Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ పార్లమెంట్ వద్ద వైయ‌స్ఆర్‌ సీపీ ఎంపీలు ధర్నా                               క్రిష్ణాపురం నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 320వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               ప్రజలకు ఎన్ని అబద్దాల చెప్పినా వింటారనే నాయకులకు తెలంగాణ ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారు : వైయ‌స్ జ‌గ‌న్‌                               లగడపాటి రాజకీయ విశ్లేషకుడు ఎప్పుడు అయ్యాడా? అని ఆశ్చర్యం వేసింది: వైయ‌స్ జ‌గ‌న్‌                               కాంగ్రెస్‌, టీడీపీ జిమ్మిక్కులను ప్రజలను తిప్పికొట్టారు: వైయ‌స్ జ‌గ‌న్‌                               చంద్రబాబు, కాంగ్రెస్ అనైతిక పొత్తుకు ప్రజలు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు: వైయ‌స్ జ‌గ‌న్                                భస్మాసురుడు చేయి పెట్టినా.. చంద్రబాబు కాలు పెట్టినా అంతా బుడిదే: వైయ‌స్ జ‌గ‌న్‌                               హిందూపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ గని వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               ప‌వ‌న్‌కు చిత్త‌శుద్ది ఉంటే చంద్ర‌బాబు అవినీతిపై నిల‌దీయాలి: ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్‌                 
    Show Latest News
నాన్న‌బాట‌లో ప్ర‌జా సంక‌ల్ప యాత్ర

Published on : 11-Mar-2018 | 19:50
 - నాడు ప్ర‌జా ప్ర‌స్థానం పేరుతో మ‌హానేత 1470 కిలోమీట‌ర్ల పాద‌యాత్ర‌
- నేడు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌తో 1472 కిలోమీట‌ర్ల పాద‌యాత్ర పూర్తి చేసిన వైయ‌స్ జ‌గ‌న్‌
- మ‌రో ఏడాదిలో రాజ‌న్న రాజ్యం త‌థ్యం

ప్ర‌కాశం: ప‌్ర‌జ‌ల కోసం దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఒక అడుగు ముందుకు వేస్తే..ఆయ‌న త‌న‌యుడిగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రెండు అడుగులు ముందుకు వేస్తాన‌ని ఇది వ‌ర‌కే చెప్పారు. తండ్రి బాట‌లో ప్ర‌జ‌ల‌కు తోడుగా నిలిచేందుకు వైయ‌స్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర మ‌రో రికార్డు సాధించింది. ఇవాళ్టికి వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర 1472 కిలోమీట‌ర్లు పూర్తి కావ‌డంతో మ‌హానేత దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా ప్ర‌స్థానం పాద‌యాత్ర 1470 కిలోమీట‌ర్ల మైలు రాయిని  వైయ‌స్ జ‌గ‌న్ అధిగ‌మించారు. ఇంకా ఆయ‌న 1530 కిలోమీట‌ర్లు న‌డ‌వాల్సి ఉంది. 

మ‌హానేత ప్ర‌జా ప్ర‌స్థానం.. 
దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్ రాజశేఖరరెడ్డి ప్రజాప్రస్థానం పేరుతో సాహసోపేతమైన పాదయాత్రకు శ్రీకారం చుట్టి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకుని అధికారంలోకి రాగానే వారి క‌ష్టాలు తీర్చారు. మ‌హానేత ప్ర‌జా ప్రస్థానం పేరుతో 1470 కిలోమీట‌ర్ల పాద‌యాత్ర పూర్తి చేయ‌గా, ఆయ‌న త‌న‌యుడు, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గన్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 1472 కిలోమీట‌ర్లు ఇవాళ్టికి పూర్తి చేసుకున్నారు. దీంతో ప్ర‌జ‌లు, పార్టీ నాయ‌కులు నాటి ప్ర‌జా ప్ర‌స్థానాన్ని ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌తో పోల్చుతూ..మ‌ళ్లీ రాజ‌న్న రాజ్యం వ‌స్తుంద‌ని సంబ‌ర‌ప‌డుతున్నారు. ప‌ద‌హేను ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కరవు, కాటకాలతో ప్రజలు అల్లాడుతున్నప్పుడు... నిరాశ, నిస్పృహలతో రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నప్పుడు... తమను ఆదుకునే వారేరని ప్రజలు ఎదురుచూస్తున్న దయనీయ పరిస్థితుల్లో నేనున్నానంటూ ప్రతిపక్ష నేతగా వైయ్‌ రాజశేఖరరెడ్డి 2003 ఏప్రిల్ 9న సాహసోపేతమైన పాదయాత్రకు నడుం బిగించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ప్రారంభించి జూన్ 15 న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు అప్రతిహతంగా కొనసాగించారు. నడి వేసవిలో 40 డిగ్రీల ఎండను సైతం లెక్కచేయకుండా 68 రోజుల పాటు 11 జిల్లాల్లో 56 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోకొచ్చే 690 గ్రామాల ప్రజలను పలకరిస్తూ ఇచ్చాపురం వరకు 1475 కిలోమీటర్ల మేర పాదయాత్ర పూర్తి చేశారు. అప్పటి టీడీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ వైయ‌స్ రాజశేఖరరెడ్డి చేపట్టిన ఈ యాత్రకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో వైయ‌స్ఆర్ స్వల్ప అస్వస్థతకు గురైనా వెంటనే కోలుకుని పాదయాత్రను కొనసాగించారు. ముఖ్యమంత్రి అయ్యాక  రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడంతో పాటు ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్సులు, డ్వాక్రా సంఘాలకు పావలా వడ్డీకి రుణాలు, జలయజ్ఞం, రాజీవ్ ఉద్యోగశ్రీ తదితర పథకాలను ప్రవేశపెట్టి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.

అదే స్ఫూర్తి..ప్ర‌జా శ్రేయ‌స్సే ల‌క్ష్యం
దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి స్ఫూర్తిగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు గ‌తేడాది నవంబ‌ర్ 6న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ను వైయ‌స్ఆర్ జిల్లా నుంచి ప్రారంభించారు. ఇప్ప‌టి వ‌ర‌కు వైయ‌స్ఆర్ జిల్లా, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు పూర్తి చేసుకొని ప్ర‌స్తుతం ప్ర‌కాశం జిల్లాలో పాద‌యాత్ర చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు వైయ‌స్ జ‌గ‌న్ దాదాపు 1475 కిలోమీట‌ర్లు పాద‌యాత్ర పూర్తి చేసుకున్నారు. ఇవాళ్టికి 109వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఈపురు పాలెంలో ముగిసింది. జ‌న‌నేత అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు వింటూ అంద‌రికి ధైర్యం చెబుతూ న‌వ‌ర‌త్నాల‌తో అంద‌రి ముఖాల్లో చిరున‌వ్వులు చూసేందుకు పాద‌యాత్ర చేస్తున్న‌ట్లు ప్ర‌జ‌ల‌కు భ‌రోసా క‌ల్పిస్తున్నారు. నాలుగేళ్ల చంద్ర‌బాబు పాల‌న‌లో విసుగు చెందిన ప్ర‌జ‌లు వైయ‌స్ జ‌గ‌న్ వ‌ద్ద త‌మ బాధ‌లు చెప్పుకుంటూ స్వాంత‌న పొందుతున్నారు. మ‌రో ఏడాదిలో రాజ‌న్న రాజ్యం వ‌స్తుంద‌ని  ప్ర‌జ‌లు విశ్వ‌సిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com