Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             విషజ్వరాలతో అల్లాడుతున్న గ్రామాల సందర్శన..మృతుల కుటుంబాలకు పరామర్శ                               గరగపర్రులో సామాజిక బహిష్కరణకు గురైన దళితులకు బాసటగా వైయస్ జగన్                               జూలై 1వ తేదీ తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో వైయస్ జగన్ పర్యటన                               ఈ నెల 30వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా గరగపర్రులో వైయస్ జగన్ పర్యటన                               30, 1 తేదీల్లో గోదావరి జిల్లాల్లో వైయస్ జగన్ పర్యటన                               యనమల రామకృష్ణుడు దిగజారుడు రాజకీయాలు చేయడంలో సీినయర్ మోస్ట్ః అంబటి                               ఏబీఎన్ వన్నీ ఆల్ బోగస్ న్యూస్ః అంబటి రాంబాబు                               గరగపర్రు బాధితులకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందిః ధర్మాన                               పశ్చిమగోదావరి జిల్లా గరగపర్రులో వైయస్సార్సీపీ బృందం పర్యటన                 
    Show Latest News
రైతుల ఆత్మహత్యలు బాబు పుణ్యమే

Published on : 08-Jan-2017 | 11:42
 

  • బాబు వచ్చాడు..మూడేళ్లుగా కరువే కరువు
  • పంటిండిన పంటలకు గిట్టుబాటు ధర లేదు
  • రుణాలు మాఫీ కావడం లేదు
  • రైతులు బ్యాంకుల గడప తొక్కలేని పరిస్థితి
  • చంద్రబాబు ఎప్పుడు పోతాడా అని ప్రతీ గ్రామం ఎదురుచూస్తోంది
  • లింగాపురంలో వైయస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన జననేత
కర్నూలు(లింగాపురం))పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక, రుణాలు మాఫీ గాక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే చంద్రబాబు వారిని ఆదుకోవాల్సిందిపోయి ఎగతాళిగా మాట్లాడుతున్నారని వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మండిపడ్డారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. బండి ఆత్మకూరు మండలం లింగాపురంలో మహానేత దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. వైయస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మండిపడ్డారు. వైయస్ జగన్ మాటల్లోనే....

ఇవాళ రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామానికి వచ్చాం. మనమంతా రైతులం. వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న గ్రామాల్లో నివసిస్తున్న వాళ్లం. రాష్ట్రంలో జనాభా ప్రకారం చూస్తే దాదాపుగా 65 శాతం జనాభా వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంది. రైతు బాగుంటేనే గ్రామాలు బాగుంటాయి. రాష్ట్రం బాగుంటుంది.  రైతు బాగుంటే రైతు కూలీలకు పనులు దొరుకుతాయి. మొత్తం గ్రామీణవ్యవస్థ పరిగెత్తే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే రైతులు బాగున్నప్పుడే. చంద్రబాబు అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయిపోయింది. ఈ మూడేళ్లలో మనకు ఏం మేలు జరిగిందని చంద్రబాబును ప్రశ్నించమని అడుగుతున్నా. చంద్రబాబు వల్ల ఏమీ జరక్కపోగా ఆయన ప్రమాణస్వీకారం చేశారక వరుసగా మూడేళ్లు కరువే కరువు. ఎన్నికల ముందు ఏ టీవీ ఆన్ చేసినా, ఎక్కడ గోడల మీద రాతలు చూసినా,  బాబు మైక్ పట్టుకున్నప్పుడు ఆయన మాట్లాడిన మాటలు చూస్తే...బ్యాంకుల్లో బంగారం ఇంటికి రావాలన్నా, రైతు రుణాలన్నీ పూర్తిగా బేషరతుగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్న మాటలు. డ్వాక్రా సంఘాలను నేనే కనిపెట్టా. డ్వాక్రా అక్కచెల్లెమ్మలను పురోగతిలో నడిపించా. మీ అప్పులు మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు.  రైతులను వదిలిపెట్టలేదు. ఆడవాళ్లను చూడకుండా డ్వాక్రా అక్కచెల్లెమ్మలను వదల్లేదు. చివరకు చదువుకుంటున్న పిల్లలను సైతం వదలిపెట్టలేదు. జాబు రావాలంటే బాబు రావాలన్నాడు... బాబేమో ముఖ్యమంత్రి అయ్యాడు. రైతులు, డ్వాక్రా అక్కచెల్లెమ్మలను, చదువుకున్న పిల్లను మోసం చేశారు. ఇటీవల ఓ యువభేరి మీటింగ్ లో ఓ పిల్లాడన్న అన్న మాటలు ఏంటో తెలుసా..? అన్నా బాబు ముఖ్యమంత్రి అయి 32 నెలలయింది. నాకు రూ. 64 వేలు బాకీ ఉన్నాడుని చెప్పాడు.  ప్రతీ ఇంటికి ఉద్యోగం, ఉద్యోగం లేని వారికి నెలకు రూ. 2వేల నిరుద్యోగ భృతి అన్నాడు. ఎవరికి చెప్పుకోవాలన్నా అని అడిగాడు. పిల్లాడు మాట్లాడిన మాటలకైనా బాబుకు కాస్తో కూస్తో జ్ఞానోదయం అవుతుందేమో, బుద్ధి సిగ్గు ఏమాత్రం ఉన్నా చెప్పిన మాటలు నెరవేరుస్తాడేమోనని ఆశగా ఎదురుచూశామని వైయస్ జగన్ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. 

