనలో దళితులపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోయాయిః వైవీ సుబ్బారెడ్డి                               ప్రజలారా బాబు మోసపూరిత మాటలు నమ్మవద్దుః బొత్స                               వైయస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన నంద్యాల మాజీ ఎమ్మెల్యే సంజీవరెడ్డి                               దేవరపల్లి ఘటనపై కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్, ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కఠారియాకు ఫిర్యాదు చేసిన ఎంపీ వైవీ                               బాబు తన రాజకీయ స్వార్థం కోసం దళితులపై దాడులు చేయిస్తున్నాడుః బత్తుల                               చంద్రబాబు తన పాలనలో కులవివక్షను పెంచిపోషిస్తున్నాడుః బత్తుల                 
    Show Latest News
రాజన్నా నీ మేలు మరువలేనిది

Published on : 20-May-2017 | 07:02
 

  • ప్రజల కష్టాలే తన కష్టాలుగా భావించిన మహానేత
  • రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసి నేటికి 8 వసంతాలు పూర్తి
  • ఊహించనివిధంగా సంక్షేమ పథకాలు అమలు
  • ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ప్రియతమ నేత
మాట తప్పని, మడమ తిప్పని మహానేతగా.. పేదలు, రైతుల పక్షపాతిగా కీర్తింపబడిన దివంగత ముఖ్యమంత్రి, ప్రియతమ నేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి  మనకు భౌతికంగా దూరమై దాదాపు 8 ఏళ్లు పూర్తి కావస్తోంది. బడుగు బలహీన వర్గాలకు చేయూతనందించడంతో పాటు ప్రతి మహిళా లక్షాధికారి కావాలని కలలుకన్నాడు ఆ మహానేత. ఐదేళ్ల పాటు సువర్ణయుగాన్ని అందించారు. కుల, మత, ప్రాంతాలకతీతంగా అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చి తెలుగు ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. అందుకే రాజన్నను  ప్రజలు మళ్లీ రెండవసారి గెలిపించుకున్నారు.  2009, మే 20వ తేదీ రెండవ సారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి నేటికి 8 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా వైయస్‌ఆర్‌పై ప్రత్యేక కథనం.

ప్రజల కష్టాలు చూసి చలించిన మహానేత
కరువు కాటలతో ఇబ్బందులు పడుతున్న రైతుల కష్టాలను, ప్రజల బాగోగులు తెలుసుకునేందుకు పాదయాత్ర చేపట్టిన డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి వారి కష్టాలను చూసి చలించి పోయారు. అప్పుల బాధలతో రైతులు ఆత్మహత్యలు చేసుకోవడాన్ని చూసి  కన్నీరు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో  2004 ఎన్నికలకు ముందు రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటను తప్పకుండా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం చేశారు. ఆ సంతకం చిరస్థాయిగా మిగిలిపోయింది. తర్వాత  సాగు భారమై అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతన్నల ఆశలకు కొత్త ఊపిరులూదారు. వ్యవసాయ రుణాల మాఫీతో రైతుకు ఉపశమనం కలిగించారు. 

లక్షల ఎకరాలు సాగులోకి..
రాష్ట్రంలో ఎడారిగా మారిన పంట పొలాలను సస్యశ్యామలం చేశారు దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి. జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టులను చేపట్టి లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చారు. పోలవరం, చేవెళ్ల–ప్రాణహిత వంటి భారీ నీటి  పథకాలతో అప్పటి ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోని లక్షల  ఎకరాల్లో మూడు పంటలు పండించుకునేలా నీరు అందించారు. దీంతో కొన్ని ఏళ్ల నుంచి అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతులకు కొత్త శక్తిని ఇచ్చారు. ఎడారిగా ఉన్న భూములను సైతం సాగులోకి తేవడంతో రైతులంతా రాజన్నను దేవుడి మాదిరి కొలిచారు. 

