Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల‌ ధర్నా                                వైయ‌స్‌ జగన్‌ 216వ రోజు పాదయాత్ర ప్రారంభం                               కాకినాడ న‌గ‌రంలో సాయంత్రం వైయ‌స్ జ‌గ‌న్ బ‌హిరంగ స‌భ‌                               అవిశ్వాసానికి అనుమతివ్వడం టీడీపీ-బీజేపీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు నిదర్శనం: మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి                               బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, టీడీపీ రాజగురువుతో ఎందుకు చర్చలు జరిపారు, వాటి వెనుక ఉన్న రహష్యాన్ని బయటపెట్టాలి: అంబ‌టి రాంబాబు                               క‌ర‌కుదురు నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 214వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               ఎన్నిక‌ల‌కు సిద్ద‌మా చంద్ర‌బాబు?: వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుడు పార్థ‌సార‌ధి                               మై డియ‌ర్ మార్తాండామ్ మూవీ టీజ‌ర్ విడుద‌ల చేసిన వైయ‌స్ జ‌గ‌న్‌                               వైయ‌స్‌ జగన్‌ను కలిసిన 104 సిబ్బంది                  
    Show Latest News
అన్ని వ్యవస్థలను దిగజార్చారు

Published on : 22-Sep-2017 | 17:11
 

  • రాజ్యాంగేతర శక్తులతో గాడి తప్పిన పాలన
  • ఘోర వైఫల్యం చెందిన బాబు
  • తన వైఫల్యాలను అధికారులపై నెట్టే యత్నం
  • నాలుగేళ్ల పాలనలో ఇంకా బాధితులుగానే ప్రజలు
  • ఇంకా ఎన్నాళ్లు బాబు నీ మోసాలు
  • వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు
హైదరాబాద్ః చంద్రబాబు తన వైఫల్యాల పుట్టని అధికారుల మీద వేసి తప్పించుకోవాలని చూస్తున్నారని వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలను చట్టానికి అతీతులుగా చూడాలని, ఎలాంటి అక్రమాలు, అవినీతికి పాల్పడినా చూసీ చూడనట్టు వ్యవహరించాలని బాబు మొదటి కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఆదేశించినప్పుడే ...పరిపాలన గాడి తప్పిందన్నారు. ఇది మీడియాలో కూడ రికార్డ్ అయిందని అన్నారు.  అధికారం చేతికొచ్చిందన్న ఉత్సాహంలో చంద్రబాబు చట్టస్ఫూర్తికి విరుద్ధంగా, నియమనిబంధనల ప్రకారం నడుచుకోవడానికి వీల్లేకుండా ప్రభుత్వ యంత్రాంగానికి అడ్డుకట్ట వేశారన్నారు.  చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలు మళ్లీ నాలుగో సంవత్సరపు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో స్పష్టంగా కనిపించాయన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలను నిర్దేశించి కలెక్టర్లకు దిశానిర్దేశం చేయడం సంప్రదాయమని ధర్మాన అన్నారు. కానీ, ఈ ప్రభుత్వం ఆ పని ఏనాడు చేయలేదన్నారు. అధికారులను ఏనాడు స్వేచ్ఛగా పనిచేయించింది లేదన్నారు.  తాను చేసిన తప్పులను ఎవరికి మీదకు నెట్టాలన్న తపనే బాబులో కనిపిస్తోందన్నారు. హైదరాబాద్ లో పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ధర్మాన మాట్లాడారు. 

