Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             తుమ్మికాపాలెం నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 270వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               ప్రజా సంకల్ప యాత్రలో చారిత్రాత్మక ఘట్టం. 3000 కిలోమీటర్ల మైలురాయి చేరుకున్న వైయస్‌ జగన్‌                                వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం లోకి ప్రవేశం                               దేశపాత్రునిపాలెం వద్ద 3వేల కిలోమీటర్ల పైలాన్‌ ఆవిష్కరణ                               ఏపీలో వ్యవసాయ రంగం కుదేలు కావడానికి చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలే కారణం: వైయ‌స్ఆర్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి                                సంక్షేమ రాజ్యం రావాలంటే వైఎస్‌ జగన్‌ సీఎం కావాలి.. కావాల్సిందే: బొత్స సత్యానారాయణ                                ఇంటికో రేటు.. పెన్షన్‌కో రేటు వసూలు: వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నాయ‌కులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌                               కాగ్‌ నివేదికలో పోలవరం అవినీతి బట్టబయలు అయింది: ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి                                వైయ‌స్‌ జగన్‌ పాదయాత్రలో ఊళ్లకు ఊళ్లు కదిలివస్తున్నాయి.. దేశంలోనే వైయ‌స్‌ జగన్‌ వంటి ప్రజాదరణ కలిగిన నేత మరొకరు లేరు: తలశిల రఘురాం                 
    Show Latest News
ప‌శ్చిమాన ఉప్పొంగిన అభిమానం

Published on : 09-Jun-2018 | 18:58
 


పశ్చిమ గోదావరి సరిహద్దుల్లో ప్రజా సంకల్పం 

పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ జగన్  ప్రజా సంకల్పపాదయాత్ర నరసాపురం, రాజోలు, పాలకొల్లు, ఆచంట, పెనుగొండ, తణుకు, కానూరు ప్రాంతాలమీదగా సాగుతోంది. ఈ జిల్లాలో సైతం పెద్ద ఎత్తున యువత యువనేతను కలిసి తమ సమస్యల వినతి పత్రాలు అందించారు. రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆరోగ్యశ్రీ నిరుపయోగం అయ్యిందంటూ ఆవేదన చెందుతున్నఎన్నో కుటుంబాలు ప్రతిపక్షనేతను కలిసాయి. పచ్చని ప్రకృతికి నిలయమైన ఈజిల్లా నేడు అభివృద్ధికి ఆమడ దూరంలో, పచ్చతమ్ముళ్ల దాష్టీకంలో బలైపోతూ ఉందని ప్రజాసంకల్ప యాత్రలో వాపోయారు వైఎస్ జగన్. ప్రజా సంకల్ప యాత్రమరో రెండు మూడు రోజుల్లో తూర్పు గోదావరిజిల్లా లోకి ప్రవేశించనుంది. ఆచంట, తణుకు, నిడదవోలు నియోజకవర్గాలు దాటుకుంటూ పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దుల్లోకి చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.

పాదయాత్రలో నల్లబాడ్జీలతో నిరసన

హోదా విభజన హామీలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కదం తొక్కాయి. చంద్రబాబు ప్రభుత్వంతన అసమర్థతను, అలక్ష్యాన్ని కప్పి పుచ్చుకుంటూ ధర్మపోరాటం, నవనిర్మాణం అంటూ దీక్షలు చేసి, ప్రజలను మోసం చేయడాన్ని నిరసిస్తూ వంచనపై గర్జన కార్యక్రమం నిర్వహించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ప్రతిఒక్కరూ నల్లబాడ్జీలతో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని నిరసించారు. నెల్లూరు వేదికగా జరిగిన సభకు, రాష్ట్రవ్యాప్తంగా మద్దతు లభించింది. అన్నిజిల్లాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో చంద్రబాబు కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. ప్రజాసంకల్ప యాత్రలో ప్రతిపక్ష నేత, ఆయన వెంట నడిచే నాయకులు, ప్రజలుసైతం నల్ల బాడ్జీ ధరించి పాదయాత్రలో పాల్గొన్నారు.  

