Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             కేసీ కెనాల్, తెలుగుగంగకు నీరివ్వాలని డిమాండ్ చేస్తూ మైదుకూరులో వైయస్‌ఆర్‌ సీపీ ధర్నా                               పార్టీ సీనియర్లు, ముఖ్య నేతలతో వైయస్ జగన్ భేటీ.."వైయస్ఆర్ కుటుంబం"పై సమీక్ష                               వైయస్ఆర్ కుటుంబంలో 38లక్షల మంది చేరిక                               చంద్రబాబు అరాచకాలు, అంకెల గారడీకి యనమల అసిస్టెంట్ః కొరుముట్ల                                సదావర్తి భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలిః ఆర్కే                               చంద్రబాబు ధనదాహం కోసమే పోలవరం అంచనాలను పెంచారుః బొత్స సత్యనారాయణ                               బాబు నిర్లక్ష్యంతోనే ఏపీకి నీటి కొరతః ఎంవీఎస్ నాగిరెడ్డి                               చంద్రబాబు ఏ పని చేసినా అక్రమమేః జోరి రమేష్                                చంద్రబాబు భూ కుంభకోణాలపై సమగ్ర విచారణ జరగాలిః వైవీ సుబ్బారెడ్డి                 
    Show Latest News
హెరిటేజ్‌లో వేల రూపాయలకు అమ్ముకుంటున్నాడు

Published on : 16-May-2017 | 15:28
 

  • రైతులను చంద్రబాబు వీధిపాలు చేశాడు
  • బాబుది రైతు వ్యతిరేక ప్రభుత్వం
  • నీ సమ్మర్‌ హాలిడేస్‌కు పెట్టిన ఖర్చుల్లో ఒక్క శాతం రైతుకు పెట్టలేవా..?
  • బాబుపై వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ధ్వజం
అమరావతి: చంద్రబాబు సమ్మర్‌ హాలిడేస్‌కు పెట్టిన ఖర్చులో కనీసం ఒక్క శాతం రైతులకు పెట్టివుంటే వారి బతుకులు బాగుపడేవని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎండ వేడికన్నా.. రైతుల కడుపులు కాలుతున్న వేడి ఎక్కువైందన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద చెవిరెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానమైన రైతు సమస్యలను, ప్రజా సమస్యలను చర్చించడానికి ప్రభుత్వానికి సమయంలేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పడించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు కూలీలకు ఉపాధి దొరక్క ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. మిర్చి రైతులు పడుతున్న ఇబ్బందులు అంతా.. ఇంతా కాదన్నారు. ఇంత దారుణంగా రైతుల పరిస్థితి ఉంటే వారి సమస్యలపై చర్చించకుండా జీఎస్‌టీ బిల్లు వరకే సమావేశం అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. 

బాబుది రైతు వ్యతిరేక ప్రభుత్వం
రైతులు పండించిన పంటలకు మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేదు కానీ చంద్రబాబు హెరిటేజ్‌ ఫ్యాక్టరీలో ఆ ఉత్పత్తులను వేల రూపాయలకు అమ్ముతున్నారని చెవిరెడ్డి మండిపడ్డారు. హెరిటేజ్‌ ఫ్యాక్టరీలో ఒక టన్ను బత్తాయి రూ. 55 వేలు ఉందని, అదే మార్కెట్‌లో రూ. 4 వేలు కూడా ధర పలకడం లేదన్నారు. కందిపప్పు టన్ను రూ. 85 వేలు, మిర్చి 200 గ్రాములు రూ. 45 అమ్ముతున్నారని, రైతులుకు మాత్రం మార్కెట్‌లో క్వింటాకు రూ. 3 వేలు కూడా అందడం లేదన్నారు. అదే విధంగా ఆరెంజ్‌ కేజీ రూ. 129కి హెరిటేజ్‌లో అమ్ముతున్నారని బయట కేజీ రూ. 4 రూపాయలు పడుతుందన్నారు. రైతుల దగ్గర తక్కువ ధరలకు కొనుగోలు చేసి హెరిటేజ్‌ ఫ్యాక్టరీలో ఎక్కువ రేట్‌కు అమ్ముకుంటున్నారని దుయ్యబట్టారు. రైతులను వీధుల పాలు చేసి చంద్రబాబు సర్కార్‌ రైతు వ్యతిరేక ప్రభుత్వంగా నిలిచిందన్నారు. అసెంబ్లీలో రైతు సమస్యలపై చర్చించి వారికి న్యాయం చేయాల్సింది పోయి.. ప్రతిపక్షం చర్చకు పట్టుబడితే.. ప్రభుత్వం పారిపోయిందన్నారు. 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com