ఆరోగ్యశ్రీతో పేదలకు కార్పొరేట్‌ వైద్యం
చిన్న చిన్న జబ్బులకు కూడా డబ్బులు కట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతూ చివరకు ప్రాణాలే వదులుకుంటున్న పేదలను చూసి అలాంటి వాళ్లకు ఏదైనా చేయాలనే ఉద్దేశ్యంతో  ‘ఆరోగ్యశ్రీ’ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా వైయస్‌  ఎంతోమంది పేదలకు కొత్త ఊపిరిలను ఊదారు. కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పేదలకు కార్పొరేట్‌ వైద్యం అందించి తిరిగి ఇంటికి వెళ్లడానికి కూడా చార్జీలకు డబ్బులు ఇచ్చి పంపించిన దేవుడు వైయస్‌.

104..108లతో సేవలు
పేదలకు, దీర్ఘకాలిక రోగులకు, గర్భినులు ఆస్పత్రికి రానవసరం లేకుండా వాళ్ల ఇంటి దగ్గరకే వైద్య సేవలను పంపారు మహానేత వైయస్‌. 104 వాహనాలను ప్రతి గ్రామానికి పంపి అక్కడ వైద్య సేవలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. గర్భినులకు కూడా ప్రభుత్వం మందులను పంపిణీ చేసింది. 108 సేవలు అయితే ప్రజలకు ఎంతగా ఉపయోగపడ్డాయంటే దాన్ని మాటల్లో  వర్ణించడం కష్టం. ఏ చిన్న యాక్సిడెంట్‌ జరిగిన.. ఏ చిన్న సమస్య వచ్చినా.. గర్భినులను ఆస్పత్రికి తీసుకోవాలని ఇలా ఒక్కటేమిటి 108కి ఫోన్‌ కొడితే కుయ్‌..కుయ్‌..కుయ్‌ అంటూ 15 నిమిషాల్లో మనం ఉన్న చోటికి వచ్చి ఆస్పత్రిలో చేర్చావి.

నిరుపేదలకు ఇల్లు..
నిరుపేదలకు సొంత గూడు కల్పించారు  రాజన్న. ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్‌ స్వగృహ పథకాల ద్వారా లక్షల మందికి ఇల్లు సౌకర్యం కల్పించాడు. ఈ పథకాన్ని చిత్తశుద్ధితో చేయమని వైయస్‌  అధికారులను ఆదేశించేవారు కూడా అంతేకాకుండా ప్రతి నిరుపేద విద్యార్థి కూడా చదువకు  దూరం కాకుండా ఉండేందుకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌పథకాన్ని ప్రవేశపెట్టి డాక్టర్లుగాను.. ఇంజినీర్లు గాను.. కలెక్టర్‌ వంటి పెద్ద పెద్ద చదువులు చదువుకునేందుకు అవకాశం కల్పించారు. పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చిన ఘనత వైయస్‌ది. జిల్లాకో విశ్వవిద్యాలయం, గ్రామీణ పేద విద్యార్థులకు పెద్దపీట వేస్తూ ట్రిపుల్‌ ఐటీలను ప్రారంభించారు వైయస్‌. 

ప్రతి మహిళలను లక్షాధికారిణి చేయాలని...
ప్రతి మహిళా లక్షాధికారిని చేయాలని సంకల్పంతో దివంగత మహానేత మహిళలకు పావల వడ్డీకే రుణాలు ఇచ్చారు. డ్వాక్రా సంఘాలకు లక్షల కొద్ది నిధులు ఇచ్చి స్వయం ఉపాధి కింద  ప్రోత్సమించారు. అభయ హస్త పేరుతో వృద్ధ మహిళలకు ఆసరా అందించారు.  ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటేమిటి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి నేటికీ  ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నారు. 

ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి అన్ని వర్గాలకు మేలు చేకూర్చి దివికెగసిన ఆ మహానేత జ్ఞాపకాలను ప్రజలు మరోసారి జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు. రెండవసారి వైయస్ ప్రమాణస్వీకారం చేసిన సరిగ్గా నేటికి 8 వసంతాలు. మా గుండెల్లో నీవు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిఉంటావు  రాజన్న అని బరువెక్కిన హృదయంతో మహానేతను స్మరించుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

Emperor of Corruption YS Rajashekar Reddy YS Rajashekar Reddy Central Assistance to AP
Prajalachentha Epaper Youtube
Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com