Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             పారాది నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 290వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               గుంటూరు జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు మల్లాది శివన్నారాయణ, చిలకలూరిపేట టీడీపీ మాజీ అధ్యక్షుడు శివయ్య, జి.వెంకట్రావు, కె.కాంతారావులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               దేశంలో, రాష్ట్రంలో ఇలాంటి అబద్ధపు ముఖ్యమంత్రి ఎక్కడా లేరని, గల్ఫ్‌ దేశాల్లో ఇలాంటి అబద్ధాల ముఖ్యమంత్రిని ఎప్పుడో ఉరి తీసేవారు: ఎమ్మెల్యే ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి                               చంద్రబాబు..నీకిదే ముఖ్యమంత్రిగా చివరి అవకాశం...నిన్ను దగ్గరగా గమనించిన మనిషిగా చెబుతున్నా: త‌మ్మినేని సీతారాం                               శ్రీకాకుళం ఉద్యమాల పురిటిగడ్డ...ఎంతమందిపై కేసులు పెడతావ్. : త‌మ్మినేని సీతారాం                               నీళ్లో రామచంద్ర అని అడుగుతున్నవారికి వారి దాహార్తి తీరుస్తారే కాని వారిని సైతం బుల్డోజర్‌ తో తొక్కిస్తా అని అనగల ధైర్యం చంద్రబాబుకే ఉంది: భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి                               వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన మ‌ధువాడ అన్న‌దాత‌లు                               టీడీపీ తోక పత్రికలో 108 దుస్థితిపై వచ్చిన కథనాలను ఏమంటారు.. అది నిజం కాకపోతే ఆ వార్తలను ఎందుకు ఖండించలేదు: సుధాక‌ర్‌బాబు                               - విజ‌య‌న‌గ‌రం జిల్లా చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని ఆనంద‌పురం క్రాస్ వ‌ద్ద 3100 కిలోమీట‌ర్ల వ‌ద్ద వేప మొక్క‌ను నాటిన వైయ‌స్ జ‌గ‌న్‌                 
    Show Latest News
ఇంకెత కాలం దాక్కుంటావ్ బాబూ ?
ఆ ఎంపిలను గాడిదలపై ఊరేగించాలి

Published on : 12-Feb-2018 | 16:58
 


నాలుగేళ్లు  సోమరిపోతుల్లా నిద్రపోయారు
ఏం సాధించారని సంబరాలు చేసుకుంటారు
తెరవెనక నటనకు చంద్రబాబుకు ఆస్కార్ ఇవ్వాలి
వైయస్ ఆర్ సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ ఫైర్ 

విజయవాడ:  కేంద్ర బడ్జెట్‌ ప్రతిపాదనల్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై అతలాకుతలం అవుతున్నా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం దాక్కుని ఉండటం ఎంత మాత్రం తగదని ఆయన వెంటనే బయటకు వచ్చి మాట్లాడాలని వైయస్‌ ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి  జోగి రమేష్‌ డిమాండ్‌ చేశారు. పార్లమెంటులో ఏం సాధించారని ఎంపిలు ఊరేగుతూ సంబరాలు చేసుకుంటారని మండిపడ్డారు. ఎంపిలను గాడిదలపై ఊరేగించడమే సబబమన్నారు. చక్కని నటనతో ప్రజలను ముభ్యపెట్టాలని చూస్తున్న టిడిపి ఎంపిలకు నంది అవార్డులు, తెర వెనుకు ఉండి నటిస్తున్న చంద్రబాబుకు ఆస్కార్‌ అవార్డు ఇస్తే బాగుంటుందని ఎద్దెవా చేశారు. సోమవారం  పార్టీ కార్యాలయంలో నిర్వహించిన  విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 

కేంద్ర బడ్జెట్‌ లో తీవ్రమైన అన్యాయం జరిగితే  వెంటనే స్పందించాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి 12 రోజులుగా ప్రజల ముందుకు ఎందుకు రావడం లేదని, కేవలం లీకులతో ఎందుకు కాలం గడుపుతున్నారన్న సందేహం 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలందరిలోనూ ఉందని జోగి రమేష్‌ అన్నారు. పార్లమెంటులో  ప్రధాన మంత్రి మోడీ, ఆర్దిక మంత్రి జైట్లీ , రాష్ట్ర ప్రజల ఆందోళనలను, ఆకాంక్షలను ఏమాత్రం పట్టించుకోకుండా మాట్లాడితే, మన రాష్ట్రానికి చెందిన టిడిపి ఎంపిలు మాత్రం ఊరేగుతూ, ప్రదర్శనలతో టపాకాయలు కాల్చుకోవడంపై తీవ్రంగా మండిపడ్డారు. అసలు వీరికి సిగ్గు ఉందా అని సూటిగా ప్రశ్నించారు. 
పార్లమెంటులో ఒకలాగా, పార్లమెంటు బయట మరోలా, రకరకాల వేషాలు వేస్తున్న ఈ ఎంపిలకు ఈసంవత్సరపు నంది అవార్డులను ఇవ్వాలన్నారు. విభజన సందర్భంగా రాష్ట్రానికి ఇచ్చిన హక్కులను సా«ధించడంలో పూర్తిగా విఫలమై అసమర్ధులుగా ముద్రపడిన ఎంపిలు, ఒకసారి అవకాశం దొరికింది కదా అని మాట్లాడేసి, ఏదో సాధించేసినట్లుగా సంబరాలు చేసుకోవడంలో అర్థం లేదని జోగి రమేష్‌ ఆరోపించారు.  

రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రత్యేక హోదా సాధన కోసం వీరోచితంగా పోరాడుతున్నది వైయస్‌ ఆర్‌ సీపీ అధ్యక్షులు, వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, వైయస్‌ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీనే అన్న విషయం ప్రజలందరికీ తెలుసునన్నారు. 
టిడిపి మోసాలు డ్రామాలను ఎవరూ నమ్మరని, బాబు–మోడీ జోడీ రాష్ట్ర ప్రజలందరిని మోసం చేసి ,గుండు కొట్టించారని ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని ఆరోపించారు. బిజెపి అంటే ఎందుకు భయపడుతున్నారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు.  నాలుగేళ్ల పాటు సోమరిపోతుల్లా నిద్రపోయిన ఎంపిలు, రాష్ట్రానికి చేసింది శూన్యమని, వారందరినీ నియోజకవర్గాల్లో గాడిదలపై ఊరేగించి సన్మానం చేయాలని పిలుపునిచ్చారు. ఒకవైపు మోడీ మంత్రివర్గంలో కొనసాగుతూ మరోవైపు అన్యాయం జరుగుతోందంటూ ప్రజలను మభ్యపెట్టడం వంచన కాకమరేమిటని రమేష్‌ ప్రశ్నించారు. 
 చంద్రబాబు ప్రజల ముందుకు రావడానికి ఎందుకు జంకుతున్నారని, ఆయన ఎప్పుడు వస్తారా అని ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్నారు. ఇకనైనా చంద్రబాబు నాయుడు గారు మీడియా ముందుకు, ప్రజల ముందుకు వచ్చి తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. 


 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com