Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 141వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఈద‌ర శివారు నుంచి ప్రారంభం                               చంద్రబాబు చేస్తున్నది దొంగ దీక్ష. ఇదే దీక్ష ఢిల్లీలో చేసి ఉంటే ఉపయోగం ఉండేది: రోజా                               25 మంది ఎంపీలు రాజీనామా చేసి దీక్ష చేస్తే కేంద్రం దిగి వచ్చేది. ఇలాంటి దొంగ దీక్షలు, దగా దీక్షలు చేయాల్సిన అవసరం ఉండేది కాదు: ఎమ్మెల్యే రోజా                                140వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర శోభ‌నాపురం శివారు నుంచి ప్రారంభం                               వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన ఎంపీలు                               సాయంత్రం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లువ‌నున్న వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు                               మైల‌వ‌రం శివారు నుంచి 139వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               ముత్యాల‌పాడు శివారు నుంచి 138వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               నేడు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను క‌లువ‌నున్నారు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు                 
    Show Latest News
వైయస్ జగన్ పథకాలు

Published on : 09-Jul-2017 | 17:59
 

అమరావతిః ప్లీనరీ వేదికగా వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ తొమ్మిది పథకాలను ప్రకటించాడు. అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవడం కోసం అధికారంలోకి రాగానే ఈ పథకాలను అమలు చేయనున్నట్టు తెలిపారు. పాదయాత్రగా అన్నవస్తున్నాడు...ముఖ్యమంత్రిగా అన్న చేస్తాడని చెప్పండని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 

1. వైయస్సార్ రైతు భరోసా
ఐదెక‌రాలలోపు చిన్న స‌న్న‌కారు రైతుల‌కు రూ. 50 వేలు
నేరుగా రైతుల చేతికే అంద‌జేత‌
ఏ పంట పండించుకుంటారో రైతుల ఇష్ట‌మే
 రూ.3 వేల కోట్లతో ధరల స్థీరికరణ నిధి ఏర్పాటు చేసి గిట్టుబాటు ధరలు కల్పిస్తాం. 
వరదలు, కరువు వచ్చినప్పుడు తోడుగా ఉండేందుకు రూ.2 వేల కోట్లతో కెలామిటి రిలిఫ్‌ ఫండ్‌ పెడతాం

2. వైయస్సార్ ఆసరాతో 
డ్వాక్రా సంఘాల పునరుద్ధరణ
వ‌డ్డీలేని రుణాలు అంద‌జేస్తాం
ప్ర‌తి మ‌హిళ‌ను ల‌క్షాధికారిని చేస్తాం

3. పింఛ‌న్లు 
వెయ్యి నుంచి రెండువేలకు పెంపు

4. అమ్మఒడి 
ఒక‌టో త‌ర‌గ‌తి నుంచి ఐదో త‌ర‌గ‌తి వ‌ర‌కు ఒక్కో విద్యార్థికి నెల‌కు 500 
ఐదు నుంచి ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు నెల‌కు 750 
ఇంట‌ర్ విద్యార్థికి నెల‌కు వెయ్యి

5. ప్రతి పేదవాడికి ఇళ్లు 
ఐదేళ్ల‌లో 25 ల‌క్ష‌ల ఇళ్ల నిర్మాణం
మ‌హిళ‌ల పేరుతో ఇంటి రిజిస్ర్టేష‌న్‌
ఇంటి మీద పావ‌లా వ‌డ్డీకే రుణాలు తెచ్చుకునే అవ‌కాశం

6. ఆరోగ్య శ్రీ 
గ‌తంలో మాదిరిగా ఆరోగ్య‌శ్రీ అమ‌లు
విశ్రాంతిలో ఉన్న దీర్ఘకాలిక‌ వ్యాధిగ్ర‌స్తుల‌కు పింఛ‌న్లు 

7. ఫీజు రీయింబర్స్‌మెంట్ 
అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికీ ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ 
విద్యార్థికి ఏడాదికి 20వేల మెస్ బిల్లు

8. యుద్దప్రాతిపదికన సాగు, తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం 

9. 3 దశల్లో మద్య నిషేధం... 
డ‌బ్బున్న వారికే మ‌ద్యం అందుబాటులో ఉండేలా చ‌ర్య‌లు
మ‌ద్యం మానేసిన వారి కోసం ప్ర‌త్యేకంగా డాక్ట‌ర్ల‌తో చికిత్స
..........................................................
అక్టోబ‌ర్ 27 నుంచి జ‌గ‌న‌న్న పాద‌యాత్ర‌
ఇడుపుల‌పాయ నుంచి ఇచ్ఛాపురం వ‌యా తిరుప‌తి
ఆరు నెల‌ల పాటు 3 వేల కిలోమీట‌ర్లు 
కాలినడకన వస్తా....ప్రతి ఒక్కరినీ కలుస్తా
వైయస్ జగన్ ముగింపు ప్రసంగం

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com