Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ పార్లమెంట్ వద్ద వైయ‌స్ఆర్‌ సీపీ ఎంపీలు ధర్నా                               క్రిష్ణాపురం నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 320వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               ప్రజలకు ఎన్ని అబద్దాల చెప్పినా వింటారనే నాయకులకు తెలంగాణ ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారు : వైయ‌స్ జ‌గ‌న్‌                               లగడపాటి రాజకీయ విశ్లేషకుడు ఎప్పుడు అయ్యాడా? అని ఆశ్చర్యం వేసింది: వైయ‌స్ జ‌గ‌న్‌                               కాంగ్రెస్‌, టీడీపీ జిమ్మిక్కులను ప్రజలను తిప్పికొట్టారు: వైయ‌స్ జ‌గ‌న్‌                               చంద్రబాబు, కాంగ్రెస్ అనైతిక పొత్తుకు ప్రజలు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు: వైయ‌స్ జ‌గ‌న్                                భస్మాసురుడు చేయి పెట్టినా.. చంద్రబాబు కాలు పెట్టినా అంతా బుడిదే: వైయ‌స్ జ‌గ‌న్‌                               హిందూపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ గని వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               ప‌వ‌న్‌కు చిత్త‌శుద్ది ఉంటే చంద్ర‌బాబు అవినీతిపై నిల‌దీయాలి: ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్‌                 
    Show Latest News
అలుపెర‌గ‌ని పాద‌యాత్ర
- నిర్వీరామంగా కొన‌సాగుతున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌

Published on : 13-Jan-2018 | 11:26
 - అనారోగ్యాన్ని లెక్క చేయ‌ని వైయ‌స్ జ‌గ‌న్‌
- సంక‌ల్ప బలంతో ముందుకు సాగుతున్న జ‌న‌నేత‌
చిత్తూరు:  ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు, ప్ర‌జ‌ల‌కు భ‌రోసా క‌ల్పించేందుకు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నిర్వీరామంగా సాగుతోంది. గ‌తేడాది న‌వంబ‌ర్ 6న వైయ‌స్ఆర్ జిల్లా ఇడుపుల‌పాయ‌లో ప్రారంభ‌మైన జ‌న‌నేత పాద‌యాత్ర ఇవాళ 61వ రోజుకు చేరింది. ప్ర‌స్తుతం చిత్తూరు జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర కొనసాగుతోంది. అయితే వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి విపరీతమైన జలుబు, డస్ట్‌ అలర్జీతో ఇబ్బంది పడుతున్నారు. దీనికితోడు గొంతు నొప్పి, కళ్ల నుంచి నీరు కారడం వంటివి ఆయనను మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. రోజూ ఉదయం నుంచీ సాయంత్రం వరకూ పల్లెపల్లెనా పాదయాత్ర చేసే క్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు, అభిమానుల ఆయన వెంట అడుగులో అడుగేసి నడుస్తున్నారు. దట్టంగా లేస్తున్న ధూళి రేణువులు జగన్‌ను చుట్టేసి డస్ట్‌ అలర్జీకి కారణమవుతున్నాయి.అయినప్పటికీ పాదయాత్రలో ఎదురొచ్చే అభిమానులు, ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడుతూ  విరామం లేకుండా నగక సాగిస్తూనే ఉన్నారు. రోజూ రాత్రి పూట పనులన్నీ పూర్తి చేసుకుని, తనను కలిసేందుకు వచ్చిన వారందరితో వైయ‌స్ జగన్‌ మాట్లాడుతున్నారు.

విశ్రాంతి క‌రువు
ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో ఉన్న వైయ‌స్ జ‌గ‌న్‌కు విశ్రాంతి క‌రువైంది. ఆలస్యంగా నిద్రపోవడం, మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి సరిగ్గా 8.30 గంటలకు మళ్లీ పాదయాత్ర ప్రారంభిస్తుండడంతో నిద్ర తక్కువవుతోంది. మధ్యాహ్నం భోజన విరామ సమయంలోనూ ఎవరో ఒకరు కలిసేందుకు వస్తున్నారు. దీంతో శరీరానికి పూర్తిగా విశ్రాంతి కరువైంది. అప్పుడప్పుడూ భోజన విరామానికి సైతం ఆగకుండా నడక సాగిస్తున్నారు. మూడు రోజులుగా జలుబు, గొంతునొప్పి ఎక్కువయ్యాయి. రోడ్ల వెంట లేస్తున్న దుమ్మూ ధూళి నోటిలోకి పోతుండడంతో గొంతునొప్పి వస్తోందని వైద్యులు చెబుతున్నారు. జలుబు, దగ్గు కారణంగా జగన్‌ నలతగా ఉంటున్నారు. గురు, శుక్రవారాల్లో విపరీతమైన ఎండ కారణంగా గొంతు త్వరగా తడారిపోయి నీరసంగా కనిపించారు. శుక్రవారం పాదయాత్ర మొదలైంది మొదలు గంటకోసారి ఆయన జలుబు, తుమ్ములతో సతమతమయ్యారు. ఇడుపులపాయలో పాదయాత్ర మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ వైయ‌స్‌ జగన్‌ అరున్నర కిలోల బరువు తగ్గినట్లు వైద్యులు చెబుతున్నారు. కనీసం రెండు రోజులైనా విశ్రాంతి అవసరమని వైద్యులు, పార్టీ నేతలు కోరుతున్నా జగన్‌ వినడం లేదు. షెడ్యూల్‌ ప్రకారం పాదయాత్ర కొనసాగిస్తున్నారు.  

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com