Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             లాలూచీ రాజకీయాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య : వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి                               ఆత్రేయపురం నుంచి 190వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               పేరవరం నుంచి 189వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               రాజమహేంద్రవరం రైల్వేష్టేషన్ నుంచి వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రారంభం                               చంద్రబాబు ఎంతటి దుర్మార్గుడంటే గోదావరి పుష్కరాల పేరుతో రూ.2వేల కోట్ల రూపాయలు మింగేశారు: వైయ‌స్ జ‌గ‌న్‌                               మహానేత వైయ‌స్ఆర్‌ హయాంలోనే పోలవరం కుడి, ఎడమ కాలువల పనులు 90 శాతం పూర్తికావడం నిజం కాదా? : వైయ‌స్ జ‌గ‌న్‌                               ఒకే ప్రాజెక్టుకు ఆరుసార్లు శంకుస్థాపన, పూజా కార్యక్రమాలు చేయడం చంద్రబాబుకే చెల్లింది: వైయ‌స్ జ‌గ‌న్‌                               అశేష జ‌న‌వాహినిని న‌డుమ గోదావ‌రి బ్రిడ్జిపై కొన‌సాగుతున్న వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌                               పోల‌వ‌రం ప్రాజెక్టు దివంగ‌త ముఖ్యమంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి క‌ల‌: ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి                 
    Show Latest News
విశాఖ భూ బాగోతంపై టీడీపీ హైడ్రామా

Published on : 15-Jul-2017 | 17:14
 

– టీడీపీ మంత్రులది తలా ఒక మాట 
– కబ్జా జరిగిందని అయ్యన్న చెబితే 
– సీబీఐతో పని జరగదని చంద్రబాబు అంటాడు 
– మంత్రుల మధ్య వైరం పేరుతో అయ్యన్న, గంటా డబుల్‌ గేమ్‌
– సిట్‌ విచారణ పేరుతో నిందితులకు బాబు భరోసా

 విశాఖ భూ కుంభకోణాలపై అధికార టీడీపీ నాయకులు ఆడే డ్రామాలు థ్రిల్లర్‌ సినిమాను తలపిస్తున్నాయి. విశాఖలో భారీగా కుంభకోణాలు జరిగాయని.. దీని వెనుక మంత్రి గంటా శ్రీను హస్తం ఉందని మంత్రి అయ్యన్న పాత్రుడు ఇప్పటికే ఎన్నోసార్లు మీడియా ముందుకొచ్చారు. తన ప్రతిష్టను మసకబార్చేందుకు అసత్య ఆరోపణలు చేస్తున్నారని అయ్యన్నపాత్రుడిపై గంటా ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీబీఐ విచారణ జరిపించాలని గంటా సీఎంకు లేఖ రాస్తాడు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద రచ్చ జరిగింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ప్రెస్‌మీట్‌ పెట్టి అలాంటిదేమీ లేదని కొట్టిపారేశారు. అయినా సిట్‌ విచారణకు ఆదేశిస్తున్నామని చెప్పేసి చేతులు దులుపుకున్నారు. ఇద్దర్నీ పిలిపించి తనకు మాత్రమే అలవాటైన రాజీ సూత్రాన్ని ఇద్దరి ముందూ ప్రవేశపెట్టి పంపించారు. ఇలా ఆ భూ కబ్జా సంఘర్షణకు ముగింపు పలికేశారు. 

అయ్యన్న ఆధారాలతో సహా వచ్చాడు 
ఇద్దర్నీ పిలిపించి చంద్రబాబు నచ్చచెప్పినా  ఇప్పుడు మళ్లీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆధారాలతో సహా ముందుకొచ్చాడు.  దాదాపు 1700 ఎకరాలు కబ్జాకు గురయ్యాయని ఆరోపిస్తూ.. తన వద్ద ఉన్న ఆధారాలను ఇప్పటికే సిట్‌కు అందజేశామని ప్రెస్‌ మీట్‌ పెట్టి మరీ మరోసారి రెచ్చిపోయారు. నిజానికి ఈ కుంభకోణంలో మంత్రి గంటాకు ప్రమేయం ఉందని నిరూపించి ఆయనపై పైచేయి సాధించడమే అయ్యన్న ముందున్న లక్ష్యం. అయితే ఇదంతా ఆ పార్టీ అంతర్గత వ్యవహారం. కారణమేదైనా కావొచ్చు. విశాఖలో భూ కుంభకోణం జరిగిందని అధికార పార్టీకి చెందిన మంత్రే 2014 నుంచి గొంతు చించుకుంటున్నానని చెబుతుంటే ప్రభుత్వానికి రుజువులు ఇంకే కావాలి. 