రాష్ట్రంలో ఏ కలెక్టర్ కూడ  తనో నిర్ణయం తీసుకొని అమలు చేసే పరిస్థితి లేదన్నారు. జన్మభూమి అనే కిరికిరి కమిటీలు పెట్టి బాబు  రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగిస్తున్నారని ధర్మాన ధ్వజమెత్తారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలను అమలు చేసేది యంత్రాంగమే. కానీ రాష్ట్రంలో అది జరగడం లేదు. ఏ పని కావాలన్నా టీడీపీ నాయకుల కనుసన్నల్లో జరుగుతోందన్నారు. ఓ వృద్ధుడి పెన్షన్ కు సంబంధించి అన్ని సర్టిఫికెట్లతో కలెక్టర్ అంగీకరించినా అది వారికి ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. జన్మభూమి కమిటీలని పెట్టి బాబు వ్యవస్థను దిగజార్చారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వ వైఫల్యాలను అధికారుల వైఫల్యాలుగా చిత్రీకరిస్తూ బాబు నటిస్తున్నారని ధర్మాన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో ప్రజలు ఇంకా బాధితులుగానే ఉన్నారని అన్నారు. సంక్షేమ కార్యక్రమాలకు పార్టీ, జెండా, వర్గం అంటూ బాబు ఎప్పుడైతే నిబంధనలు పెట్టారో అప్పుడే పెయిలయ్యారన్నారు. దానికి కలెక్టర్లను బాధ్యులని చేయాలని చూస్తున్నారని ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. 

ఎన్నికల మేనిఫెస్టోలో  సంవత్సారనికి 5లక్షల ఇళ్లు కడతామన్నారు. నాలుగో సంవత్సరం ఇళ్ల నిర్మాణానికి షెడ్యూల్ ఇచ్చారు. అక్టోబర్ 2న లక్ష 25వేల ఇళ్లు గ్రామాల్లో గృహప్రవేశం చేద్దామన్నారు.ఇప్పటివరకు బాబు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం  20 లక్షల ఇళ్లు పూర్తి కావాలని, కానీ జిల్లాల్లో ఎక్కడ కూడ ఒక్క ఇళ్లు పూర్తి చేసిన పాపాన పోలేదన్నారు. ఇప్పుడు మళ్లీ లక్షా 25వేలు అంటూ మోసగిస్తున్నారని ధర్మాన ధ్వజమెత్తారు. కేబినెట్ మీటింగ్ పెట్టిన ప్రతిసారి లక్ష, రెండు, మూడు లక్షల ఇళ్లు అంటూ మంత్రులతో చెప్పించడం తప్ప బాబు చేసింది శూన్యమని అన్నారు. సంక్రాంతికి మరో రెండు లక్షలు,  జూన్ లో 5 లక్షలు, 2019లో మరో 5లక్షలంటూ ఎన్నిసార్లు మోసగిస్తారని ప్రభుత్వంపై మండిపడ్డారు  ఎక్కడైనా గృహనిర్మాణం కోసం ఎకరం భూమిని కొన్నారా..? ఓ రూపాయి నిధులు పెట్టారా..? ఇంత మోసగిస్తారా..? ఇలాంటి వార్తల వల్ల ప్రజలకు ఒరిగిందేమిటి. కలెక్టర్ల సదస్సులో మీ ఊకదంపుడు ప్రసంగం వల్ల ప్రయోజనం ఏంటని ప్రభుత్వాన్ని కడిగిపారేశారు.

తప్పుడు పనులు చేయలేక, ప్రభుత్వం పెట్టే బాధలు భరించలేక  అనేకమంది  అధికారులు కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లిపోయారని ధర్మాన అన్నారు. నిజాయితీ పరుడైన పోలీస్ ఆఫీసర్ ను టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు బెదిరించినప్పుడు రాష్ట్రమంతా నివ్వెరపోయిందన్నారు. సీఎం పేషీనుంచి రాజ్యాంగేత శక్తులతో ఏవిధంగా పాలన సాగుతుందో మాజీ సీఎస్ అంతా బయటపెట్టారని...సీంఇప్పటికీ కూడ బాబులో మార్పురాకపోతే ప్రజలు దురదృష్టవంతులని ధర్మాన అన్నారు.  రాజ్యాంగానికి, చట్టానికి సంబంధించి నిజాయితీపరుడిలా వ్యవహరించాల్సిన ముఖ్యమంత్రి..తన తప్పులను ఎత్తిచూపిన వారిపై కోప్పడడం దారుణమన్నారు. బాబు అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్యం  కుటుంపడిపోయిందన్నారు. జ్వరం వస్తే బీదల వద్ద నుంచి 50రూపాయలు వసూలు చేసిన పరిస్థితి బాబు పాలనలో చూస్తున్నామని విరుచుకుపడ్డారు.  

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com