ఇవాళ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే... రబీ పంటలు వేసిన రైతులు బ్యాంకుల గడప తొక్కలేకుండా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా  రబీ పంటకు క్రాప్ లోన్లు రూ.. 24 వేల కోట్లు,  టర్మ్ లోన్స్ కింద మరో రూ. 9 వేల కోట్లు రుణాలివ్వాలని టార్గెట్ పెట్టుకుంటే... చంద్రబాబు పుణ్యమా అని  బ్యాంకులు రూ. 4 వేల 900 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు.  ముఖ్యమంత్రి అనే వ్యక్తి బ్యాంకులను గట్టిగా నిలదీయాల్సిందిపోయి...రైతుల రుణమాఫీకి సంబంధించి బ్యాంకులు ఇచ్చింది తనకు ఆనందంగా ఉంది అంటాడు. నిజంగా ఇలాంటి వ్యక్తి పరిపాలన చేయడానికి అర్హుడా...?.క్యాబినెట్ మీటింగ్ లో రైతుల గురించే ఆలోచనే చేయలేదు.  రైతులంతా ఎంత దారుణంగా ఉన్నారంటే. ఉల్లి పంట కేజీ రూ. 2 కూడా అమ్ముకోలేక పొలంలోనే వదిలేసిన దుస్థితి. ఉల్లి, టమాట, మిర్చి, ధాన్యం పరిస్థితి అంతే. కర్నూలు సోనా అన్నది దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ధాన్యం. ఇవాళ ఆ ధాన్యం బస్తా రూ.1250, 1300కు కూడ కొనే నాథుడు లేడు. ఖర్చులు పెరుగుతున్నాయి.  రైతులు పండించిన పంటకు గిట్టుబాటు దర దొరకడం లేదు. గిట్టుబాటు ధర కోసం ధర్నా చేస్తున్న రైతులపై పోలీసు కేసులు పెట్టిస్తున్నాడు.  రైతులు అవస్థలు పడి చంద్రబాబు పుణ్యాన ఆత్మహత్యలు చేసుకుంటుంటే వారిని ఆదుకోకుండా వెటకారం చేస్తున్నాడు. రాష్ట్రం జీడీపీ గ్రోత్ రేట్ లో దేశంకన్నా ఎక్కువగా పరిగెత్తుతోందట. రైతులు అవస్థలు పడుతుంటే, వ్యావసాయం చేయలేక అగచాట్లు పడుతుంటే గ్రోత్ రేటు బాగుందని స్పీచ్ లిస్తాడు. ఇటువంటి ముఖ్యమంత్రి ఎంత త్వరగా పోతారని ప్రతీ గ్రామం ఎదురుచూస్తోంది. ఇలాంటి పాలనను సాగనంపేందుకు మనమంతా చేయి చేయి కలపాలి. అడుగులో అడుగు వేయాలి. అబద్ధాలు, మోసాలాడే ఇలాంటి వ్యక్తిని బంగాళాఖాతంలో కలపాలి. దేవుడు మొట్టికాయలు వేస్తాడు. అంతవరకు మీ అందరి సహాయసహకారాలు కోరుతున్నాం. రాత్రికి త్వరగా వచ్చి ఇక్కడే పడుకుంటాం. పొద్దున్నే మీ అందర్ని పలకరించి యాత్ర ఇక్కడినుంచే చేపడుతానని వైయస్ జగన్ అన్నారు.  ఈసందర్భంగా 2019 సీఎం జగనన్న, వైయస్సార్సీపీకి ఓటేసి దుమ్ముదులుపుదాం. మా గ్రామ ప్రజలమంతా మీతోనే ఉంటాం అంటూ గ్రామస్తులు నినదించారు. సంబంధిత వార్తలు

YS Rajashekar Reddy YS Rajashekar Reddy Central Assistance to AP
Prajalachentha Epaper Youtube
Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com