Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ పార్లమెంట్ వద్ద వైయ‌స్ఆర్‌ సీపీ ఎంపీలు ధర్నా                               క్రిష్ణాపురం నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 320వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               ప్రజలకు ఎన్ని అబద్దాల చెప్పినా వింటారనే నాయకులకు తెలంగాణ ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారు : వైయ‌స్ జ‌గ‌న్‌                               లగడపాటి రాజకీయ విశ్లేషకుడు ఎప్పుడు అయ్యాడా? అని ఆశ్చర్యం వేసింది: వైయ‌స్ జ‌గ‌న్‌                               కాంగ్రెస్‌, టీడీపీ జిమ్మిక్కులను ప్రజలను తిప్పికొట్టారు: వైయ‌స్ జ‌గ‌న్‌                               చంద్రబాబు, కాంగ్రెస్ అనైతిక పొత్తుకు ప్రజలు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు: వైయ‌స్ జ‌గ‌న్                                భస్మాసురుడు చేయి పెట్టినా.. చంద్రబాబు కాలు పెట్టినా అంతా బుడిదే: వైయ‌స్ జ‌గ‌న్‌                               హిందూపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ గని వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               ప‌వ‌న్‌కు చిత్త‌శుద్ది ఉంటే చంద్ర‌బాబు అవినీతిపై నిల‌దీయాలి: ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్‌                 
    Show Latest News
నిజం చెప్పని నిజాయతీ పరుడు

Published on : 23-Feb-2018 | 16:00
 

– చెప్పేవన్నీ నీతులు.. ,చేసేవన్నీ అవినీతి పనులు
– స్వయంగా పంచాయితీలు చేస్తున్న చంద్రబాబు 
– బాబు అవినీతిపై నోరు మెదపని అనుకుల మీడియా

చెప్పేది శ్రీరంగ నీతులు.. దూరేది అవేవో అన్నట్టుంది చంద్రబాబు వ్యవహారం. కళ్లముందు ఆధారాలున్నా నేను పట్టిన కుందేలుకి మూడే కాళ్లు అనే పరమ పెద్ద మూ.. బాబు. మైకు దొరికితే చాలు... ఎప్పుడూ సొంత డబ్బాలే తప్ప. తానే మేధావినని ఒకటే సోత్కర్ష. పేపర్ల వెనుక చేరి అనుకుల మీడియాలో పని రాక్షసుడు, విజనరీ పర్సన్, కార్యదక్షుడు, ట్రబుల్‌ షూటర్, రాజకీయ చాణక్యుడు.. అని సందర్భం ఉన్నా లేకున్నా పనికిమాలిన కథనాలు వండి వడ్డించడమే పని. ప్రతిపక్షంలో ఉంటనే బాబు గొప్పలకు పట్టపగ్గాలుండేవి కావు. కాకపోతే ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. అయితే అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో చంద్రబాబు సంగతి సరేసరి. 
రాయించుకునేది వేరు.. జరిగేది వేరు..
అవినీతి అంతం నా పంతం.. నాయకులు అవినీతికి పాల్పడితే ఉపేక్షించనని చెబుతూనే ఉంటారు. టీడీపీ క్రమశిక్షణకు పెట్టింది పేరని పేజీలకు పేజీలు వార్తలు రాయించుకుంటారు. మాట జవదాటితే చంద్రబాబుకు నచ్చదని లీకులు వదులుతూ ఉంటారు. చంద్రబాబే లేకుంటే దేశం ఏమైపోయేదో అన్నంతగా కలరింగ్‌ ఇస్తూనే ఉంటారు. కానీ అందంతా ఒట్టి మాటలే. కానీ జరుగుతున్నది మాత్రం పూర్తి విరుద్ధం. అవినీతికి ఉపేక్షించడని చెప్పడమే..కానీ సుజనా వంటి వారు బ్యాంకులను ముంచేసినా కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించరు. క్రమశిక్షణకు పెట్టింది పేరంటారు.. ఏ ఒక్కరూ అధినేత మాట వినరు. అన్యాయాలను సహించం అంటూనే ఉంటాడు.. చింతమనేని అరాచకాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టే ధైర్యమే ఉండదు. దేశాధినేతలే బాబు సలహాలు తీసుకుంటారు.. నిత్య కృషీవలుడు అని రాయిస్తుంటారు. మోదీ అపాయింట్‌ కోసం ఏడాదిన్నర పాటు ఎదురుచూడక తప్పలేదు. నీతి నిజాయితీలకు నిలువుటద్దం.. నిప్పుని అని చెప్పుకుంటాడు.., ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయినా రాజీనామా చేసే ధైర్యం చేయరు. 
పంచాయతీలు చేయడంలో దిట్ట..
చంద్రబాబు తానొక ముఖ్యమంత్రిననే విషయం కూడా మరిచి సెటిల్మెంట్‌లు చేస్తారని బయట ప్రచారం సాగుతుంది. మొన్నటి వరకు అదొక ఆరోపణలుగానే ఉన్నా.. ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంతో అసలు బాగోతం బట్టబయలైంది. వైయస్‌ఆర్‌సీపీలో గెలిచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి వ్యవహారం వీడియోల రూపంలో బయటకొచ్చింది. బయటకు అభివృద్ధి పేరు చెబుతున్నా డబ్బులు, పదవులకు అమ్ముడుపోయినట్టు స్పష్టంగా వీడియాల్లో కనిపించింది. మొన్ననే కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ తానే స్వయంగా డబ్బులకు అమ్ముడుపోయినట్టు అంగీకరించి.. తప్పుచేశానని లెంపలేసుకున్నాడు. బుట్టా రేణుక వ్యవహారం కూడా అంతే.. వంద కోట్లకు డీల్‌ జరిగిందని పేపర్లలో వార్తలొచ్చాయి. ముఖ్యమంత్రితో ఆమె సంప్రదింపులు జరిపినట్టు ఫొటోలు బయటకొచ్చాయి. తాజాగా ఆదినారాయణరెడ్డి వ్యవహారం పెద్ద రచ్చగా మారింది. మంత్రి పదవి కోసం పార్టీ మారిన ఆదినారాయణరెడ్డికి అప్పటికే పార్టీలో ఉన్న టీడీపీ సీనియర్‌ నాయకుడు రామసుబ్బారెడ్డికి మధ్య 50–50 ఒప్పందం కుదిర్చాడు. ఈ విషయాన్ని ఆది స్వయంగా బయటపెట్టడం సంచలనంగా మారింది. పైగా ఈ అవినీతి రొచ్చులోకి ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లను లాగడం.. వారి సమక్షంలోనే ముఖ్యమంత్రి మా ఇద్దరి మధ్యా రాజీ చేశారని చెప్పడం చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. పైకి మంచోడిలా కలరింగ్‌ ఇచ్చే పాత సినిమాల్లో విలన్‌లా.. డబ్బుల కోసం బురిడీ కొట్టించే దొంగ బాబాతో చంద్రబాబు జనం పోలుస్తున్నారు. మీడియాను అడ్డం పెట్టుకుని చంద్రబాబు ప్రజల జీవితాలతో ఆటలాడుకోవడమే కాకుండా.. తానే స్వయంగా పంచాయితీ పెట్టి జనం సొమ్మును పంచడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చే. నైతిక విలువలు గురించి మాట్లాడే బాబుకు ఇవేవీ పట్టవు.. రాజ్యాంగం, ప్రజా సమస్యలు, అవినీతి గురించి ప్రశ్నించే పచ్చ మీడియాకు బాబు అవినీతి కనిపించదు. 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com