Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             రాగోలు నుంచి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 318వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               హిందూపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ గని వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               ప‌వ‌న్‌కు చిత్త‌శుద్ది ఉంటే చంద్ర‌బాబు అవినీతిపై నిల‌దీయాలి: ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్‌                               డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు వైయ‌స్ జగన్ నివాళులు                               టీడీపీ హయాంలో దళిత సంక్షేమం టీడీపీ దొంగల సంక్షేమంగా మారింది: మేరుగ నాగార్జున                               సంతవురిటి నుంచి వైయ‌స్ జ‌గ‌న్‌ 313వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               రాజ్యాంగబద్ధంగా ప్రతిపక్ష హోదా దక్కినా ఆపదవి నిర్వహించనీయకుండా అడ్డుకోవడం వల్లే వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తున్నారు: ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు                               ఒక్కసారి వైయస్‌ జగన్‌కు అవకాశం ఇవ్వండి..30 ఏళ్ల సంక్షేమంతో రాష్ట్రం ముందుకెళ్తుంది: ఎంపీ విజయసాయిరెడ్డి                                అంతకాపల్లి నుంచి వైయ‌స్ జ‌గ‌న్‌ 312వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                 
    Show Latest News
దళిత తేజం కాదు.. దళిత నిస్తేజం
వైయ‌స్ఆర్‌ సీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు మేరుగ నాగార్జున

Published on : 20-Feb-2018 | 18:43
 


విజయవాడ : దళిత తేజం కార్యక్రమానికి దళిత నిస్తేజం అని పేరుపెట్టుకుంటే బాగుండేద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ అధ్య‌క్షుడు మేరుగ నాగార్జున ఎద్దేవా చేశారు.  వైయ‌స్ఆర్‌సీపీ  రాష్ట్ర కార్యాలయంలో మంగ‌ళ‌వారం ఎస్సీ అధ్యాయ‌న క‌మిటీ స‌మావేశం నిర్వ‌హించారు. స‌మావేశం అనంత‌రం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌, పార్టీ అధికార ప్రతినిథి సుధాకర్‌ బాబుతో కలిసి మేరుగ నాగార్జున విలేకరులతో మాట్లాడారు.  దళితుల సమస్యలపై అధ్యాయ‌న క‌మిటీ స‌మావేశంలో కూలంకషంగా చర్చించామని తెలిపారు. వైయ‌స్ జ‌గ‌న్ మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర పూర్తి కాగానే దళిత గర్జన నిర్వహిస్తామని తెలిపారు. దివంగత ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హయాంలో దళిత సంక్షేమానికి పెద్ద పీట వేశార‌ని గుర్తు చేశారు. చంద్రబాబు దళితులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. దళితులపై దాడులు జరుగుతున్నా, చంద్రబాబు చర్యలు మాత్రం శూన్యమన్నారు. చంద్రబాబుకు దళితులను ఓటు అడిగే అర్హత లేదని వ్యాఖ్యానించారు. దళిత తేజం కార్యక్రమం ఎవరి కోసం ప్రారంభించారని చంద్రబాబునుద్దేశించి ప్రశ్నించారు.   వైయ‌స్‌ జగన్‌ని సీఎం చేయడానికి ప్రతి దళిత వాడ వెళ్లి వైయ‌స్ జగన్ ప్రకటించిన నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళతామని తెలియజేశారు. దళితులకు సంబంధించిన ప్రతి అంశంపై తమ కమిటీ చర్చించిందని, తాము చర్చించిన అంశాలపై తమ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌కి నివేదిక ద్వారా అందజేస్తామని తెలియజేశారు.
 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com