Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             చంద్ర‌బాబు ముస్లింల ద్రోహి: ఎమ్మెల్యే ముస్త‌ఫా                               బీజేపీ, టీడీపీలు ఏపీ ప్ర‌జ‌ల‌ను మోసం చేశాయి: మ‌ల్లాది విష్ణు                               కేంద్రంపై పోరాటం చేసే ద‌మ్ము, ధైర్యం చంద్ర‌బాబుకు ఉందా?: వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌                               వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు ఆరోపణలు చేస్తూ టీడీపీ నేత‌లు పైశాచిక ఆనందం పొందుతున్నారు: వాసిరెడ్డి పద్మ                               ప్ర‌త్యేక హోదా సాధ‌న‌కు ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసేందుకు సిద్ధమే: ఆదిమూల‌పు సురేష్‌                               బీజేపీ, టీడీపీల‌కు కాంగ్రెస్ గ‌తే ప‌డుతుంది: అంబ‌టి రాంబాబు                               హజీజ్‌పురం గ్రామంలో పొగాకు రైతులు వైయ‌స్ జ‌గ‌న్‌ను కలిసి వారి సమస్యలను చెప్పుకున్నారు.                               రామపురంలో దివ్యాంగులు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకున్నారు.                                వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 95వ రోజు పెద్దఅలవలపాడు శివారు నుంచి ప్రారంభ‌మైంది.                 
    Show Latest News
చినబాబుకు చుక్కలు చూపిస్తున్న ప్రజలు

Published on : 14-Jul-2017 | 16:43
 

  • వైయస్ఆర్ జిల్లాలో రుణమాఫీపై డ్వాక్రా మహిళల నిలదీత
  • కర్నూలులో 5లక్షల మందికి ఉద్యోగాలిచ్చామన్న లోకేష్ పై స్థానికుల ఆగ్రహం
  • ఎక్కడ ఎవరికిచ్చారో చూపించాలని నిలదీసిన ప్రజలు..నీళ్లు నమిలిన లోకేష్
  • ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మోసం చేశారంటూ లోకేష్ పై విద్యార్థుల మండిపాటు
కర్నూలు: ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై టీడీపీ నేతలను ప్రజలు ఎక్కడిక్కడ నిలదీస్తున్నారు. రాష్ట్రంలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని  ఏదో సందర్భంలో ప్రశ్నిస్తూనే ఉన్నారు.  ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి లోకేష్ కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది.  నిన్న వైయస్సార్ జిల్లాలో రుణమాఫీపై డ్వాక్రా మహిళలు లోకేష్ ను నిలదీసిన సంగతి తెలిసిందే. తాజాగా కర్నూలు జిల్లాలో ప్రజలు చినబాబుకు చుక్కలు చూపించారు.  కర్నూలులో ఓ సభకు హాజరైన సందర్భంగా మంత్రి లోకేష్‌కు స్థానికులు సూటి ప్రశ్న సంధించడంతో నీళ్లు నమలడమే మంత్రి వంతయింది. 

రాయలసీమకు భారీగా పరిశ్రమలొచ్చాయని తమ ప్రభుత్వ పనితీరు కారణంగానే పెట్టుబడులొస్తున్నాయని మంత్రి లోకేష్ మభ్యపెట్టే ప్రయత్నం చేశారు.  కియ మోటార్స్‌ కంపెనీ రావడంతో 5 లక్షల మంది స్థానికులకు ఉద్యోగాలు వచ్చాయని మంత్రి చెప్పడంతో అక్కడి ప్రజలకు చిర్రెత్తుకొచ్చింది. అయితే 5 లక్షల ఉద్యోగాలు వచ్చిన వారిలో ఒక్కరిని చూపిస్తే చాలంటూ స్థానికులు మంత్రి లోకేష్‌ను నిలదీశారు. వెంటనే స్పందించిన స్థానిక టీడీపీ నాయకులు లోకేష్‌ను ప్రశ్నించిన వారిని అడ్డుకుని వారించే యత్నాలు మొదలుపెట్టారు. దీంతో స్థానికుల ఆగ్రహం రెట్టింపయింది. మీ నాయకుడి ముందు మీరు ఎలాగూ మాట్లాడలేరు.. కనీసం మమ్మల్ని అయినా మాట్లాడనివ్వాలంటూ టీడీపీ నేతలపై కర్నూలు వాసులు మండిపడ్డారు. ప్రభుత్వ హామీలపై, తమ సమస్యలపై రాష్ట్ర మంత్రులను ప్రశ్నిస్తే అడ్డుకోవడమే స్థానిక టీడీపీ నేతల పని అంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

అదే సమయంలో కర్నూలులో ఓ చోట విద్యార్థులు లోకేష్ ను ఉద్యోగాలపై నిలదీశారు. మీరు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఇవ్వకపోవడంతో మనస్తాపం చెంది ఓ విద్యార్థి చనిపోయాడని, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ఓ విద్యార్థి కోరగా..అతనిపై చినబాబు రంకెలేశారు. రేయ్ నాతోనే ఆర్గ్యుమెంట్ చేస్తావా..నేను చెప్పేది వినరా...కంపెనీలన్నీ ఎగిరిపోయినయ్...పైసా ఖర్చుపెట్టుకోకపోతే నేనేం చేయాలా..అంటూ శివాలెత్తారు. ఉద్యోగాల పేరుతో మోసం చేసి ఓ విద్యార్థి మరణానికి కారణమవ్వడమే గాకుండా ఆ కుటుంబాన్ని అవమానించే రీతిలో మాట్లాడిన లోకేష్ పై విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఎన్నికల్లో ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం లేని వారికి నెలకు రూ.2వేలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి మోసం చేసిన బాబుకు నంద్యాల ఎన్నికల నుంచి పతనం ప్రారంభమవుతుందని హెచ్చరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com