Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             చంద్రబాబు అరాచకాలు, అంకెల గారడీకి యనమల అసిస్టెంట్ః కొరుముట్ల                                సదావర్తి భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలిః ఆర్కే                               చంద్రబాబు ధనదాహం కోసమే పోలవరం అంచనాలను పెంచారుః బొత్స సత్యనారాయణ                               బాబు నిర్లక్ష్యంతోనే ఏపీకి నీటి కొరతః ఎంవీఎస్ నాగిరెడ్డి                               చంద్రబాబు ఏ పని చేసినా అక్రమమేః జోరి రమేష్                                చంద్రబాబు భూ కుంభకోణాలపై సమగ్ర విచారణ జరగాలిః వైవీ సుబ్బారెడ్డి                               దేవుడి పేరుతో టీడీపీ వేల కోట్లు దోచేస్తోందిః వైవీ సుబ్బారెడ్డి                               చంద్రబాబు సదావర్తి భూములను ఎంత కారుచౌకకు కొట్టేశారో వేలంపాటను బట్టి అర్థమవుతోందిః వాసిరెడ్డి                               చంద్రబాబు ఎంత అవినీతిపరుడో సదావర్తి భూముల వేలంతో బట్టబయలైందిః కాకాని                 
    Show Latest News
దళితులంతా బాబుకు తగిన బుద్ధి చెబుతారు

Published on : 14-Jul-2017 | 18:39
 

కర్నూలుః నంద్యాలలో అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వం మీద వ్యతిరేక భావనతో ఉన్నారని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. దళితులంతా  బాబు ప్రజావ్యతిరేక పాలనపై అసంతృప్తితో ఉన్నారన్నారు.  దళితులను ఆర్థికంగా, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేవిధంగా చంద్రబాబు సాగిస్తున్న పాలనను గుర్తుచేసుకుంటున్నారని చెప్పారు. ఎన్నికల సమయంలో మీ పెద్దన్నగా ఉంటానని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక దళితులను అన్ని విధాలుగా మోసం చేశాడన్నారు. ఎస్సీగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అంటూ తమను అవమానపర్చారని ఆవేదన చెందారు. 

నంద్యాలలో ఉపఎన్నిక ఉందనే అకస్మాత్తుగా బాబుకు దళితులపై  ప్రేమ చూపేలా మభ్యపెట్టే హామీలిస్తున్నారన్నారు. దళితులంతా ముందు నుంచీ వైయస్సార్సీపీ వైపే ఉన్నారని స్పష్టం చేశారు. దళితులకు వైయస్ఆర్  చేసినవన్నీ వారి హృదయాల్లో చెరగని ముద్ర వేశాయన్నారు. వైయస్  జగన్ తీసుకొచ్చే నవరత్నాల్లాంటి పథకాల కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో గుడిసెలు లేని రాష్ట్రం చేస్తానన్న పెద్దమనిషి ఎక్కడ కూడ ఇళ్లు ఇఛ్చిన పాపాన పోలేదన్నారు.  జన్మభూమి కమిటీలను పెట్టి బాబు దళితులను వేధిస్తున్నాడన్నారు. దళిత వ్యతిరేకి అయిన చంద్రబాబుకు  రాబోయే రోజుల్లో నంద్యాలలోని దళితులంతా ఏకమై తగిన బుద్ధి చెబుతారన్నారు. 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com