Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ పార్లమెంట్ వద్ద వైయ‌స్ఆర్‌ సీపీ ఎంపీలు ధర్నా                               క్రిష్ణాపురం నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 320వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               ప్రజలకు ఎన్ని అబద్దాల చెప్పినా వింటారనే నాయకులకు తెలంగాణ ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారు : వైయ‌స్ జ‌గ‌న్‌                               లగడపాటి రాజకీయ విశ్లేషకుడు ఎప్పుడు అయ్యాడా? అని ఆశ్చర్యం వేసింది: వైయ‌స్ జ‌గ‌న్‌                               కాంగ్రెస్‌, టీడీపీ జిమ్మిక్కులను ప్రజలను తిప్పికొట్టారు: వైయ‌స్ జ‌గ‌న్‌                               చంద్రబాబు, కాంగ్రెస్ అనైతిక పొత్తుకు ప్రజలు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు: వైయ‌స్ జ‌గ‌న్                                భస్మాసురుడు చేయి పెట్టినా.. చంద్రబాబు కాలు పెట్టినా అంతా బుడిదే: వైయ‌స్ జ‌గ‌న్‌                               హిందూపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ గని వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               ప‌వ‌న్‌కు చిత్త‌శుద్ది ఉంటే చంద్ర‌బాబు అవినీతిపై నిల‌దీయాలి: ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్‌                 
    Show Latest News
ప్రత్యేక హోదా కోసం రాజీనామాకు సిద్ధమే
ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌

Published on : 23-Feb-2018 | 12:28
 



ఒంగోలు: ప్రత్యేక హోదా సాధనకు ఎమ్మెల్యే పదవికి స్పీకర్‌ ఫార్మెట్లో రాజీనామా చేస్తామని సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ అన్నారు. అందరం కలిసి ప్రత్యేక హోదా కోసం ఉద్యమిద్దామని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రత్యేక హోదా కోసం ఎందాకైనా అనే అంశంపై సీనియర్‌పాత్రికేయులు కేఎస్‌ఆర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన చర్చా వేదికలో ఎమ్మెల్యే పాల్గొని తన అభిప్రాయాలు వెల్లడించారు.  ఎన్‌డీఏలో భాగస్వామి అయిన టీడీపీ ప్రత్యేక హోదా అంశాన్ని విస్మరించిందని ఆయన మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ఏపీకి అన్ని అనుకూలతలు ఉన్నాయన్నారు. విభజన తరువాత ఏపీ రూ.16 వేల లోటు బడ్జెట్‌తో ఏర్పడిందన్నారు. చట్టంలో కూడా ప్రత్యేక హోదా అంశం ఉందన్నారు. విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవన్నారు. చంద్రబాబు ఈ దేశంలోనే చాలా సీనియర్‌ నాయకులని చెప్పారు. అనుభవం ఉన్న చంద్రబాబు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని ప్రజలు టీడీపీని అధికారంలో కూర్చోబెట్టారన్నారు. అయితే చంద్రబాబు ప్రతి సందర్భంలో కూడా వ్యూహాలు మాట్లాడుతూ..విద్యార్థుల భవిష్యత్తును ఫణంగా పెట్టి ప్రత్యేక ప్యాకేజీకి మొగ్గు చూపారన్నారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ప్రత్యేక హోదా వైపు మొగ్గు చూపుతున్నారని, ఆయన ఎందుకు మాట మార్చారో సమాధానం చెప్పాలన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కోసం వైయస్‌ జగన్‌ మొదటి నుంచి పోరాటం చేస్తున్నారన్నారు. మేం ప్రత్యేక హోదా కోసం రాజీపడేది లేదన్నారు. ఎన్నికల్లో కూడా ఇదే అంశాన్ని రెఫరెండంగా తీసుకుంటామన్నారు. ఊపిరి ఉన్నంత వరకు పోరాటం చేస్తామని వైయస్‌జగన్‌ ప్రకటించారన్నారు. ప్రత్యేక హోదా ఐదు అక్షరాల పదం కాదని, ఐదు కోట్ల ప్రజల ఆకాంక్ష అన్నారు. హోదా ఉద్యమంలో అందరూ కలిసి రావాలని ఎమ్మెల్యే సురేష్‌ కోరారు.
 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com