మీరొస్తేనే న్యాయం జరుగుతుంది

పశ్చిమలో పాదయాత్రలో అడుగడుగునా వినిపించిన మాట జగనన్న సిఎం కావాలనే. మీరొస్తేనే న్యాయం జరుగుతుందన్నా అంటూ కన్నీటి పర్యంతమైన గుండెలెన్నో. రైతులు, కూలీలు, హమాలీలు, చిరు వ్యాపారులు, నిరుద్యోగులు దారిపొడవునా యువనేతకు తమ మనసులోని మాటను చెబుతూనే ఉన్నారు. చంద్రబాబు మాటలకు మోసపోయామని, మళ్లీ అలాంటి తప్పు జరగదన్నా అంటూ పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ చంద్రబాబు ప్రజలను మోసం చేసి, నమ్మించి మరోసారి ఓట్ల కోసం కొత్త డ్రామాలకు సిద్ధమౌతున్నాడన్నారు పశ్చిమ గోదావరి జిల్లా వాసులు.

అన్ని సామాజిక వర్గాలకూ న్యాయం జరుగుతుంది

ప్రజా సంకల్ప పాదయాత్రలో వైఎస్సార కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తమ బాధలు చెప్పుకునే వారికి భరోసా కల్పించారు. వారి సమస్యలను సావధానంగా విన్నారు. కొన్ని వర్గాలకు బాబు చేసిన అన్యాయాన్ని గురించి తెలుసుకుని ఆవేదన చెందారు. రాష్ట్రంలో అన్ని వర్గాలనూ మోసం చేసిన నాయకుడు ఒక్క చంద్రబాబే అన్నారు యువనేత. అదికారంలోకి వచ్చిన వెంటనే అన్ని సామాజిక వర్గాలకూ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

ఏ పార్టీనీ నమ్మకండి

పశ్చిమాన ప్రజా సంకల్పంలో వైఎస్ జగన్ హోదా పై చిత్త శుద్ధి లేని ఏ పార్టీనీ నమ్మకండి అని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అన్యాయంగా విభజించింది, బీజేపీ ఇచ్చిన మాటను మరిచింది, చంద్ర,బాబుకు హోదా అక్కర్లేదు, జన సేనకు తెచ్చే సత్తా లేదు. కనుక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించి, 25 ఎంపీ సీట్లను అందిస్తే హోదా కోసం ఆఖరి క్షణం వరకూ పోరాడతామని చెప్పారు వైఎస్ జగన్. ఎవరు హోదా ఇస్తారో ఆ పార్టీకి మద్దతు ఇవ్వడమే తప్ప, ఎవ్వరితోనూ పొత్తులు పెట్టుకోబోమని మరోసారి ప్రజల ముందు ప్రకటించారు ప్రతిపక్షనేత.

బహిరంగ సభలు -

పాలకొల్లు, పెనుగొండ, తణుకు ప్రాంతాల్లో జరిగిన బహిరంగ సభలకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభించింది. నగర కూడళ్లే కాదు, పరిసరాలన్నీ ప్రజా క్షేత్రాలయ్యాయి. దారులు కనిపించని తీరుగా ప్రతి బహిరంగ సభలోనూ జనాలు పోటెత్తారు.  బహిరంగ సభలో మాట్లాడుతూచంద్రబాబు స్వయంగామోసాలుచేస్తూ నీతులు చెబుతున్నారు అని మండిపడ్డారు వైఎస్ జగన్. అలాంటివాళ్లను తరిమికొట్టాలన్నారు. మోసాలు చేస్తున్న నేతలను తరిమి కొట్టాలన్నారు. నియోజకవర్గానికి కనీస సౌకర్యాలు కల్పించలేని వాళ్లు మంత్రులుగా ఉండటం దౌర్భాగ్యం అని దుయ్యబట్టారు. తాగునీరు లేదు. పంట పొలాలకు నీళ్లు లేవు, పనులు లేవు. రైతులు వలసలు పోతున్నారు. కానీ చంద్రబాబుకు ఇవేమీ పట్టవు అని పశ్చిమగోదావరి జిల్లా వాసుల కష్టాలను గురించి బహిరంగ సభల్లో విపులంగా ప్రస్తావించారు వైఎస్ జగన్.

ప్రజా సంకల్ప యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో పూర్తి కావస్తోంది. ఈ జిల్లా సరిహద్దు ప్రజలే కాదు, తూర్పు గోదావరి జిల్లా సరిహద్దు ప్రజలు కూడా వైఎస్ జగన్ రాకకోసం ఎదురు చూస్తున్నారు. ఘనమైన వీడ్కోలు, సాదరమైన స్వాగతాల ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నారు.

 

 

 

సంబంధిత వార్తలు


ప్రతి ఇంటికీ నవరత్నాలు
YSRCP Navaratna YS Rajashekar Reddy YS Rajashekar Reddy Emperor of Corruption YS Rajashekar Reddy Central Assistance to AP Prajalachentha
Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com