మంత్రే ఆధారాలతో వస్తే ఆలస్యం దేనికి..
‘2014 నుంచే విశాఖలో భూకబ్జాలు, దందాలు మొదలయ్యాయి. అవి ఇప్పుడు తారస్థాయికి చేరుకున్నాయి.. నెల్లూరు, ప్రకాశం జిల్లాలతోపాటు ఇతర జిల్లాల నుంచి వచ్చిన నేతలు ఇక్కడ ప్రభుత్వ భూములను కబ్జా చేయడమే కాదు.. పేద, మధ్యతరగతి ప్రజలను లక్ష్యంగా చేసుకుని రికార్డుల ట్యాంపరింగ్‌ చేసి వారి భూములను బలవంతంగా లాక్కుంటున్నారు. ఈ భూ దందాలపై నేనేమీ నిన్నా మొన్నా ఆరోపించలేదు. 2014లోనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లా.. త్రిసభ్య కమిటీతో విచారణ జరిపించమని సీఎం చంద్రబాబుకు, రెవెన్యూ మంత్రి కేఈ కష్ణమూర్తి, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడులకు లేఖలు రాశాను’ అని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి సీహెచ్‌ అయ్యన్నపాత్రుడు చెప్పిన మాటలివి. విశాఖ సిటీ, జిల్లాలో జరిగిన భూ కబ్జాలు, దందాలపై తన వద్దనున్న ఆధారాలను ‘సిట్‌’ చీఫ్‌ వినీత్‌ బ్రిజ్‌లాల్‌కు మంత్రి అయ్యన్నపాత్రుడు శుక్రవారం అందజేశారు. సుమారు 1700 ఎకరాలకు సంబంధించిన అవకతవకలు.. కబ్జాలపై పక్కా ఆధారాలతో ఫిర్యాదు చేశానన్నారు.  

ప్రభుత్వ భూములు తనఖా పెట్టి రూ. 190  కోట్ల రుణం
పెదగంట్యాడ మండలంలో ఏర్పాటు చేస్తున్న మెడ్‌టెక్‌ పార్కుకు భూసేకరణ కోసం జరిపిన పరిహారం చెల్లింపుల్లో భారీ అవకతవకలు జరిగాయని..రూ.2 కోట్లకు పైగా బినామీల మాటున కాజేశారని మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ప్రభుత్వ భూముల్లో సాగుబడి లేకపోయినా కొంతమంది పేర్లు సృష్టించి మరీ ఎకరాకు రూ.12 లక్షల చొప్పున పరిహారం ఇచ్చారని.. అంటే ప్రభుత్వ భూములను ప్రభుత్వానికే అమ్మేశారని ఆరోపించారు. రూ.2 కోట్లకు పైగా బినామీల పేరిట స్వాహా చేసిన విషయాన్ని చెప్పారు.  రికార్డులను ట్యాంపర్‌ చేసి ప్రభుత్వ భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టి ఓ బ్యాంకులో రూ.190 కోట్ల రుణం తీసుకుని ఎగనామం పెట్టిన వారి పేర్లు త్వరలోనే చెబుతానని మంత్రి అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. ఇవేకాకుండా.. మరికొన్ని కబ్జాలు..దందాలపై ఆధారాలతో ఈనెల 19న ‘సిట్‌’ను మరోసారి కలసి ఫిర్యాదు చేస్తానన్నారు. 

సిట్‌తో ఒరిగేమిటి..
సిట్‌ దర్యాప్తుతో ఏం తేల్చబోతున్నారో చెప్పాల్సిన పనిలేదు. అందరికీ తెలిసిందే. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ బృందంలో ఒక పోలీస్‌ ఉన్నతాధికారి, రెవెన్యూ డిపార్టుమెంట్‌కు సంబంధించి ఒక అధికారి, న్యాయవ్యవస్థకు సంబంధించి ఒక అధికారి ఉంటారని చెప్పారు. అయితే ఈ సిట్‌ ఎన్ని రోజుల్లో విచారణ పూర్తి  చేస్తుంది.. ఎవరెవర్ని విచారించబోతున్నారు.. తదితర వివరాలు మాత్రం వెల్లడించలేదు. ప్రతిపక్షాలు సిట్‌ మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వం ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ ఆరోపించినప్పుడు దానిపై చంద్రబాబు చెప్పిన లాజిక్‌ నవ్వు తెప్పించేది. సీబీఐ విచారణకు చాలా సమయం తీసుకుంటుందని.. ఎంతకాలంలో పూర్తిచేస్తుందో చెప్పలేమని చెప్పుకొచ్చారు. అయితే అదే సిట్‌ విషయంలోనూ ఎంత సమయంలో పూర్తిచేస్తారో చెప్పలేదు. అలాంటప్పుడు సిట్‌తో ఏం చేస్తారు.. అక్కడ ఎలాంటి కుంభకోణం జరగలేదని తేలుస్తారు. మేం నిప్పులం.. ఎవరి పప్పులు ఉడకవ్‌ అని ప్రచారం చేసుకుంటారు. అయితే కుంభకోణాలపై ఫిర్యాదు చేసేందుకు చివరి రోజు కావడంతో కార్యాలయం ముందు బాధితులు భారీగా బారులుదీరి కనిపించారు. ఈ ఒక్క ∙నిదర్శనం చాలు విశాఖలో కుంభకోణం తీవ్రంగా ఎంత ఎక్కువగా ఉందో.. 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com