Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల‌ ధర్నా                                వైయ‌స్‌ జగన్‌ 216వ రోజు పాదయాత్ర ప్రారంభం                               కాకినాడ న‌గ‌రంలో సాయంత్రం వైయ‌స్ జ‌గ‌న్ బ‌హిరంగ స‌భ‌                               అవిశ్వాసానికి అనుమతివ్వడం టీడీపీ-బీజేపీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు నిదర్శనం: మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి                               బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, టీడీపీ రాజగురువుతో ఎందుకు చర్చలు జరిపారు, వాటి వెనుక ఉన్న రహష్యాన్ని బయటపెట్టాలి: అంబ‌టి రాంబాబు                               క‌ర‌కుదురు నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 214వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               ఎన్నిక‌ల‌కు సిద్ద‌మా చంద్ర‌బాబు?: వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుడు పార్థ‌సార‌ధి                               మై డియ‌ర్ మార్తాండామ్ మూవీ టీజ‌ర్ విడుద‌ల చేసిన వైయ‌స్ జ‌గ‌న్‌                               వైయ‌స్‌ జగన్‌ను కలిసిన 104 సిబ్బంది                  
    Show Latest News
ఆంధ్రప్రదేశ్ ను ఆత్మహత్యలప్రదేశ్ గా మార్చాడు

Published on : 13-Oct-2017 | 15:42
 

  • విద్యార్థుల ఆత్మహత్యలు పెరగడానికి ప్రభుత్వమే కారణం
  • రాష్ట్రంలో కళాశాలలన్నీ కార్పొరేట్ శక్తుల్లోకి వెళ్లిపోయాయి
  • ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలే తప్ప అభివృద్ధి జరగడం లేదు
  • పాదయాత్రలో ప్రజాసమస్యలపై వైయస్ జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు
  • రైతులు, మహిళలు, విద్యార్థులందరికీ ఓ భరోసా ఇస్తారు
  • వైయస్సార్సీపీ నేత మల్లాది విష్ణు
విజయవాడః విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోవడానికి ప్రధాన కారణం ప్రభుత్వమేనని వైయస్సార్సీపీ నేత మల్లాది విష్ణు అన్నారు. ఇప్పటివరకు రైతుల ఆత్మహత్యలు చూశాం, చేనేత కార్మికుల ఆత్మహత్యలు చూశామని...ప్రస్తుత పాలనలో విద్యార్థులు,  నిరుద్యోగ యువకుల ఆత్మహత్యలు చూస్తున్నామని అన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుందని చెప్పి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ను ఆత్మహత్యల ఆంధ్రప్రదేశ్ గా మార్చారని మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో దాదాపుగా 100 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. ఈ ప్రభుత్వం ఏరోజు కూడ విద్యార్థుల ఆత్మహత్యలపై విచారణ గానీ, పెట్టిన కేసుల పై గానీ సమీక్షించడం గానీ చేయకపోవడం బాధాకరమన్నారు.  ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తోందని ఫైర్ అయ్యారు. ఆత్మహత్యల నివారణలో గానీ, విద్యార్థుల భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లడం లో గానీ సూచనలు చేసేందుకు నియమించిన నీరజారెడ్డి కమిటీ రిపోర్ట్ ఎంతవవరకు వచ్చిందని ముఖ్యమంత్రిగానీ, విద్యాశాఖ మంత్రి గానీ ఏనాడు సమీక్ష చేసిన పాపాన పోవడం లేదన్నారు. రాష్ట్రంలో కళాశాలలన్నీ కార్పొరేట్ శక్తుల్లోకి వెళ్లిపోయినాయని, వాటిని ముఖ్యమంత్రి పక్కనే బెట్టుకంటున్నారని అన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావులకు మనసు లేదా...?  అని నిప్పులు చెరిగారు. 

యువభేరిలో వైయస్ జగన్ హోదా గురించి మాట్లాడితే.... ఆరుగురు మంత్రులు, జిల్లాలో నలుగురు మంత్రులు తెరమీదికి వచ్చి
జగన్ గురించి మాట్లాడుతున్నారు. అదే విద్యార్థులు చనిపోయినా పట్టించుకోవడం లేదు. వీరికి రాజకీయ ప్రాధాన్యత తప్ప విద్యార్థుల ఆత్మహత్యలు పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  విద్యార్థులు చనిపోయారని తల్లిదండ్రులు దుఖంలో ఉంటే వారిని పలకరించడం గానీ, మాట్లాడడం కానీ చేయకపోవడం చూస్తే ఈ ప్రభుత్వానికి మానవీయ కోణం లేదని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. వైయస్ఆర్ హయాంలో  రైతులు, విద్యార్థులు, మహిళలు సహా ప్రతి ఒక్కరికీ ఓ భరోసా ఉండేదన్నారు. అందుకే,  ఆయన చనిపోయినప్పటికీ ఆ సమాజం ఆయన్ను మననం చేసుకుంటోందన్నారు.  వైయస్ జగన్ పాదయాత్ర ప్రారంభమయ్యాక విద్యార్థుల జీవితాలు ఏవిధంగా బాగుపడాలి, యువతకు సంబంధించి ఏ విధమైన కార్యచరణ రూపొందించాలి అన్న విషయాలతో పాటు  మహిళలు, రైతులు సహా అన్ని వర్గాలపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందన్నారు.  

పాదయాత్ర అంటేనే టీడీపీ నేతలు ఉలికిపడుతున్నారని మల్లాది విష్ణు అన్నారు. ప్రపంచ బ్యాంక్, వెనక్కివెళ్లిన సింగపూర్ కంపెనీలు టీడీపీ పాలన చూసి పారిపోతున్నారని మల్లాది ఎధ్దేవా చేశారు. వైయస్ జగన్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ టీడీపీ నేతలు బురజల్లుతున్నారని...  అసలు రాష్ట్రంలో అభివృద్ధి జరిగితే కదా అడ్డుకోవడానికి అని చురక అంటించారు. అన్నీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలే తప్ప అభివృద్ధన్నదే లేదన్నారు. ప్రతి విషయాన్ని గొప్పలు చెప్పుకోవడానికే ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. జలసిరి ద్వారే వర్షాలు పడుతున్నాయని మాట్లాడుతున్నారు. రాయలసీమ మునిగిపోయి ఐదు రోజులవుతున్నా ఒక్క మంత్రి కూడ  అక్కడకు పోయి ఏం జరిగిందో చూసిన పాపాన పోలేదన్నారు. టమాట, ఉల్లి, వేరుశనగ రైతులు తీవ్రంగా నష్టపోతే మంత్రులు పోయి ఓదార్చే ప్రయత్నం చేయకుండా జగన్ పై దాడి చేయడమేంటని మండిపడ్డారు. టీడీపీ నేతల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.  రాష్ట్రంలోని అన్ని వర్గాలకు ధైర్యం ఇవ్వాలంటే, పెద్దన్న పాత్ర పోషించాలంటే జగన్ మూలంగానే జరుగుతోందన్నారు.  

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com